Vastu: ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. ఇంట్లో ఈ 3 చోట్ల డబ్బులు పెట్టకండి.. ఇలా చేస్తే మాత్రం కాసుల వర్షమే-vastu tips do not keep money in these places and to get money keep money in this place this will helps to get wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu: ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. ఇంట్లో ఈ 3 చోట్ల డబ్బులు పెట్టకండి.. ఇలా చేస్తే మాత్రం కాసుల వర్షమే

Vastu: ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. ఇంట్లో ఈ 3 చోట్ల డబ్బులు పెట్టకండి.. ఇలా చేస్తే మాత్రం కాసుల వర్షమే

Peddinti Sravya HT Telugu
Dec 23, 2024 08:00 AM IST

Vastu: డబ్బుకి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు?, డబ్బుల్ని ఏ దిశలో పెట్టాలి? ఎక్కడెక్కడ డబ్బులను దాస్తే చెడు ఫలితం కనబడుతుంది వంటి విషయాలు తెలుసుకుందాం. ఈ పొరపాట్లు చేస్తే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Vastu: ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. ఇంట్లో ఈ 3 చోట్ల డబ్బులు పెట్టకండి
Vastu: ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. ఇంట్లో ఈ 3 చోట్ల డబ్బులు పెట్టకండి (pexels)

వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన ఎంతో మంచి ఫలితం కనబడుతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండాలంటే, డబ్బుకి సంబంధించిన విషయాల్లో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండడం మంచిది.

yearly horoscope entry point

మరి డబ్బుకి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు?, డబ్బుల్ని ఏ దిశలో పెట్టాలి? ఎక్కడెక్కడ డబ్బులను దాస్తే చెడు ఫలితం కనబడుతుంది వంటి విషయాలు తెలుసుకుందాం. ఈ పొరపాట్లు చేస్తే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చాలా మంది డబ్బులు దాచుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు మాత్రం చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు ఎటువైపు అస్సలు ఉంచకూడదు..? వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు దాచుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. డబ్బులు దాచేటప్పుడు ఏ దిశల్లో పెట్టకూడదో తెలుసుకుని పాటించడం మంచిది.

డబ్బును ఎక్కడెక్కడ పెట్టడం వలన నష్టాలు ఎదుర్కోవాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పొరపాట్లను చేసినట్లయితే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమత అవ్వాల్సి ఉంటుంది.

చీకటిగా ఉన్న ప్రదేశం

వాస్తు ప్రకారం చీకటిగా ఉన్న డబ్బులు దాచుకోకూడదు. ఇలాంటి చోట డబ్బుని పెట్టడం వలన ఆర్థిక నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చీకట్లో డబ్బుల్ని పెట్టడం కూడా సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది.

టాయిలెట్ల పక్కన

ఎప్పుడూ కూడా డబ్బులని టాయిలెట్లకు పక్కన ఉంచకండి. ఇలా ఉంచడం వలన కూడా ధనం ప్రవాహం ఆగిపోతుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంపద పోతుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. కనుక, వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా టాయిలెట్లకు పక్కన డబ్బులు పెట్టొద్దు.

దక్షిణం వైపు

వాస్తు ప్రకారం దక్షిణం వైపు డబ్బులు దాచుకోకూడదు. దక్షిణం వైపు డబ్బులు దాచుకోవడం వలన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దక్షిణం యముడు దిక్కు. ఇక్కడ డబ్బుల్ని ఉంచితే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

ఏ దిశలో డబ్బులను పెట్టొచ్చు?

ఉత్తరం వైపు డబ్బుల్ని పెట్టొచ్చు. డబ్బులు దాచుకునేటప్పుడు ఉత్తరం వైపు పెట్టడం మంచిది. ఉత్తరం వైపు డబ్బులు ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. ధనం పెరుగుతుంది. ఉత్తరం వైపు కుబేరుడు దిక్కు కాబట్టి ఈ దిశలో డబ్బులు ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు వంటివి కలగవు. సంతోషంగా ఉండొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner