Megha Akash: పెళ్లిపీట‌లెక్క‌నున్న ర‌వితేజ హీరోయిన్? - పెళ్లికొడుకు ఎవ‌రంటే?-megha akash to marry a famous politician son megha akash wedding rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Megha Akash: పెళ్లిపీట‌లెక్క‌నున్న ర‌వితేజ హీరోయిన్? - పెళ్లికొడుకు ఎవ‌రంటే?

Megha Akash: పెళ్లిపీట‌లెక్క‌నున్న ర‌వితేజ హీరోయిన్? - పెళ్లికొడుకు ఎవ‌రంటే?

HT Telugu Desk HT Telugu
Jun 08, 2023 06:19 AM IST

Megha Akash: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్‌ త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పెళ్లికొడుకు ఎవ‌రంటే...

మేఘా ఆకాష్‌
మేఘా ఆకాష్‌

Megha Akash: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. ఇటీవ‌లే హీరో శ‌ర్వానంద్ ఓ ఇంటివాడ‌య్యాడు. మెగా హీరో వ‌రుణ్‌తేజ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

yearly horoscope entry point

తాజాగా యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్‌ కూడా పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం మొద‌లైంది. త‌మిళ‌నాడుకు చెందిన రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడితో మేఘా ఆకాష్‌ పెళ్లి ఫిక్స‌యిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహం వీరిద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే మేఘా ఆకాష్‌ పెళ్లికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. నితిన్ హీరోగా న 2017లో రిలీజైన లై సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్‌. ఆ త‌ర్వాత ఛ‌ల్ మోహ‌న‌రంగ‌, డియ‌ర్ మేఘ‌, గుర్తుందా శీతాకాలం, ప్రేమ‌దేశంతో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించింది.

త‌మిళంలో ర‌జ‌నీకాంత్ పేట్ట‌, హిందీలో స‌ల్మాన్‌ఖాన్ రాధే సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది మేఘా ఆకాష్‌. అవ‌కాశాలు దండిగానే ద‌క్కించుకున్నా ప‌రాజ‌యాల కార‌ణంగా రావాల్సినంత పేరు మేఘా ఆకాష్‌కు ద‌క్క‌లేదు. ఇటీవ‌లే ర‌వితేజ రావ‌ణాసుర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది.

ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టించింది. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా న‌టించిన మ‌ను చ‌రిత్ర రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మ‌రికొన్ని త‌మిళ సినిమాల్లో న‌టిస్తోంది మేఘా ఆకాష్‌.

Whats_app_banner