Bhagavanth Kesari: డబ్బులు వచ్చేవే కమర్షియల్ సినిమాలు కాదు -బాలకృష్ణ కామెంట్స్ వైరల్
Bhagavanth Kesari: భగవంత్ కేసరి కథ బాగా రావడానికి అనిల్ రావిపూడికి తాను కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్లు బాలకృష్ణ తెలిపాడు. తెలుగు వారందరూ గర్వపడే సినిమా ఇదని భగవంత్ కేసరి సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ పేర్కొన్నాడు.
Bhagavanth Kesari: అనిల్ రావిపూడితో గతంలోనే ఓ సినిమా చేయాల్సిందని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయిందని భగవంత్ కేసరి సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ అన్నాడు. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి మూవీ ఇటీవల రిలీజైంది.భగవంత్ కేసరి సక్సెస్ మీట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ భగవంత్ కేసరి కథ బాగా రావడానికి అనిల్ రావిపూడికి తాను కొన్ని సలహాలు ఇచ్చానని బాలకృష్ణ చెప్పాడు.
సినిమా ఒప్పుకున్నాం...చేసేద్ధాం అని కాకుండా కథ బాగా రావడానికి నిరంతరం ఆలోచిస్తుంటానని బాలకృష్ణ చెప్పాడు. గతంలోనే అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయాల్సిందని కానీ అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందని బాలకృష్ణ అన్నాడు. భగవంత్ కేసరి సినిమా కోసమే మా కాంబినేషన్ ఆలస్యమవుతూ వచ్చిందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే సినిమా తమ కలయికలో రావడం ఆనందంగా ఉందని బాలకృష్ణ చెప్పాడు. భారతదేశం మొత్తం భగవంత్ కేసరి సినిమా గురించి చెప్పుకుంటున్నారని, అనిల్ రావిపూడిపై నమ్మకంతోనే ఈ సినిమా చేశానని బాలకృష్ణ తెలిపాఉ.
కమర్షియల్‌సినిమాలు...
కమర్షియల్ సినిమాలు అంటే డబ్బులొచ్చేవి మాత్రమే కాదు. మంచి మెసేజ్ ఇచ్చే సినిమాల్ని కూడా కమర్షియల్ సినిమాలేఅని బాలకృష్ణ తెలిపాడు. భగవంత్ కేసరిలో యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో శ్రీలీల చక్కగా నటించిందని చెప్పాడు. తన అభిమాని అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాను తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా తెరకెక్కించాడని బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు.
దంచవే మేనత్త కూతురా పాటను సినిమాలో బుధవారం నుంచి యాడ్ చేయబోతున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నాడు. సినిమా పూర్తయ్యాకా రోలింగ్ టైటిల్స్ ముందు ఈ పాట వస్తుందని చెప్పాడు. . ఈ సక్సెస్ మీట్‌లో శ్రీలీల, అనిల్ రావిపూడి, అర్జున్ రాంపాల్ తదితరులు పాల్గొన్నారు.