Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 6 స్టాక్స్​లో ట్రేడింగ్​కి ఛాన్స్​..-stocks to buy today 23rd december 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 6 స్టాక్స్​లో ట్రేడింగ్​కి ఛాన్స్​..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ 6 స్టాక్స్​లో ట్రేడింగ్​కి ఛాన్స్​..

Sharath Chitturi HT Telugu
Dec 23, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1176 పాయింట్లు పడి 78,042 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 364 పాయింట్లు కోల్పోయి 23,587 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 816 పాయింట్లు పడి 50,759 వద్దకు చేరింది.

ఈ స్టాక్ మార్కెట్ పతనంలో.. నిఫ్టీ 50 ఇండెక్స్ దాని 23,800 వద్ద ఉన్న 200-డీఈఏ మద్దతు కంటే దిగువకు పడిపోయింది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్​లో బేర్​ సెంటిమెంట్​ని సూచిస్తోంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇటీవల కనిష్ట స్థాయి 23,250కి చేరువలో ఉంది. ఈ మద్దతు అంతంతమాత్రంగానే ఉంటుందా లేక 50 షేర్ల ఇండెక్స్ కొత్త కనిష్టాన్ని తాకుతుందా అనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3597.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1374.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

డిసెంబర్​​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 4121.22 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 16546.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.18శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.09శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.03 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఫెడర్స్ హోల్డింగ్: రూ.76 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.78.80, స్టాప్​ లాస్​ రూ.74.60;

ఐఎఫ్​సీఐ: రూ .60.60 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్​ రూ .63.50, స్టాప్ లాస్​ రూ .58.70.

ధనలక్ష్మి బ్యాంక్: రూ.41 నుంచి రూ.42, టార్గెట్​ రూ.44 - రూ.50, స్టాప్ లాస్ రూ.38

ఎన్​హెచ్​పీసీసి: రూ .80 నుండి రూ .81.50, టార్గెట్​ రూ .84- రూ .90 వద్ద , స్టాప్ లాస్​ రూ .77.80.

ఏఎస్ఐ ఇండస్ట్రీస్: రూ.53.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.80, స్టాప్ లాస్ రూ.46

నేషనల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్: రూ .67 వద్ద కొనండి, టార్గెట్ రూ .100, స్టాప్ నష్టం రూ .60

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం