Gunde Ninda Gudi Gantalu: అప్పు తీరే వరకు నో రొమాన్స్ - మీనాకు బాలు రూల్ - సంజుతో పెళ్లికి మౌనిక గ్రీన్‌సిగ్నల్
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో మౌనిక పెళ్లి చూపులు కావడంతో ప్రభావతి తెగ హడావిడి చేస్తుంది. మాటి మాటికి కోటీశ్వరుల సంబంధం అంటూ మురిసిపోతుంది. ఆమె హడావిడి చూసి బాలు, సత్యం సెటైర్లు వేస్తారు.
Gunde Ninda Gudi Gantalu: మౌనిక పెళ్లి చూపుల కోసం ఏ చీర కట్టుకోవాలో తెలియక మీనా డైలామాలో పడిపోతుంది. తనకు ఉన్న వాటిలో నుంచి ఓ మంచి చీరను సెలెక్ట్ చేయమని బాలును కోరుతుంది. నేను ఏ చీర కట్టుకుంటే బాగుంటానో మీకు తెలుసు కదా అని అంటుంది. బూడిద రంగు, సిమెంట్ రంగు కాకుండా ఏ కలర్ కట్టుకున్నా నాకు నచ్చుతుందని బాలు అంటాడు. అయినా పెళ్లి చూపులు సవ్యంగా జరగాలి కదా అని అంటాడు.
మా అమ్మ చూసిన సంబంధం...
ఛీ ఛీ అవేం మాటలు అంటూ మీనా కోపంగా అంటుంది. అది మా అమ్మ చూసిన సంబంధం కదా..అదే నా డౌట్ అని మీనాతో బాలు అంటాడు. ఇంతకుముందు రిచ్ సంబంధం అని తిండుబోతుగాడిని తీసుకొచ్చింది. డబ్బు, పరపతి ఉంటే చాలు..వాడి వెనుక ఎన్ని అవలక్షణాలు పట్టించుకోదని తల్లిపై బాలు సెటైర్లు వేస్తాడు. ఎవరైనా ఆడపిల్లను ఉన్నవాళ్లకే ఇవ్వాలని చూస్తారు.
మా అమ్మవాళ్లు నన్ను మీ ఇంటికి కోడలిగా పంపించలేదా అని మీనా అంటుంది. మీ అమ్మవాళ్లు ఎక్కడ చేశారు...మా నాన్న జాలిపడి...నిన్ను నాకు ఇచ్చి పెళ్లి నా కొంప ముంచాడని బాలు పంచ్‌లు వేస్తాడు.
కప్పు దగ్గరకు వస్తే చాలు అప్పు తీరాలని అంటూ దూరం పెడితే ఎలా అని రొమాంటిక్‌గా బాలును మీనా అడుగుతుంది. నువ్వు తిరిగి తిరిగి అక్కడికే రావద్దని బాలు రిప్లై ఇస్తాడు. అక్కడికి రాకపోతే ఎలా బాలు భుజంపై ప్రేమగా చేతితో రాస్తుంది మీనా.
మీకు పాప కావాలా...బాబు కావాలా అని అడుగుతుంది. అప్పు తీరాలి...అప్పటివరకు నాకు వేరు దిండు, దుప్పటి కావాలనిఅంటాడు. చాప తీసుకొని కిందపడుకుంటాడు. పెళ్లిచూపుల్లో పెళ్లికొడుకుతో పాటు వాళ్ల కన్నవాళ్లు ఎలాంటి వారో కనిపెట్టమని మీనాకు చెబుతాడు బాలు.
ప్రభావతి హడావిడి...
మౌనిక పెళ్లి చూపుల సందర్భంగా తెగ హడావిడి చేస్తుంది ప్రభావతి. రాత్రికి రాత్రి కోటి రూపాయల లాటరీ తగిలిన వాళ్లు కూడా ఇంత హడావిడి చేయరని భార్యపై సత్యం పంచ్‌లు వేస్తాడు. తొందరపడి పెళ్లికి ఓకే చెప్పొద్దు...వాళ్లు ఎలాంటి వాళ్లో ముందు తెలుసుకోవాలని బాలు అంటాడు.
వాళ్లు ఎంత కోటీశ్వరులో చెప్పడానికి వెండిగ్లాస్‌లో ఇచ్చిన జ్యూస్ చాలు...ఇంటికెళ్లిన ముత్తైదువలకు చీర తాంబూలం పెట్టారంటే వాళ్లు ఎంత మర్యాదస్తులో అర్థం కావడం లేదా సంజు ఫ్యామిలీని వెనకేసుకొనివస్తుంది ప్రభావతి.
ప్రభావతి కంగారు...
తనకు ఓ కారు ట్రిప్ పడిందని. పెళ్లిచూపులకు ఉండటం లేదని బాలు అంటాడు. బాలు ఉంటే పెళ్లిచూపులు చెడగొడతాడని ప్రభావతి కంగారు పడుతుంది. ట్రిప్‌కు వస్తానని వాళ్లకు ఇచ్చిన మాట పోతుంది...మనిషికి మాటే ముఖ్యమని తెగ ఓవరాక్షన్ చేస్తుంది.
మీనాకు అవమానం...
మౌనిక కోసం చీర సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది మీనా. కానీ ఆ చీర వద్దని ప్రభావతి అంటుంది. నువ్వు తెచ్చిన చీర కట్టుకుంటే వచ్చినవాళ్ల ముందు మౌనిక పనిమనిషిగా కనిపిస్తుందని ప్రభావతి అంటుంది. మౌనికకు సంబంధం కుదరితే నీ లాంటివాళ్లు మౌనిక దగ్గర పది మంది పనిచేస్తారని మీనాతో చెబుతుంది ప్రభావతి. వచ్చినవాళ్ల ముందు అటు ఇటు తిరగకు...పూలమ్మే సంబంధం చేసుకున్నామని తెలిస్తే పరువు పోతుంది అని మీనాను అవమానిస్తుంది. వంట గదిలో పనిచూసుకో చాలు అని ఎగతాళి చేస్తుంది.
మనోజ్‌కు పంచ్...
భార్యను తన కళ్ల ముందే ప్రభావతి అవమానించడం బాలు సహించలేకపోతాడు. మనోజ్‌ను పిలుస్తాడు. వచ్చినవాళ్ల ముందు నువ్వు కూడా అటు ఇటు తిరగకు...నువ్వు నలభై లక్షలు మింగావని తెలిస్తే పరువు పోతుందని చెప్పి ప్రభావతి నోరు మూయిస్తాడు.
కోటీశ్వరుల సంబంధం...
నీకు నచ్చితేనే పెళ్లికి ఓకే చెప్పమని మౌనికతో అంటాడు బాలు. ఎవరికి భయపడొద్దని చెబుతాడు. కోటీశ్వరుల సంబంధం వచ్చేసరికి ఓర్వలేకపోతున్నారని బాలు, మీనాపై సెటర్లు వేస్తుంది ప్రభావతి. ట్రిప్ కోసం బయటకు వెళుతున్నానని, ఇక పండుగ చేస్తో అని ప్రభావతికి చెప్పి బాలు వెళ్లిపోతాడు. బాలు బయటకు వెళ్లడంతో ప్రభావతి రిలీఫ్‌గా ఫీలవుతుంది.
ఆడపిల్ల జీవితం నాశనం చేయద్దు...
బాలు బయటకు వెళ్లడం చూసి పెళ్లిచూపుల కోసం సత్యం ఇంటికివస్తారు సంజు, నీలకంఠం. సత్యం ఇంటిని చూసి మన లెవెల్ ఏంటి? వీళ్లను పిల్లను ఇవ్వమని అడగటం ఏంటి? ఎంత తలవంపులు తెచ్చావని కొడుకుతో అంటాడు సంజు. పంతంతో ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేయద్దని సంజుకు తల్లి సలహా ఇస్తుంది. ఆమె సలహాను కొట్టిపడేస్తాడు సంజు. నీలకంఠం, సంజులను ప్రభావతి, సత్యం ఇంట్లోకి ఆహ్వానిస్తారు.
అన్ని విధాలుగా నచ్చింది...
మౌనికను తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్లబోతుంది ప్రభావతి. సత్యం ఆగమని అంటాడు. ముందుగా మా గురించి మీకు చెప్పాలని నీలకంఠంతో సత్యం అంటాడు. అవసరం లేదని నీలకంఠం సమాధానమిస్తాడు. అన్ని విధాలుగా మీ సంబంధం నాకు నచ్చిందని చెబుతాడు. సత్యం ఫ్యామిలీ గురించి నీలకంఠం మొత్తం చెప్పేస్తాడు.
సంజు సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదని చెబుతాడు. సంజు తన బిజినెస్ చూసుకుంటున్నాడని కొడుకు గురించి గొప్పలు చెబుతారు. మీనాను పిలిచి నీలకంఠం ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు సత్యం. మౌనికను రోహిణి, మీనా తీసుకొస్తారు. మౌనిక జీవితం నాశనం కాకూడదని సంజు తల్లి రేవతి మనసులో కోరుకుంటుంది. సంజు తనకు నచ్చలేదని మౌనిక చెబితే బాగుంటుందని అనుకుంటాడు.
బాలు డౌట్...
ట్రిప్‌కు బయలుదేరిన బాలుకు తల్లి అన్న మాటలు గుర్తొస్తాయి. కావాలనే తనను ఎవరో బయటకు పంపించారని డౌట్ పడతాడు. మౌనికకు ఈ సంబంధం కరెక్ట్ కాదని, పెళ్లి విషయంలో అమ్మ ఎక్కడో తప్పు చేస్తుందని అనుకుంటాడు.
సంజు నాటకం...
తన పగ కోసం మౌనిక ముందు మంచివాడిగా నటిస్తాడు సంజు. పెళ్లి తర్వాత జాబ్ చేస్తానన్న తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటాడు. నీతో పెళ్లి చూపులకు ముందే నాన్న నాకు ఓ సంబంధం తీసుకొచ్చాడని, ఆ అమ్మాయిని తాను ఇష్టపడ్డానని సంజు అంటాడు. తీరా పెళ్లికి ముందు తనను కాదని ప్రేమించిన వాడితో పెళ్లిపోయిందని మౌనికతో అంటాడు సంజు. ఆ డిప్రెషన్‌లో ఉండగానే నువ్వు కనిపించావని, నిన్ను చూసిన తర్వాతే ఆ అమ్మాయిని ఇష్టపడ్డానని, నిన్ను ప్రేమించానని అర్థమైందని సంజు డ్రామా ఆడుతాడు. శృతిని ప్రేమించిన విషయం మాత్రం బయటపెట్టాడు.
మౌనిక ఓకే...
సంజు మాటలు నిజమని నమ్మిన మౌనికతో అతడితో పెళ్లికి ఒప్పుకుంటుంది. మౌనిక ఓకే చెప్పడంతో ప్రభావతి సంబరపడుతుంది. కరెక్ట్‌గా తాంబూలాలు తీసుకొనే టైమ్‌లో బాలు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు.
సంజును గుర్తుపడతాడు. నీలాంటివాడికి నా చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసిది లేదు బయటకు వెళ్లిపొమ్మని సంజుతో పాటు నీలకంఠానికి బాలు వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.