Brahmamudi December 23rd Episode:కావ్యకు రాజ్ ఇంప్రెస్ - ధాన్యలక్ష్మి డామినేషన్‌కు చెక్ - రుద్రాణి ప్లాన్ ఫెయిల్
Brahmamudi December 23rd Episode: బ్రహ్మముడి డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో బ్యాంకు సమస్యను కావ్య సాల్వ్ చేయడంతో రాజ్ సంబరపడిపోతాడు. కావ్యకు ఇంప్రెస్ అయిపోతాడు. దుగ్గిరాల ఇంట్లో కొత్త రూల్స్ పెడుతుంది కావ్య. ఇంట్లో వాళ్లు ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని ఆర్డర్ వేస్తుంది.
బ్యాంకు వాళ్లకు కట్టాల్సిన వంద కోట్లను ఇన్‌స్టాల్‌మెంట్‌లో కడతామని కావ్య అంటుంది. ఆమె ప్రపోజల్‌కు బ్యాంకు అధికారులు ఒప్పుకుంటారు. మొత్తం ఐదు ఇన్‌స్టాల్‌మెంట్స్‌తో డబ్బు చెల్లిస్తామని, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద ఇరవై కోట్లు ఈ రోజు చెల్లిస్తామని బ్యాంకు అధికారులతో కావ్య చెబుతుంది. కావ్య మాటలకు కన్వీన్స్ అయినా బ్యాంకు అధికారులు వెళ్లిపోతారు.
రాజ్ ఇంప్రెస్...
బ్యాంకు సమస్య సాల్వ్ కావడంతో రాజ్ తెగ ఆనందపడిపోతాడు. కావ్యనే చూస్తూ ఉండిపోతాడు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. చాలా మెచ్యూర్డ్‌గా, కన్వీన్సింగ్ మాట్లాడావని రాజ్ అంటాడు. నన్ను ఇంప్రెస్ చేశావని కావ్య భుజంపై తట్టి వెళ్లిపోతాడు. భర్త ప్రశంసలతో కావ్య ఆనందపడిపోతుంది.
కావ్య మ్యాజిక్...
రాజ్‌లో వచ్చిన మార్పు చూసి శృతి కూడా షాకవుతుంది. రాజ్ కళ్లలో మెరుపు...ముఖంలో నవ్వు కనిపిస్తుందని, రాజ్‌లో తెలియని మార్పు వచ్చిందని అంటుంది. రాజ్ కావాలనే మిమ్మల్ని ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి పంపించేశారు. అలాంటి మిమ్మల్ని రాజ్ తిరిగి ఆఫీస్‌కు తీసుకువచ్చారంటే మీరు ఏదో మ్యాజిక్ చేశారని కావ్యతో అంటుంది శృతి. రాజ్ మనసును గెలిచారు.ఇద్దరు ఒక్కటయ్యారు కాబట్టి ఇక నుంచి లవ్ సాంగ్స్ డ్యూయెట్స్ అని శృతి అనగానే కావ్య ఆనందపడిపోతుంది.
రుద్రాణి చెప్పుడు మాటలు...
ధాన్యలక్ష్మి కిచెన్‌లో కాఫీ పెట్టుకుంటుంది. పనిలో పనిగా టీ పెట్టడం కూడా నేర్చుకో...రేపో మాపో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత టీ కొట్టు పెట్టుకోవడానికి పనికొస్తుందని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి.
లేదంటే రాజ్‌ను డబ్బులు అడిగి ప్లాస్క్ కొని పార్కుల్లో, బస్ స్టాపుల్లో అమ్ముకోమని ధాన్యలక్ష్మిని అవమానిస్తూ మాట్లాడుతుంది. నేను టీ, కాఫీ అమ్ముకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది.
రాజ్ ఛాలెంజ్...
ఇంట్లోను, ఆఫీస్‌లోను కావ్యను లైఫ్‌లో అడుగుపెట్టనీయనని రాజ్ ఛాలెంజ్ చేశాడు. . కానీ ఇప్పుడు అదే కావ్య తో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడని ధాన్యలక్ష్మి తో అంటుంది రుద్రాణి. ఇలాగే ఇంట్లో జరిగే ఘోరాలను చూసి చూడనట్లు నువ్వు వదిలేస్తే నిన్ను ఇంట్లో ఎవరూ పట్టించుకోరని, నీకు నీ కొడుకుకు రావాల్సిన ఆస్తిని ఎలా దక్కించుకుంటావని రుద్రాణి అంటుంది.
రుద్రాణి చెప్పుడు మాటలతో ధాన్యలక్ష్మి ఆవేశపడుతుంది. నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఇంట్లో వాళ్లు చూసే రోజు తొందరలోనే వస్తుందని అంటుంది.
చాలా రోజుల తర్వాత సంతోషంగా...
చాలా రోజుల తర్వాత ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నానని తన సంబరాన్ని కావ్యతో షేర్ చేసుకుంటాడు రాజ్. ఏ అప్పు చేయకుండానే డబ్బులు ఎప్పుడు కడతారని బ్యాంకు వాళ్లు డిమాండ్ చేయడంతోఏం చేయాలో అర్థం కాలేదని అంటాడు. ఆ డబ్బులతో మాకు సంబంధం లేదని చెప్పాలని అనిపించిందని, కానీ తాతయ్య మాట గుర్తొచ్చి ఆగిపోయానని రాజ్ అంటాడు. డబ్బు లేక ఏం చేయాలో తెలియక నాలో నేను ఇన్నాళ్లు నరకం అనుభవించానని రాజ్ అంటాడు.
థాంక్స్ ఎలా చెప్పాలో...
నీకు సంబంధించిన ఎన్నో విషయాల్లో నేను మొండిగా ఉన్నా...ఈ బ్యాంకు సమస్యను మాత్రం నువ్వే పరిష్కరించగలవని అనిపించి నీకు చెప్పాను. నేను ఆశించినట్లు ఈ సమస్యకు ఈజీగా సొల్యూషన్ ఇచ్చావు. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదని రాజ్ అంటాడు. మీరు భార్యగా భావిస్తే నాకు థాంక్స్ అక్కరలేదు. ఒక ఉద్యోగిగా భావిస్తే నాకు జీతం అక్కరలేదు. మీరు సంతోషంగా ఉన్నారు అది చాలని కావ్య అంటుంది.
కావ్య సలహా...
ఒక్క నెలలో ఇరవై కోట్లు ఎలా కట్టాలో ఆలోచించడం మొదలుపెడతాడు రాజు. ఒక్క నెల అని ఎందుకు అనుకోవాలి...30 రోజులు అనుకోవచ్చు కదా...సమస్యను దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి చూస్తే పరిష్కారం మీకే దొరుకుతుందని రాజ్‌కు కావ్య సలహా ఇస్తుంది. ఆమె మాటలతో మళ్లీ రాజ్ ఇంప్రెస్ అవుతాడు.
తమ దగ్గర బ్యాంకులో ఉన్న ఇరవై లక్షలతో కాంట్రాక్ట్ వర్క్ మొత్తం ఫినిష్‌చేయమని మేనేజర్‌తో రాజ్ చెబుతాడు. ఎంప్లాయ్స్ సాలరీకి డబ్బులు లేవని మేనేజర్ అనగానే తాను సర్ధుబాటు చేస్తానని రాజ్ చెబుతాడు.
మేనేజర్ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లోవాళ్లు డబ్బులు అడిగితే ఏం చేయాలా అని రాజ్ టెన్షన్ పడుతాడు. డబ్బులు లేవని చెబితే ఇంట్లోవాళ్లకు లేనిపోని అనుమానాలు వస్తాయని రాజ్ అంటాడు. అవన్నీ తాను మ్యానేజ్ చేస్తానని, ఎవరు అడిగినా తాను సమాధానం చెబుతానని రాజ్ అంటాడు.
ఇంట్లో వాళ్లకు తెలిస్తే...
బ్యాంకు చెల్లించాల్సిన వంద కోట్లతో పాటు తాకట్టు పెట్టిన ఆస్తుల గురించి ఇంట్లో వాళ్లకు తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయని రాజ్ భయపడిపోతాడు. అవన్నీ తాను చూసుకుంటానని కావ్య చెబుతుంది.
స్వప్నను బ్లాక్‌మెయిల్ చేసి ఆమె నుంచి డబ్బులు దండుకోవాలని రుద్రాణి, రాహుల్ స్కెచ్ వేస్తారు. స్వప్న దగ్గరకు వెళ్లి నాలుగు లక్షలు అడుగుతారు. డబ్బుల ఎందుకు కావాలో చెబితేనే ఇస్తానని స్వప్న అంటుంది. కారణాలు నీకు అనవసరం అని రుద్రాణి అంటుంది. కారణాలు చెప్పకుండా అయితే ఐదు వందలో వెయ్యో ఇస్తానని స్వప్న అంటుంది. మాకు భిక్షం వేస్తున్నావా అని కోడలిపై రుద్రాణి ఫైర్ అవుతుంది.
ధాన్యలక్ష్మి పేరుతో బ్లాక్‌మెయిల్...
ధాన్యలక్ష్మి పేరు చెప్పి స్వప్నను బ్లాక్‌మెయిల్ చేస్తారు. డబ్బు ఇవ్వనని అన్నావని ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి చెప్పమంటావా...లేదంటే మేము అడిగినంత డబ్బుల ఇస్తావా అని బెదిరిస్తారు. ధాన్యలక్ష్మి పేరు విని భయపడిపోయిన స్వప్న వారు అడిగినంత డబ్బు ఇవ్వబోతుంది.
నాలుగు లక్షలు...
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన కావ్య డబ్బు ఇవ్వకుండా స్వప్నను ఆపేస్తుంది.అంత డబ్బులు ఎందుకు రుద్రాణి, రాహుల్‌కు ఇస్తున్నావని స్వప్నను నిలదీస్తుంది. డబ్బులు ఇవ్వకపోతే ధాన్యలక్ష్మికి చెబుతామని తనను బ్లాక్‌మెయిల్ చేశారని స్వప్న అంటుంది.
వాళ్లు నాలుగు లక్షలు అడిగారని తెలిసి కావ్య షాకవుతుంది. ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం ఉంటుందని నీకు కీస్ ఇచ్చానని, కానీ వీళ్లు ఇంత డబ్బు దాటేస్తారని ఊహించలేదని కావ్య అంటుంది.
ఇంతకుముందు వేరు...ఇప్పుడు వేరు...
కావ్య మాటలతో దాటించడం ఏంటి అని రుద్రాణి ఫైర్ అవుతారు. ఆ డబ్బులు, తాళాలను స్వప్న చేతిలో నుంచి తీసుకుంటుంది. ఇంట్లో వాళ్లందరిని పిలుస్తుంది. ఇంతకుముందు వేరు...ఇప్పుడు వేరు...మాట్లాడితే లక్షలు తీసుకుంటూ డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతున్నారు.
ఇక నుంచి డబ్బు అవసరమై ఎవరైనా అడిగితే తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపించాలని కావ్య అంటుంది. ఆఖరికి కారులో పెట్రోల్ పోయించినా నాకు బిల్ తెచ్చివ్వాలని కావ్య ఆర్డర్ వేస్తుంది.
ధాన్యలక్ష్మికి రూల్స్...
విన్నావా ధాన్యలక్ష్మి...ఇక నుంచి ఇంట్లో ఎవరు డబ్బులు తీసుకున్నా...కావ్యకు లెక్కలు చెప్పాలంటా...కొత్త రూల్స్ పాస్ చేస్తుంది అంటూ చిచ్చు రేపాలని చూస్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మికి కూడా ఈ రూల్స్ వర్తిస్తాయని కావ్య అంటుంది. బీరువా నిండా నగలు ఉన్నా కొత్త డిజైన్స్ వచ్చాయని ఆమె మూడు లక్షలు ఖర్చుపెట్టిందని కావ్య అంటుంది. ఆడంబరాల కోసం నగలు చేయించడం కుదరదని అంటుంది.
ఫాలో కావాల్సిందే...
ఎవరు ఏం అనుకున్నా నాకు అవసరం అని అంటుంది కావ్య. తాను పెట్టిన రూల్స్‌ను అందరూ పాటించాలని అంటుంది. ఇట్స్ మై ఆర్డర్ అని చెబుతుంది. రూల్స్ పెట్టడానికి ఇది జైలు కాదని రుద్రాణి అంటుంది. మా అమ్మనాన్నలు కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదని గొడవ చేయబోతుంది. ఆస్తి కోసం చిచ్చు పెట్టినప్పుడు నేను మీకు అమ్మనాన్న అని గుర్తు రాలేదా అని ధాన్యలక్ష్మిని నిలదీస్తుంది ఇందిరాదేవి.
నాకు అసలు కూతురు లేదు...నేను మీకు అమ్మనాన్నలం కాదని రుద్రాణి షాకిస్తుంది ఇందిరాదేవి. ఇక నుంచి కావ్య చెప్పింది ఇంట్లో అమలు జరాగాల్సిందేనా ధాన్యలక్ష్మి. జరగాల్సిందే...ఇట్స్ మై ఆర్డర్ అని కావ్య అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.