Brahmamudi December 10th Episode: రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని ఉసిగొలిపిన రుద్రాణి- ఆస్తి మొత్తం కావ్యకే రాసిచ్చిన తాతయ్య-brahmamudi serial december 10th episode rahul rudrani on mission all property to kavya star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi December 10th Episode: రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని ఉసిగొలిపిన రుద్రాణి- ఆస్తి మొత్తం కావ్యకే రాసిచ్చిన తాతయ్య

Brahmamudi December 10th Episode: రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని ఉసిగొలిపిన రుద్రాణి- ఆస్తి మొత్తం కావ్యకే రాసిచ్చిన తాతయ్య

Sanjiv Kumar HT Telugu
Dec 10, 2024 07:55 AM IST

Brahmamudi Serial December 10th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 10 ఎపిసోడ్‌లో అపర్ణ చెప్పడంతో గదిలోకి కావ్యను రానిస్తాడు రాజ్. కానీ, బెడ్‌పై గీత గీస్తాడు. మరోవైపు ఆస్తి గొడవ పెట్టడానికి రుద్రాణి ప్లాన్ వేస్తుంది. రెండు కోట్ల చెక్‌తో రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని ఉసిగొలుపుతుంది. దానికి రాహుల్ సహాయం చేస్తాడు.

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 10వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 10వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య వంట్లింట్లో పడుకోవడంపై రాజ్ కోప్పడతాడు. మరెక్కడ పడుకోవాలి. కావ్య నీ భార్య అని అపర్ణ రాజ్‌ను తిడుతుంది. నాకేం తెలుసు తను ఇక్కడ పడుకుంటుందని అని రాజ్ అంటాడు. కావ్యను పట్టించుకోవాలి కదా. ఇలా చేస్తే మనకు ఎంత అవమానం. తాతయ్య, నానమ్మ పట్టుబడితే వచ్చిందని అపర్ణ అంటుంది.

yearly horoscope entry point

పెద్ద సంఘర్షణ

నేను రావొద్దని చెప్పానా అని రాజ్ అంటే.. రమ్మని చెప్పారా అని కావ్య అంటుంది. వస్తే వద్దంటానని ఎలా అనుకున్నావ్ అని రాజ్ అంటే.. రాకపోతే రమ్మంటారని కూడా ఆశపడలేదు అని కావ్య అంటుంది. రాకపోతే రమ్మని అనను. వస్తే వద్దను అనను. ఇది తాతయ్య నిర్ణయం. ఏం మాట్లడలేను. దారి తెరిచే ఉందిగా రమ్మను అని రాజ్ వెళ్లిపోతాడు. ఇంకేం చూస్తున్నావ్ వెళ్లు. నీ మనసులో పెద్ద సంఘర్షణ జరుగుతుందని తెలుసు. మీరిద్దరు కలిసి ఉంటేనే ఒక్కటి అవుతారు. ఈసారి ఇగోకి తగ్గి వెళ్లు. ఇంకోసారి ఇలా దీన స్థితిలో కనిపిస్తే అట్లకాడతో వాయిస్తా అని అపర్ణ అంటుంది.

దాంతో రాజ్ రూమ్‌కు కావ్య వెళ్తుంది. ఇంతలో బెడ్‌పై ఇద్దరికి బార్డర్ గీస్తాడు రాజ్. ఏంటండి ఇది అని కావ్య అడిగితే.. ఇది రాజ్ గీత. నువ్ ఈ గీత దాటి రావొద్దు. నేను జరగను అని రాజ్ అంటాడు. అలా జరిగితే నా తలరాత ఇలా ఎందుకు ఉంటుంది. పిల్లపాపలతో కళకళలాడేది అని కావ్య అంటుంది. మా అమ్మ చెప్పిందని ఊరుకున్నాను. నీ భాగంలోకి నేను రాను. నా భాగంలోకి నువ్ రావొద్దు అని రాజ్ అంటాడు. ఎవరైనా ఇలా సగంసగం పనులు చేస్తారు. ఆఖరికి పడక గదిని కూడా ఇలా సగం పంచేశిన ఘనత మీదేనని కావ్య అంటుంది.

అవును, నాదే అని రాజ్ పడుకుంటాడు. తర్వాత రాజ్ పైనుంచి కావాలనే వాటర్ బాటిల్ తీసుకోడానికి ట్రై చేస్తుంది. దాంతో రాజ్ లేస్తాడు. నా వాటాలోకి రావొద్దను చెప్పాను కదా అని రాజ్ అంటాడు. మీ వాటాలో లోటా ఉందని రాజ్ పైకి వస్తుంది. దాంతో భయపడి పక్కకు తప్పకుంటాడు రాజ్. ఇంతలో బాటిల్ తీసుకుని ఇదే లోటా. మరి బాత్రూమ్‌లో, హాల్లో అన్నింట్లో గీత గీస్తారా అని కావ్య అంటుంది. కేవలం బెడ్ మీదే అని రాజ్ అంటాడు.

గీత గీయాల్సిన అవసరం లేదు

ఇద్దరు వాదించుకుంటారు. ఇదేమైనా బూత్ బంగ్లా అవుతుందా ఏంటీ. మీరు ఇంత కష్టపడి గీత గీయాల్సిన అవసరం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడే మీరు ముక్కలు చేసిన ఈ బెడ్‌మీద పడుకోను. మీ అంతట మీరు పిలిచేదాకా ఈ బెడ్‌నే ముట్టుకోను అని కావ్య అంటే.. హమ్మయ్యా థ్యాంక్స్ అని గీత చెరిపేస్తాడు. నీ ఆత్మాభిమానమే నన్ను కాపాడింది. నేను పిలిచే వరకు నువ్వు ఈ బెడ్ మీదకు రావొద్దే అని రాజ్ అంటాడు. అంటే, ఏదో ఒకరోజు పిలుస్తారన్నమాట అని కావ్య అంటుంది.

అంత లేదు. తాతయ్య మాటను గౌరవించి రమ్మన్నాను అని రాజ్ అంటాడు. తర్వాత చాప, దిండు తెచ్చుకుని బెడ్‌ పక్కకు పడుకుంటుంది. ఓకే అనుకుని రాజ్ కూడా పడుకుంటాడు. తర్వాత మళ్లీ లేచిన కావ్య బెడ్ ఎక్కుతుంది. ఏయ్ అని రాజ్ అరవగానే వాటర్ బాటిల్ అంటుంది. దాంతో రాజ్ ఇస్తాడు. కావ్య వాటర్ తాగి తిరిగి ఇస్తుంది. ఇక ఈ లోటా నీ వాటలోనే పెట్టుకో అని రాజ్ అంటే.. ఏంటీ భయమా అని కావ్య అంటుంది. అంత లేదు. నువ్ ఇబ్బంది పడకూడదని రాజ్ అంటాడు.

మరోవైపు రుద్రాణి ఆలోచిస్తుంటే.. ఎందుకు మమ్మీ అంత ఆలోచన. తాతయ్య ఎలాగు వాటా ఇస్తానని చెప్పారు కదా అని రాహుల్ అంటాడు. కోమా నుంచి వచ్చాకా ఇస్తే ఒక ప్లాన్ లేకపోతే ఇంకో ప్లాన్. రేపు నువ్ ఒక బ్లాంక్ చెక్ తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్లి బిజినెస్ చేయాలి రెండు కోట్లు రాయమని అడుగు అని రుద్రాణి అంటుంది. దాంతో నవ్విన రాహుల్ నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలను వస్తున్నాయి. వాడు అస్సలు ఇవ్వడు అని రాహుల్ అంటాడు.

రుద్రాణి కన్నింగ్ ప్లాన్

నీకు నేనే డబ్బులు ఇవ్వను. రాజ్ ఎందుకు ఇస్తాడు. రాజ్ నోటితే నీకు డబ్బులు ఇవ్వను అనిపించాలి. అప్పుడు ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి ఇవ్వట్లేదని చెబుతాం. తను వెళ్లి రాజ్‌ను అడుగుతుంది. కానీ, రాజ్ నో అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మీ ఇగో హర్ట్ అయి ఆస్తి కోసం గొడవ పడుతుంది. మనం రెచ్చగొడితే చాలు దానంతటా అదే ఆడుతుంది అని రుద్రాణి ప్లాన్ చెబుతుంది. హో మై మమ్మీ నీది మాములు ప్లాన్ కాదు అని రాహుల్ మెచ్చుకుంటాడు.

మరుసటిరోజు ఉదయం రాజ్ దగ్గరికి వెళ్లి అలాగే చెక్ మీద రెండు కోట్లు సంతకం చేయాలి అని అడుగుతాడు. దాంతో రాజ్, ప్రకాశం షాక్ అవుతారు. అంతెందుకు అని రాజ్ అంటే.. ఇకనుంచి కష్టపడి పనిచేయాలి అనుకుంటున్నా అని రాహుల్ అంటాడు. ఇది కల నిజమా. లేక రుద్రాణి మాయ. రెండు కోట్లు అడగడం ఆపి రెండు కోట్లు సంపాదించు అని ప్రకాశం అంటాడు. నేని సిన్సియర్‌గా అడుగుతున్నాను. డైమండ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నా. ఎక్స్‌పర్ట్స్‌ను తీసుకుని చేస్తా అలవాటు అవుతుందని రాహుల్ అంటాడు.

నీకు రెండు కోట్లు ఇస్తే ఏం అవుతుందో అందరికీ తెలుసు. నీకు కష్టపడాలని ఉంటే ఉద్యోగం చేసి భార్యను పోషించు అని ప్రకాశం అంటాడు. దాంతో రుద్రాణి ఎంట్రీ ఇచ్చి ఎందుకు అడ్డుపడుతున్నావ్. నువ్ మర్చిపోతావ్. నువ్ కంపెనీకి వెళ్లట్లేదా అని అంటుంది. కానీ, దానివల్ల ఎవరికీ నష్టం జరగలేదు. నువ్ చేసే కుతంత్రాలు మర్చిపోయానా. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టడం మర్చిపోయానా. వీడిని కంపెనీకి పంపిస్తే రాజ్‌ను జైలుకు వెళ్లేలా చేసింది మర్చిపోయానా అని పంచ్‌లు వేస్తాడు.

పాములను నమ్ముతున్నావా

మామయ్య నువ్వెప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటావ్. నేనేమైనా మనసులో పెట్టుకున్నానా అని రాహుల్ అంటాడు. ఏం చేస్తావురా. నీకు దుగ్గిరాల ఇంటి నుంచి రెండు కోట్లు కాదు కదా రెండు లక్షలు కూడా రావు అని ప్రకాశం అంటాడు. రాజ్ నువ్వు ఇస్తావా లేదా అని రాహుల్ అంటే.. రాజ్ ఇస్తానన్న నేను ఇవ్వనివ్వను అని ప్రకాశం అంటాడు. ఎలా ఇప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని రాహుల్‌ను తీసుకెళ్తుంది రుద్రాణి.

బాబాయ్ ఇంత హర్టింగ్‌గా మాట్లాడాలా అని రాజ్ అంటే.. ఏరా.. నువ్ ఇంకా ఈ పాములను నమ్ముతున్నావా. నా పెళ్లాన్ని ఉసిగొలిపి మా నాన్నను హాస్పిటల్ పాలయ్యేలా చేసింది. ఇలాంటిదాన్ని ఇంట్లో ఉంచడమే ఎక్కువ. ఇప్పుడు ఈ విషయాన్ని ఎంతపెద్దది చేస్తుందో నాకు తెలుసు. అప్పుడు బయటపడుతుంది దాని బుద్ధి అని ప్రకాశం అంటాడు. మరోవైపు రాహుల్ నేను చెప్పింది చేయు. ఓవరాక్షన్ చేసి చెడగొట్టకు అని రుద్రాణి అంటుంది.

చూస్తావు కదా అని రాహుల్ అంటాడు. ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి రుద్రాణి డ్రామా చేస్తుంది. డైమండ్స్ కంపెనీ, రెండు కోట్ల గురించి చెప్పి రాజ్ ఛీ పో అన్నాడు. మేమంటే లెక్కలేదు. మాకు డబ్బులు ఇస్తే వాళ్ల ఆస్తులు కరిగిపోతాయి కాబట్టి అని రుద్రాణి రెచ్చగొడుతుంది. అత్తయ్య నువ్ మాకు హెల్ప్ చేయగలవు. ఫ్యూచర్‌లో నా కంపెనీలో కల్యాణ్‌ను కూడా చేర్పించుకోవచ్చు అని రాహుల్ డ్రామా ఆడతాడు. నీ ఆలోచన బాగుంది కానీ అని ధాన్యలక్ష్మీ అంటే.. మీకు కూడా నాపై నమ్మకం లేదా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు రాహుల్.

నాకే రాజ్ భయపడతాడు

అలా అంటావేంటీ రాహుల్. నువ్ నా కొడుకులాగే. కాకపోతే అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరి ఇంకా అనుమానం ఏంటీ అని రాహుల్ అంటాడు. అనుమానం కాదు. ధాన్యలక్ష్మీ వెళ్లి రాజ్‌ను డబ్బులు అడిగితే మనల్ని ఛీ కొట్టినట్లు తనను ఛీ కొడతాడేమే అని భయపడుతుంది. మనలాగే తన పరువు ఎక్కడ పోతుందో అని భయపడుతుంది అని రుద్రాణి ఎక్కిస్తుంది. భయం కాదు. రాజే నాకు భయపడతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అడిగితే ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

నువ్ ఏం చెప్పిన సాకులాగే ఉంది కానీ, భయపడనట్లు లేదు అని రుద్రాణి అంటుంది. లేదు మమ్మీ అత్తయ్య ఏమనుకుంటే అది సాధిస్తుంది. తాతయ్యకే ఎదురుతిరిగింది. రాజ్‌కు భయపడుతుందా అని రాహుల్ అంటాడు. కట్ చేస్తే పిల్లల పేరుపై ఆస్తి రాయాలని, ఆస్తు ముక్కలు చేయాలని లాయర్‌తో సుభాష్ అంటాడు.

కావ్య పేరుమీదే ఆస్తి మొత్తం

లేదు సార్ ఆ అధికారం మీకు లేదు. వారం క్రితమే మీ నాన్నగారు ఒక వీలునామా రాయించారు అని చెప్పిన లాయర్ వీలునామా చదువుతాడు. ఇది నా ఉమ్మడి ఆస్తి. ఉమ్మడిగానే ఉండాలి. నా ఆస్తినంతా సమర్థురాలు అయిన నా మనవరాలు కావ్యపైన రాస్తున్నాను అని సీతారామయ్య వీలునామాను లాయర్ చదువుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner