Karthika Deepam December 23rd Episode: అద్దెకు డబ్బు లేక కార్తీక్ ఇక్కట్లు.. బాధపడిన దీప.. జ్యోత్స్న మాటతో పారు కంగారు-karthika deepam today episode december 23 karthik struggles to play rent sumitra fires on jyothsna stat maa tv serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam December 23rd Episode: అద్దెకు డబ్బు లేక కార్తీక్ ఇక్కట్లు.. బాధపడిన దీప.. జ్యోత్స్న మాటతో పారు కంగారు

Karthika Deepam December 23rd Episode: అద్దెకు డబ్బు లేక కార్తీక్ ఇక్కట్లు.. బాధపడిన దీప.. జ్యోత్స్న మాటతో పారు కంగారు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 23, 2024 09:14 AM IST

Karthika Deepam 2 Today Episode December 23: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. ఇల్లు వదిలి బయటికి వచ్చేసిన కార్తీక్ ఫ్యామిలీ గుడికి వెళుతుంది. ఆ తర్వాత అద్దెకు ఇల్లు దొరికినా కార్తీక్‍కు డబ్బు ఇబ్బంది ఎదురవుతుంది. జ్యోత్స్నపై సుమిత్ర మరింత కోప్పడుతుంది. ఈ ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deepam Today December 23: అద్దెకు డబ్బు లేక కార్తీక్ ఇక్కట్లు.. బాధపడిన దీప.. జ్యోత్స్న మాటతో పారు కంగారు
Karthika Deepam Today December 23: అద్దెకు డబ్బు లేక కార్తీక్ ఇక్కట్లు.. బాధపడిన దీప.. జ్యోత్స్న మాటతో పారు కంగారు

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 23) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తాతతో సవాల్ చేసి ఇంటి నుంచి బయటికి వచ్చేసిన కార్తీక్.. కుటుంబంతో కలిసి రోడ్డుపై నడుస్తుంటాడు. కార్తీక్, దీప, కాంచన, శౌర్య, అనసూయ బాధగా అలా కాలి నడకనే వెళుతుంటారు. దీప కన్నీరు పెట్టుకుంటుంది. కారు లేకుండా ఊరు ఎలా వెళతామని, నడవడం ఇబ్బందిగా ఉందని కార్తీక్‍ను శౌర్య అడుగుతుంది. ఎత్తుకోనా అని కార్తీక్ అంటే.. నువ్వు నడుస్తున్నావ్ కదా.. నిన్నెవరు ఎత్తుకుంటారని అమాయకంగా అంటుంది శౌర్య. కార్తీక్ కూడా ఎమోషనల్ అవుతాడు.

ఈ అడుగులు విడిపోవు

పంతంతో ఇలా చేశాడని అనుకుంటున్నావా దీప అని కార్తీక్ అడుగుతాడు. తాను ఎలా ఆలోచిస్తానో మీకు తెలియదా అని దీప అంటుంది. పెళ్లి సమయంలో వేయని ఏడడుగులు ఇప్పుడు వేస్తున్నానని కార్తీక్ చెబుతాడు. అప్పుడు వేసి ఉంటే అగ్నిదేవుడు ఒక్కడే సాక్షిగా ఉండే వాడని.. ఇప్పుడు పంచభూతాలు సాక్షిగా ఉన్నాయంటూ అంటాడు. “ఈ అడుగులు వెళ్లినంత వరకు ఇలాగే కలిసి ముందుకు వెళతాయి. కష్టాలు ఎదురొచ్చినా.. కన్నీళ్లు ఎదురొచ్చినే బాధలే పారిపోవాలి కానీ.. ఈ అడుగులు విడిపోవు దీప” అని కార్తీక్ అంటాడు.

అదే నిజమైంది

ఇలా జరిగినందుకు మీకు బాధగా లేదా అని దీప అడుగుతుంది. సూటిగా సమాధానం చెప్పకుండా.. నన్ను భర్తను చేసుకున్నందుకు నువ్వు ఈ బాధలు భరించాల్సిందేనని ఈ కష్టాలు వచ్చాయని కార్తీక్ అంటాడు. “నన్ను అందరూ నువ్వు నష్టజాతకురాలివి. నీతో ఉన్న వాళ్లందరికీ నీ దరిద్రం పడుతుందని అనే వారు. కాలం ఈ రోజు అది నిజం చేసింది బాబు” అని దీప అంటుంది. తనకు ఆశ్రయం ఇచ్చి మీరు కూడా రోడ్డు మీదికి వచ్చారని, ఇది కత్తికోతలా ఉందని దీప అంటుంది. తాను లేకపోతే ఏసీ కారులో తిరిగే వారని, ఇప్పుడు ఎర్రటి ఎండలో నడుస్తున్నారంటుంది. డబ్బును వదిలి పేదిరికంలో బతకడం కష్టమని, తన వల్లే ఇదంతా జరిగిందనేలా దీప మాట్లాడుతుంది. రాజ్యాన్ని వదిలేప్పుడు భార్యను వెంట తీసుకెళ్లిన రాజు కథ చెబుతాడు కార్తీక్. రాజులా మీరే కనిపిస్తున్నారు కార్తీక్ బాబు అని మనసులో అనుకుంటుంది దీప.

గుడిలోకి వెళ్లిన కార్తీక్ ఫ్యామిలీ

తనకు కాళ్లు నొస్తున్నాయని, ఇక నడవలేనని శౌర్య అంటుంది. అప్పుడు దగ్గర్లో ఓ గుడి కనిపిస్తుంది. దీంతో ఇక్కడికి అందరూ వెళతారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందని అనసూయ అంటే.. తలరాతను ఎవరూ తప్పించలేరని, ఏదీ మన చేతుల్లో లేదని కాంచన బాధగా చెబుతుంది. ఎక్కడికి వెళ్లాలి కార్తీక్ ఆలోచిస్తాడు కాంచన కూడా అదే అడుగుతుంది. ఉండేందుకు నీడ కావాలంటుంది. కడెం బాబాయికి ఫోన్ చేస్తానని దీప అంటే.. బయటికి వాళ్లు వద్దు.. విషయం తెలిసిపోతుందని కాంచన అంటుంది. కార్తీక్ కూడా అందుకే తన స్నేహితులకు చెప్పడం లేదంటాడు. దాసుకు ఫోన్ చేయాలని దీప అంటే.. కాంచన కూడా ఇదే మంచి ఆలోచన అని సమర్థిస్తుంది.

కాశీ, స్వప్నతో వచ్చిన దాసు

దాసుకు ఫోన్ కాల్ చేస్తాడు కార్తీక్. ఆటోలో దాసు, కాశీ, స్వప్న వస్తారు. ఏమైంది అన్నాయ్యా అని కార్తీక్‍కు స్వప్న అడుగుతుంది. ఒకడివే రమ్మనా కదా అని దాసుతో కార్తీక్ అంటాడు. నా కంగారు చూసి అడిగితే చెప్పకుండా ఉండలేకపోయానని దాసు అంటాడు. గుడిలో ఎందుకున్నారంటూ కాశీ, స్వప్న అడుగుతాడు. దీంతో తాత శివన్నారాయణతో జరిగిన గొడవ, చేసిన సవాల్, ఇంటి నుంచి బయటికి వచ్చేయడం గురించి కార్తీక్ వారితో చెబుతాడు.

దాసు ఇంటికి వెళ్లేందుకు నో

అక్కడ ఉండి చేతకాని వాడిని అనిపించుకోలేక సవాల్ చేసి బయటికి వచ్చేశానని కార్తీక్ అంటాడు. ఎంత పని చేశావ్ అల్లుడు.. న్యాయంగా అది నీకు రావాల్సిన ఆస్తి అని దాసు అంటాడు. అది నేను కష్టపడినంది కాదు.. దానిపై నేనెందుకు ఆశ పడాలని, నాది నేనే సంపాదించుకుంటానని కార్తీక్ చెబుతాడు. మంచి పని చేశావని స్వప్న అంటుంది. తమ ఇంటికి రావాలని అడుగుతుంది. దీంతో దీనికి కార్తీక్ వద్దు అంటాడు. తన శక్తి సామర్థ్యాలపై బతికి చూపించేందుకు, గెలిచేందుకు బయటికి వచ్చానని, ఇప్పుడు మీ ఇంటికి వస్తే తాతతో చేసిన సవాల్‍‍కు అర్థముండదని కార్తీక్ అంటాడు.

అద్దె ఇల్లు చూసిన దాసు

శివన్నారాయణ సొంత మనవరాలిని, సొంత వారిని బయటికి పంపేశాడని, ఎందుకు మనసు ఇంత రాటుదేలిందని దాసు లోలోపల బాధపడతాడు. అద్దె ఇల్లు చూడాలని దాసుతో కాంచన అంటుంది. ఓ ఇల్లు ఉందని దాసు చెబుతాడు. దీంతో అద్దె ఇంటికి కార్తీక్ ఫ్యామిలీ బయలుదేరుతుంది.

కార్తీక్‍ను మళ్లీ తీసుకొద్దాం

కార్తీక్ వాళ్లు ఎక్కడ ఉన్నారో చూసి మళ్లీ తీసుకొద్దాం మామయ్య అని శివన్నారాయణను కన్నీళ్లుతో అడుగుతుంది సుమిత్ర. తాను వదినను బతిమిలాడతానని చెబుతుంది. తనతోనే సవాల్ చేసి వెళ్లిపోయారని, మనసు మార్చుకొని వస్తే తాను కాదనని శివన్నారాయణ అంటాడు. అలాగని వాళ్ల కోసం నేను వెళ్లనని తెగేసి చెబుతాడు. నేను వెళతానని సుమిత్ర అంటే.. నేను అంటే నాకు కుటుంబం అని శివన్నారాయణ అంటాడు. కాంచన, కార్తీక్ కూడా మన కుటుంబమే కాదా అని అరుస్తుంది సుమిత్ర. మామయ్యతో మీరైనా మాట్లాడండి అని దశరథ్‍ను సుమిత్ర అడుగుతుంది. తాను కార్తీక్‍ను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా వినలేదని దశరథ్ చెబుతాడు. తాళి తప్ప అన్ని వస్తువులు తీసి నాన్న ముందు పెట్టి కాంచన వెళ్లిపోయిందని అంటాడు. దీంతో సుమిత్ర మరింత బాధపడుతుంది.

దీపే నీ కూతురు.. సుమిత్రతో జ్యోత్స్న

దశరథ్ వెళ్లిపోయాక.. జ్యోత్స్నపై సుమిత్ర మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జ్యోత్స్ననే కార్తీక్ వాళ్లను గెంటేసిందనేలా అంటుంది. స్వీట్ తినండి మీకు శుభవార్తే కదా అని పారిజాతంతో వెంటకారంగా చెబుతుంది సుమిత్ర. మమ్మీ అని జ్యోత్స్న అంటే.. “నోరు ముయ్.. నువ్వు అసలు నా కూతురివేనా” అని సుమిత్ర అరుస్తుంది. “నేను నీ కూతురు కాదు. ఆ దీపే నీ కూతురు” అని జ్యోత్స్న అరుస్తుంది. దీంతో సుమిత్ర షాక్ అవుతుంది. దీంతో జ్యోత్స్న ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని పారిజాయం కంగారు పడుతుంది. ఇంతలో చాలా.. ఈ మాట వినడానికి నీకు చాలా సంతోషంగా ఉందని కదా జ్యోత్స్న కవర్ చేస్తుంది. రెండు కుటుంబాలు కలిసి ఉండాలని తాను కోరుకుంటూ ఉంటే.. పంతాలు నెగ్గించుకోవాలని కోరుకుంటున్నారని ఫైర్ అవుతుంది. మీరు గెలిచారు.. నేను ఓడానని ఏడుస్తూ వెళుతుంది సుమిత్ర.

అలా అంటావేంటి.. పారు కంగారు

“నువ్వేంటే నేను నీ కూతురిని కాదంటావ్” అని పారిజాతం కంగారుగా ఉంటుంది. మరి అలా అంటే ఏం చేయమంటావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. ఆ దీపే నీ కూతురు అంటావేంటి అని పారు అంటుంది. “అదే నిజం కాబట్టి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. దీప తెలివిగా ఫ్యామిలీనే తీసుకెళ్లందని పారిజాతం అంటే.. బావ ఇలా చేస్తాడని తాను అనుకోలేదని జ్యోత్స్న అంటుంది. గుణపాఠం నేర్చుకొని మళ్లీ వస్తాడని, నీ విలువ తెలుస్తుందని పారిజాతం అంటుంది. కార్తీక్ బావ తప్పు తెలుసుకొని వస్తాడని జ్యోత్స్న కూడా అనుకుంటుంది.

అద్దె విని కంగారు

దాసు ఓ అద్దె ఇంటి వద్దకు కార్తీక్ ఫ్యామిలీని తీసుకొస్తాడు. శౌర్య ప్రశ్నలు అడిగితే.. ఇక మీద ఇక్కడే ఉండబోతున్నామని కార్తీక్ అంటాడు. శౌర్యకు సర్దిచెబుతాడు. మన ఇంటికి తర్వాత వెళదామని చెబుతుంది. అద్దె రూ.20వేలు, మూడు నెలల అడ్వాన్స్ అని ఓనర్ చెప్పడంతో దీప కూడా కంగారు పడుతుంది. మూడు నెలల అడ్వాన్స్ అంటే కష్టమని కార్తీక్ అనడంతో.. “ఎంతైనా నేను కడతాను అనే నోటి నుంచి.. అంత కట్టలేను అనే మాట వింటున్నాను. కార్తీక్ బాబు పరిస్థితికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అర్థమవుతోంది” అని దీప బాధపడుతుంది.

డబ్బు లేక కార్తీక్ ఇబ్బందులు.. ఫోన్ తాకట్టు

డబ్బు తాను ఇస్తానని కాశీ అనగా కార్తీక్ వద్దంటాడు. రెండు నెలల అడ్వాన్స్ తీసుకోండని ఓనర్‌కు కార్తీక్ చెబుతాడు. “ఆ డబ్బులు కూడా లేవు కదా. తర్వాత ఇస్తానని వీళ్లందరి ముందు అడిగితే బాగోదు” అని మనసులో అనుకుంటాడు. దాసు, కాశీ, స్వప్నను వెళ్లిపోవాలని కార్తీక్ అంటాడు. భోజనం తీసుకొస్తానని స్పప్న అంటే వద్దంటాడు. దీంతో స్వప్న కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోతారు. కాంచన, అనసూయ కూడా ఇంట్లోకి వెళ్లేందుకు లోపలికి వెళతారు. దీపను కూడా వెళ్లాలని కార్తీక్ చెబుతాడు. అడ్వాన్స్ ఇస్తే బయలుదేరతానని ఓనర్ అంటాడు. “నా దగ్గర డబ్బులు లేవు. అడ్వాన్స్‌గా ఈ మొబైల్ మీ దగ్గర ఉంచండి” అని ఇంటి ఓనర్ చేతిలో ఫోన్ పెడతాడు కార్తీక్. ఏంటండి ఇది అని ఓనర్ అంటాడు. డబ్బులు అందగానే డబ్బులు ఇచ్చి ఈ ఫోన్ తీసుకుంటానని కార్తీక్ అంటాడు. ఇదంతా వెనుక నుంచి చూస్తూ బాధపడుతుంది దీప. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 23) ముగిసింది.

Whats_app_banner

సంబంధిత కథనం