UI Movie OTT: ఉపేంద్ర క్రేజీ మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే!
UI Movie OTT: యూఐ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు బయటికి వచ్చాయి. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందో తెలిసిపోయింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘యూఐ’ సినిమాపై ముందు నుంచి ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నీ డిఫరెంట్‍గా అనిపించాయి. ఈ సినిమాను అర్థం చేసుకోవడం కష్టమనేలా ప్రమోషన్లలో స్వయంగా ఉపేంద్రనే చెప్పారు. ఎట్టకేలకు ఈ కన్నడ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ యాక్షన్ సినిమా డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా.. కలెక్షన్లను బాగానే దక్కించుకుంటోంది. యూఐ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు బయటికి వచ్చాయి.
ప్లాట్‍ఫామ్ ఇదే
యూఐ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ క్రేజీ మూవీకి మంచి రేటే ఓటీటీ హక్కుల ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. యూఐ మూవీ డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ వేరే ప్లాట్‍ఫామ్‍తో పంచుకుంటుందా.. ఆ ఒక్క ఓటీటీలోనే వస్తుందా అనేది చూడాలి.
యూఐ మూవీని ఓ ఫిక్షనల్ డిఫరెంట్ వరల్డ్ బ్యాక్‍డ్రాప్‍లో ఉపేంద్ర తెరకెక్కించారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆయన మళ్లీ దర్శకత్వంలోకి దిగారు. ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఉపేంద్ర నటించారు. ఈ చిత్రంలో రేష్మా నన్నయ్య, మురళీ శర్మ, కేవీ అనుదీప్, సాధు కోకిల, వినాయక్ త్రివేది, ఇంద్రజిత్ లంకేశ్, నిధి సుబ్బయ్య, ఓం సాయి ప్రకాశ్ కీలకపాత్రలు పోషించారు.
యూఐ కలెక్షన్లు
యూఐ సినిమా మూడో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.20కోట్ల కలెక్షన్లు మార్క్ దాటిసింది. ఇండియాలో సుమారు రూ.18కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఈ మూవీకి మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే, కలెక్షన్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఉపేంద్ర క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. యూఐ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ రిలీజ్ అయింది.
యూఐ చిత్రాన్ని లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్లపై జీ మనోహరన్, శ్రీకాంత్, భూమిక గొండాలియా ప్రొడ్యూజ్ చేశారు. అజ్నీశ్ లోక్‍నాథ్ సంగీతం అందించారు. సమాజంలో ఉన్న కొన్ని కఠిన నిజాలను అంతే సూటిగా ఈ చిత్రంలో చూపించారు ఉపేంద్ర. సెటైరికల్‍గా మూవీని నడిపించారు. అయితే, సరైన నరేషన్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని సీన్లు అర్థం చేసుకునేందుకు కష్టంగా ఉన్నాయనే టాక్ వచ్చింది. ఉపేంద్ర మరోసారి తన మార్క్ యాక్టింగ్‍తో పాటు డిఫరెంట్ గెటప్‍తో మెప్పించారు.