IND vs PAK Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే!
India vs Pakistan ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు ఉండనుందో సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే దాదాపు టోర్నీ షెడ్యూల్ ఖరారైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యుల్ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈ టోర్నీ షురూ కానుంది. పాకిస్థాన్, యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. పాకిస్థాన్‍కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో తటస్థ వేదికగా యూఏఈని ఐసీసీ ఎంపిక చేసుంది. ఈ టోర్నీలో తన మ్యాచ్‍లను యూఐఈలోనే భారత్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మెగా ఫైట్ ఏ తేదీన జరగనుందో సమాచారం వెల్లడైంది.
భారత్, పాక్ మ్యాచ్ డేట్ ఇదే!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23వ తేదీన మ్యాచ్ జరగనుందని సమాచారం వెల్లడైంది. ఈ విషయాన్ని క్రిక్‍ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది. యూఏఈ క్రికెట్ బోర్డు హెడ్ షేక్ నయాన్ అల్ ముబారక్‍ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్‍సిన్ నఖ్వి తాజాగా కలిశారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తటస్థ వేదికగా యూఏఈని ఎంపిక చేసినట్టు పీసీబీ ప్రతినిథి అమీర్ మీర్ వెల్లడించారు.
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‍తో లీగ్ మ్యాచ్‍తో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పోరు మొదలుట్టనుందని తెలుస్తోంది. పాకిస్థాన్‍తో టీమిండియా ఫిబ్రవరి 23న టీమిండియా తలపడనుంది. న్యూజిలాండ్ 2న న్యూజిల్యాండ్‍తో ఆడనుందని సమాచారం. త్వరలోనే ఐసీసీ అధికారికంగా టోర్నీ పూర్తి షెడ్యూల్ ప్రకటించనుంది.
దుబాయ్‍లోనే..
ఛాంపియన్స్ ట్రోఫీలో తన మ్యాచ్‍లను భారత్.. దుబాయ్ వేదికగానే ఆడనుందని సమాచారం. నాకౌట్ మ్యాచ్‍లకు క్వాలిఫై అయితే ఈ మ్యాచ్‍లు కూడా అక్కడే జరగనున్నాయి. ఫిబ్రవరి 19న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీలో జరిగే మ్యాచ్‍తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మొదలుకానుంది. మార్చి 4, మార్చి 5 తేదీల్లో సెమీఫైనల్స్ ఉంటాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది. లాహోర్ వేదికగా తుదిపోరు జరగాల్సి ఉంది. ఒకవేళ భారత్ క్వాలిఫై అయితే ఈ ఫైనల్ యూఏఈలో జరుగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్‍లు ఇలా..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు లీగ్ దశలో రెండు గ్రూప్‍లు ఆడతాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్‍బీలో అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఉంటాయి. పూర్తి షెడ్యూల్, వివరాలను ఐసీసీ త్వరలోనే వెల్లడించనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. దీంతో హైబ్రీడ్ మోడల్ అమలవుతోంది. భారత్ ఆడే మ్యాచ్‍లు యూఏఈలో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‍లో పాకిస్థాన్ వేదికగా సాగనున్నాయి. 2027 వరకు భారత్‍లో జరిగే అన్ని ఐసీసీ టోర్నీలకు కూడా హైబ్రీడ్ మోడల్ ఉండనుంది. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‍లు ఇండియాలో కాకుండా తటస్థ వేదికల్లో జరుగుతాయి.