Rahu Transit: 18 ఏళ్ల తర్వాత శని ఇంట్లోకి రాహువు ప్రవేశం.. ఈ 4 రాశుల వారికి కొత్త సంవత్సరం ఫుల్లు లాభాలు-rahu transit after 18 years rahuvu in shani zodiac sign these zodiac signs will get many benefits even student employees ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Transit: 18 ఏళ్ల తర్వాత శని ఇంట్లోకి రాహువు ప్రవేశం.. ఈ 4 రాశుల వారికి కొత్త సంవత్సరం ఫుల్లు లాభాలు

Rahu Transit: 18 ఏళ్ల తర్వాత శని ఇంట్లోకి రాహువు ప్రవేశం.. ఈ 4 రాశుల వారికి కొత్త సంవత్సరం ఫుల్లు లాభాలు

Peddinti Sravya HT Telugu
Dec 23, 2024 09:30 AM IST

Rahu Transit: 2025లో శని రాశిలోకి రాహువు ప్రవేశం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండబోతోంది. కెరీర్ లో పురోగతితో పాటుగా ఆర్థిక స్థితి ఇది వరకు కంటే మెరుగు పడుతుంది. 2025లో రాహువు సంచారం ఏయే రాశులు వారికి ప్రయోజనం కలుగుతుంది అనేది చూద్దాం.

Rahu Transit: 18 ఏళ్ల తర్వాత శని ఇంట్లోకి రాహువు ప్రవేశం
Rahu Transit: 18 ఏళ్ల తర్వాత శని ఇంట్లోకి రాహువు ప్రవేశం

18 ఏళ్ల తర్వాత రాహువు శని ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు. రాహువు మే 18, 2025న కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఇలా శని ఇంట్లోకి ప్రవేశించడంతో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

yearly horoscope entry point

జ్యోతీష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువులు ఎప్పుడూ రివర్స్ లో కదులుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2025లో శని రాశిలోకి రాహువు ప్రవేశం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండబోతోంది. దీంతో కెరీర్ లో పురోగతితో పాటుగా వ్యాపారంలో ఆర్థిక స్థితి ఇది వరకు కంటే మెరుగు పడుతుంది. 2025లో రాహువు సంచారం ఏయే రాశులు వారికి ప్రయోజనం కలుగుతుంది అనేది చూద్దాం.

వృషభ రాశి:

2025లో రాహువు సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రాహువు సంచారం వలన వృషభ రాశి వారికి చాలా బావుంటుంది. వారి సామర్థ్యం పెరుగుతుంది. కొత్త సంవత్సరంలో వ్యాపారం కోసం వేసుకున్న ప్రణాళికలు నిజమవుతాయి. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కి పొందుతారు.

మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండొచ్చు. బంధం మధురంగా ఉంటుంది. కోపం అదుపులో ఉంటుంది. ఈ కొత్త ఏడాది రాహువు సంచారం ఆరోగ్యపరంగా కూడా శుభప్రదంగా ఉంటుంది.

కన్య రాశి:

రాహువు సంచారం కన్యా రాశి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. 2025లో ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన పెరుగుదల ఉంటుంది. రాహువు సంచారం కారణంగా పెద్ద లక్ష్యాలని సాధించగలుగుతారు.

వ్యాపారస్తులు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కూడా వివిధ మార్గాలు ఉంటాయి. పెట్టుబడి నుంచి మంచి లాభాలని పొందవచ్చు. వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే ఆఫీసుల్లో పెద్ద బాధ్యతని కూడా పొందుతారు.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి చెందిన వ్యక్తులకి రాహువు సంచారం శుభప్రదంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. ఉద్యోగస్తులకి పదోన్నతులు కలుగుతాయి.

డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కెరియర్లో మంచి విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులు ఆర్థిక పురోగతిని చూస్తారు. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు సామాజిక సేవలో పేరు ప్రఖ్యాతాలని పొందుతారు. బ్యాంకు బాలన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

కుంభ రాశి:

రాహువు 18 సంవత్సరాల తర్వాత ఈ రాశిలోకి ప్రవేశించబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాహువు సమాచారం కుంభరాశి వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో అనేక ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వ్యాపారం చేసే వాళ్లకు కలిసి వస్తుంది.

రాహువు సంచారంతో వ్యాపారం నుంచి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఏడాదిలో మీరు పోటీ పరీక్షలకి సంబంధించిన కొన్ని శుభవార్తలను వింటారు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. జీతాల పెంపు ప్రయోజనాన్ని కూడా పొందుతారు కుటుంబంలో సంతోషం ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner