Brahmamudi November 12th Episode: డిస్మిస్ చేస్తానంటూ రాజ్‌కు కావ్య వార్నింగ్ - రుద్రాణి పరువు తీసేసిన స్వప్న
Brahmamudi November 12th Episode: బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్‌లో ఆస్తి పంపకాల విషయంలో ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకోవాలని ధాన్యలక్ష్మి గొడవచేస్తుంది. పంచివ్వడానికి నీ పుట్టింటి ఆస్తులు ఏం ఇక్కడ లేవని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది.
Brahmamudi November 12th Episode: ఎలాగైనా దుగ్గిరాల కుటుంబాన్ని ముక్కలు చేసి ఆస్తిలో వాటా కొట్టేయాలని రుద్రాణి ఫిక్సవుతుంది. ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తుంది. దుగ్గిరాల ఆస్తిని మన పిల్లలకు పంచకుండా కావ్య అడ్డుపడే అవకాశం ధాన్యలక్ష్మితో అంటుంది రుద్రాణి. కావ్య ఆస్తి పంచకుండా ఎందుకు అడ్డుపడుతుంది? ఆమెకు ఏం సంబంధం ఉందని ధాన్యలక్ష్మి సందేహం వ్యక్తం చేస్తుంది.
తనకు ఆఫీస్‌తో ఏం సంబంధం ఉందని సీఈవో అయ్యింది? ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కావ్య...తిరిగి అధికారం దక్కించుకోవడానికి కంపెనీలో అడుగుపెట్టింది...మా అమ్మనాన్నలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ సీఈవో అయ్యిందని చాడీలు చెబుతుంది రుద్రాణి. ఆమె మాటలను నిజమని ధాన్యలక్ష్మి నమ్ముతుంది.
కావ్య కింద మేనేజర్‌గా...
కావ్య బుట్టలో మా అమ్మనాన్నలు పడిపోయారని, దుగ్గిరాల వారసుడు రాజ్‌ను కావ్య కింద మేనేజర్‌గా పెట్టారని రుద్రాణి అంటుంది. కావ్య అడ్డుపడకముందే ఆస్తి పంపకాలు జరిగిపోవాలని, ఆలోచించుకునేందుకు ఎవరికి అవకాశం ఇవ్వకూడదని ధాన్యలక్ష్మి మనసులో కావ్య పట్ల విద్వేషాన్ని నింపుతుంది. రుద్రాణి మాయలో పూర్తిగా పడిపోయిన ధాన్యలక్ష్మి ...నా కొడుక్కి రావాల్సిన వాటా దక్కకుండా ఎవరూ అడ్డుపడిన ఊరుకోనని కోపంగా అంటుంది.
ధాన్యలక్ష్మి వెళ్లిపోగానే రుద్రాణి సంబరపడిపోతుంది. ఆస్తి పంచకుండా కావ్య అడ్డుపడుతుందని ధాన్యలక్ష్మి గొడవలు చేస్తుందని, కావ్య మీద మాటపడటం ఇష్టం లేక అమ్మనాన్నలు ఆస్తి పంచేస్తారని అనుకుంటుంది.
ఆస్తి పంపకాల నిర్ణయం...
కోపంగా సీతారామయ్య, ఇందిరాదేవి దగ్గరకు వస్తుంది ధాన్యలక్ష్మి. దుగ్గిరాల ఇంటి వారసుడికి కన్నతల్లిగా మాట్లాడుతున్నానని అంటుంది. దుగ్గిరాల ఇంటి పేరును మోస్తున్న వారసుడు బతకడానికి కష్టపడటం చూడలేక ఇలా మాట్లాడుతున్నానని అంటుంది.
ఆస్తి పంపకాల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పమని సీతారామయ్యను అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఆస్తిని ముక్కలు చేసి తాను బతకలేనని సీతారామయ్య అంటాడు. వందేళ్ల చరిత్రను ఒక్కరోజులో మార్చే శక్తి తనకు లేదన చెబుతాడు. కొంత టైమ్ కావాలని ధాన్యలక్ష్మిని కోరుతాడు. ఎంత సమయం కావాలని సీతారామయ్యపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది.
మభ్య పెట్టడానికే...
నన్ను మభ్యపెట్టడానికే సమయం అడుగుతున్నారని, ఈలోగా నా నోరు మూయించి మీ నిర్ణయం మార్చుకోవాలని చూస్తున్నారని నిందలు వేస్తుంది. భర్తను ధాన్యలక్ష్మి తప్పుపట్టడం ఇందిరాదేవి సహించలేకపోతుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావని కోప్పడుతుంది. నా కొడుకు చవటలా కూర్చుంటేనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అంటుంది. నీ పెళ్లాన్ని అదుపులో పెట్టుకోవడం చేతకాదా అని ప్రకాశాన్ని దులిపేస్తుంది ఇందిరాదేవి.
పుట్టింటి ఆస్తి తెచ్చావా...
మీ పుట్టింటి నుంచి పసుపు కుంకుమల కింద తెచ్చిన ఆస్తిని మా ఆస్తిలో కలిసేశావా అంటూ ధాన్యలక్ష్మికి క్లాస్ ఇస్తుంది. ఇంత స్వార్థం నీలో ఎలా ప్రవేశించింది అని నిలదీస్తుంది. రాజ్‌ను మేనేజర్ చేసినా అపర్ణ ఇదేమిటని ప్రశ్నించలేదని అంటుంది. కోడలిగా హక్కులు అడిగే ముందు బాధ్యతలు కూడా తెలుసుకుంటే మంచిదని దులిపేస్తుంది.
రుద్రాణి జోక్యం...
గొడవ పెద్దది చేయడానికి రుద్రాణి జోక్యం చేసుకోబోతుంది. అరిచి మా నోట్లో మట్టి కొడతారని తెలుసు అని అంటుంది. రుద్రాణి మాటల్ని స్వప్న సహించలేకపోతుంది. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే నేనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని అంటుంది. అత్తను ఇంటి నుంచి గెంటేసిన కోడలు అన్న నింద నాపై పడ్డ పరవలేదని అంటుంది.
ఇంటిని ముక్కలు చేయాలన్న ఆలోచన ధాన్యలక్ష్మిలో కలిగించింది నువ్వే అని నాకు బాగా తెలుసునని రుద్రాణితో అంటుంది స్వప్న. ఇంటికి వీసమెత్తు మంచి చేయడం చేతకాదు కానీ ఆస్తిలో వాటాలా కావాలా...నీ మొగుడు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఒక్కడ ఉన్నాయా అంటూ రుద్రాణి బండారం మొత్తం బయటపెట్టేస్తుంది.
రాజ్ సలహా...
అప్పును కోడలిగా ధాన్యలక్ష్మి ఒప్పుకుంటే...కళ్యాణ్ కష్టపడాల్సిన అవసరం లేదని, అందరం సంతోషంగా బతకొచ్చని రాజ్ సలహా ఇస్తాడు. అసలు ఈ గొడవలకు కారణం నువ్వేనని రాజ్‌పై ఫైర్ అవుతుంది ఇందిరాదేవి. పెళ్లాన్ని పుట్టింట్లో వదిలేసి...తమ్ముడి భార్యను క్షమించమని సలహాలు ఇస్తున్నావా రాజ్‌కు క్లాస్ ఇస్తుంది. ఇంకో సారి ఆస్తిలో వాటాలు అడిగితే ఊరుకోనని ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ఇందిరాదేవి.
రాజ్ ఈగో...
వేరే కంపెనీకి పంపించాల్సిన డిజైన్స్‌ను అప్రూవ్ చేయకుండా గేమ్స్ ఆడుకుంటూ ఆఫీస్‌లో కూర్చుంటాడు. అర్జెంట్ ఫైల్ అని వెంటనే సైన్ చేయమని రాజ్‌ను అడుగుతుంది కావ్య. కానీ పెన్ లేదని, మూడ్ లేదంటూ సాకులు చెబుతాడు రాజ్. పెద్ద కాంట్రాక్ట్ అని, కంపెనీకి లాభాలు వస్తాయని రాజ్‌తో అంటుంది కావ్య.
కాంట్రాక్ట్ వస్తే క్రెడిట్ మొత్తం నీకు వస్తుందని తన మనసులో కావ్య పట్ల ఉన్న జెలసీని బయటపెడుతుంది. ఫైల్‌పై సంతకం చేయకపోతే కంపెనీ నుంచి డిస్మిస్ చేస్తానని రాజ్‌కు వార్నింగ్ ఇస్తుంది కావ్య. బాస్‌గా తనకు ఆర్డర్స్ వేసే హక్కు ఉందని అంటుంది.
కావ్య సీఈవో కావడం వల్లే...
ధాన్యలక్ష్మి చేసిన గొడవకు కారణం నువ్వేనని తాతయ్యను తప్పుపడతాడు రాజ్. ఇంటితో సంబంధం లేదని వెళ్లిపోయిన కావ్యను సీఈవో చేశారు...ఇంటి వారసుడైనా కళ్యాణ్ ఆటో నడుపుతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే పిన్ని గొడవలు చేసిందని తాతయ్యతో రాజ్ అంటాడు.
కావ్య సీఈవో కావడానికి గొడవలు జరగడానికి ఏ మాత్రం సంబంధం లేదని రాజ్‌కు క్లాస్ ఇస్తాడు సీతారామయ్య. కావ్య సీఈవో కావడం నీకు ఇష్టం లేకే ఇలా మాట్లాడుతున్నావని రాజ్‌లోని అనుమానాల్ని తొలగించేందుకు తాతయ్య ప్రయత్నిస్తాడు. భార్య కింద పనిచేయడం ఇష్టంలేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అంటాడు.
కావ్య సీఈవో అయినప్పటి నుంచే...
తాను సీఈవోగా పనిచేసినప్పుడు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదని, అందరం సంతోషంగా ఉన్నామని, కానీ కావ్య సీఈవో అయినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయని, మీ నిర్ణయాల వల్ల ఇళ్లు ముక్కలైతే తనకు సంబంధం లేదని తాతయ్యతో చెప్పి రాజ్ వెళ్లిపోతాడు.
బెడిసికొట్టిన ప్లాన్...
తన ప్లాన్ బెడిసికొట్టడంతో రుద్రాణి తెగ పీలైపోతుంది. కష్టపడి కావ్యను ఇంటి నుంచి వెళ్లగొడితే కంపెనీకి సీఈవోను చేశాడు...ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం టైమ్ ఇస్తే ఏదో ఒకటి చేసి మనల్ని సీతారామయ్య తప్పకుండా అడ్డువేస్తాడని రుద్రాణి అంటుంది. మళ్లీ ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి ఆస్తి పంపకాల వ్యవహారం తెరపైకి తీసుకురావాలని రుద్రాణి అనుకుంటుంది.
స్వప్న అడ్డు...
స్వప్నసడెన్‌గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. నువ్వు గుమస్తాకు పుట్టిన దానివని, సీతారామయ్య నీకు కన్న తండ్రి కానప్పుడు ఆస్తిని మీకు ఎలా ఇస్తారంటూ రుద్రాణిని అవమానిస్తుంది స్వప్న. కోడలి మాటల్ని విని కోపం పట్టలేకపోతుంది రుద్రాణి. నీ మొగుడికి ఆస్తి పంచితే అనుభవించేది నువ్వేనని స్వప్నతన వైపుకు తిప్పుకునేలా మాట్లాడుతుంది రుద్రాణి.
మీకు ఆస్తి పంచి ఇస్తే మూడు రోజుల్లో ముగించేస్తారు. ఆ తర్వాత నేను అడుక్కుతినాలని స్వప్న అంటుంది. ఆస్తి పంచకుండా అడ్డుకుంటావా అని రాహుల్ అనగా..అందులో డౌట్ లేదని స్వప్న బదులిస్తుంది. అదే దుగ్గిరాల ఇంట్లో ఉంటే జీవితాంతం మహారాణిలా బతకొచ్చని చెబుతుంది. ఆస్తి కావాలని ప్లాన్స్ వేస్తే నేనే మిమ్మల్ని అడ్డుకుంటానని వార్నింగ్ ఇస్తుంది.
రాజ్‌తో కావ్యకు పోటీ...
కంపెనీకి వచ్చిన కొత్త కాంట్రాక్ట్ విషయంలో రాజ్, కావ్యలకు పోటీపెడతాడు సీతారామయ్య. ఇందులో ఎవరూ గెలిస్తే వారే కంపెనీకి కొత్త సీఈవో అని ప్రకటిస్తాడు. ఒక వేళ రాజ్ ఓడిపోతే కావ్యను తిరిగి పుట్టింటికి తీసుకురావాలని కండీషన్ పెడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.