Varun Tej Lavanya Tripathi: పెళ్లిపీటలెక్కనున్న వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి - ఎంగేజ్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్
Varun Tej Lavanya Tripathi Engagement: మెగా హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్సయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ ఎంగేజ్‌మెంట్ ఎక్కడ, ఏ రోజు జరుగనుందంటే...
Varun Tej Lavanya Tripathi Engagement: మెగా హీరో వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ జంట నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్సయినట్లు సమాచారం.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రేమ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అంటూ వరుణ్‌తేజ్‌తో పాటు లావణ్య త్రిపాఠి గతంలో క్లారిటీ ఇచ్చారు.
కానీ ఈ పుకార్లకు మాత్రం పుల్‌స్టాప్ పడలేదు. తాజాగా వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఈ నెల 9న జరుగనున్నట్లు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంగా సింపుల్‌గా ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక జరుగనున్నట్లు తెలిసింది.
ఎంగేజ్‌మెంట్ రోజే ఈ జంట పెళ్లి డేట్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాటి ఎంగేజ్‌మెంట్ రూమర్స్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి విన్నర్‌తో పాటు అంతరిక్షం సినిమాలు చేశారు.
ఆ సమయంలోనే వీరిమధ్య మొదలైన స్నేహం...ప్రేమగా మారినట్లు చెబుతోన్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా పారిస్ టూర్ వెళ్లినట్లు చెబుతోన్నారు. పారిస్ టూర్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ ఫొటోల్లో వరుణ్‌తేజ్ ఒంటరిగానే కనిపించాడు. అతడితో లావణ్య త్రిపాఠి కూడా ఈ టూర్‌లో ఉన్నట్లు నెటిజన్లు చెబుతోన్నారు. మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టనున్న లావణ్య త్రిపాఠికి కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు చేస్తోన్న పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.