Guppedantha Manasu Today Episode: మను తండ్రి మహేంద్రనే - లాజిక్‌లతో బయటపెట్టిన శైలేంద్ర - రిషి తండ్రి బ్లాక్‌మెయిల్
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మను నిజంగానే మహేంద్ర కొడుకు కావచ్చునని శైలేంద్ర సందేహం వ్యక్తం చేస్తాడు. మహేంద్ర, అనుపమ పేర్ల నుంచి ఒక్కో అక్షరాన్ని తీసి మనుకు పేరు పెట్టారని డౌట్ పడతాడు.
Guppedantha Manasu Today Episode: మహేంద్ర తనను దత్తత తీసుకోబోతున్నాడని శైలేంద్ర ద్వారా మనుకు తెలుస్తుంది. తనకు తెలియకుండా దత్తత కార్యక్రమం పెట్టడంపై మను ఫైర్ అవుతాడు. దత్తత గురించి మనుకు చెబుతూ అతడిని దారుణంగా అవమానిస్తాడు శైలేంద్ర. మహేంద్ర వల్లే తాను శైలేంద్రతో మాటలు పడాల్సివచ్చిందని మను అనుకుంటాడు. అతడితోనే దీని గురించి తేల్చుకోవాలని ఆవేశంగా మహేంద్ర ఇంటికి వెళతాడు.
రాజీవ్‌కు గుడ్‌బై...
మనును దెబ్బకొట్టడానికి ఇక నుంచి రాజీవ్‌తో పనిలేదని దేవయానితో అంటాడు శైలేంద్ర. మహేంద్ర, మనుకు మధ్య తాను రాజేసిన నిప్పు పెద్ద గొడవగా మారడం ఖాయమని చెబుతాడు. మను, మహేంద్ర మధ్య మాటల యుద్ధం జరుగుతుందని, ఈ గొడవతో మను సిటీ వదిలిపెట్టి వెళ్లడం ఖాయమని అంటాడు. ఒక దెబ్బకు అటు మనుతో పాటు ఇటు బాబాయ్‌కి చెక్ పెట్టొచ్చు తల్లి దేవయానితో చెబుతాడు శైలేంద్ర.
శైలేంద్ర అనుమానం...
మనును మహేంద్ర దత్తత తీసుకుంటున్నాడా? మను అసలైన తండ్రి మహేంద్రనేనా అని శైలేంద్ర అనుమానపడతాడు. మహేంద్రలో మొదటి అక్షరం మ...అనుపమలో రెండో అక్షరం ను....ఈ రెండు కలిపి మనుకు పేరు పెట్టారు కావచ్చునని సందేహం వ్యక్తం చేస్తాడు.
తన ఊహలు నిజమేకావచ్చునని శైలేంద్ర టెన్షన్ పడతాడు. కానీ దేవయాని మాత్రం అతడివి పిచ్చి మాటలు అని కొట్టేస్తుంది. మను మహేంద్ర కొడుకు కాదని అంటుంది. కానీ తాను నిజమే చెబుతున్నానని, మను మహేంద్ర కొడుకునేనని, ఈ ఇంటివారసుడని అంటాడు. అతడి మాటలతో దేవయాని కంగారు పడుతుంది.
దేవయాని భయం...
మను మహేంద్ర కొడుకే అని తేలితే అతడినే ఈ ఇంటివారసుడిగా ఫణీంద్ర ప్రకటించే అవకాశం ఉందని, అందుకే నీ అనుమానాలు మనసులో పెట్టుకొమ్మని, ఎవరికి చెప్పొద్దని కొడుకుతో అంటుంది దేవయాని. పైకి ధైర్యంగా మాట్లాడుతున్నా లోలోన మాత్రం శైలేంద్ర సందేహం నిజమని దేవయాని కూడా అనుకుంటుంది. మను నిజంగానే మహేంద్ర కొడుకు కావచ్చునని భయపడుతుంది.
మను ఫైర్...
మహేంద్ర ఇంట్లో అడుగుపెట్టడంతోనే అతడిపై మను ఫైర్ అవుతాడు. నా పర్మిషన్ లేకుండా నన్ను ఎలా దత్తత తీసుకుంటారని నిలదీస్తాడు. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు చేయద్దని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటికే మీరు నా తండ్రి అందరిలో అనడం వల్లే చాలా హర్ట్ అయ్యానని, ఇప్పుడు దత్తత తీసుకుంటే ఆ బాధ మరింత పెరుగుతుందని మహేంద్రతో మను అంటాడు. మహేంద్రను వసుధార ఎంకరేజ్ చేయడం కూడా మనుసహించలేకపోతాడు.
మహేంద్ర నిర్ణయం...
దత్తత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మహేంద్రను డిమాండ్ చేస్తాడు మను. కుదరదని మనుతో అంటాడు మహేంద్ర. నాకు ఇష్టం లేకుండా నన్ను ఎలా దత్తత తీసుకుంటారని అడుగుతాడు. రెండు రోజుల్లో అధికారులు, బంధుమిత్రుల సమక్షంలో దత్తత కార్యక్రమం ఉంటుందని మనుతో చెబుతాడు మహేంద్ర. ఇన్నాళ్లు నన్ను ఓ కొడుకుగా భావిస్తున్నానంటే ఏమో అనుకున్నాను. కానీ చివరకు ఇలా చేస్తారని ఊహించలేదని మహేంద్రపై మను కోపంగా అంటాడు.
ఏ హక్కుతో కాలేజీని కాపాడావు...
మీకు అంతగా దత్తత తీసుకోవాలనుకుంటే బయట ఎంతో మంది దొరుకుతారు. నన్ను మాత్రం దత్తత తీసుకోవద్దు అని మహేంద్రతో అంటాడు మను. నాకు అది అవమానంగా అనిపిస్తోందని చెబుతాడు. తండ్రి ఎవరో తెలియకుండా పెరగడం కంటే ఇది పెద్ద అవమానం కాదని మనుకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తాడు మహేంద్ర.
అతడి మాటలతో మను కోపం మరింత పెరుగుతుంది. నన్ను ఏ హక్కుతో దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారో చెప్పమని అంటాడు. ఏ హక్కుతో మా కాలేజీని కాపాడావు...ఏ హక్కుతో మాకు యాభై కోట్ల చెక్ ఇచ్చావు... ఏ హక్కుతో వసుధార బర్త్‌డేను సెలబ్రేట్ చేశావని మనును నిలదీస్తాడు. నువ్వు ఏ హక్కుతో ఇవన్నీ చేశావో అదే హక్కుతో నేను నిన్ను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది.
మనుకు షాక్...
మీరు ఏమైనా చేసుకొండి. నేను మాత్రం ఈ దత్తత కార్యక్రమానికి రానని మను ఖరాఖండిగా చెబుతుంది. నువ్వు రాకపోతే నన్ను జీవితంలో కలవలేవు. మళ్లీ చూడలేవు అని మహేంద్ర తన నిర్ణయం వెల్లడిస్తాడు. మహేంద్ర మాటలతో మను షాకవుతాడు. కొన్ని విషయాల్లో మొండిగా ఉంటానని అంటాడు. నా మొండితనం గురించి వసుధారను అడగమని చెబుతాడు. మహేంద్ర మాటలను సహించలేక కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు మను.
ఏంజెల్ డౌట్...
ఆ తర్వాత మను దత్తత గురించి విశ్వనాథానికి ఫోన్ చేసి చెబుతాడు మహేంద్ర. ఆ వేడుకకు రమ్మని ఆహ్వానిస్తాడు. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని విశ్వనాథం కంగారు పడతాడు. దత్తత గురించి మను ఏమనుకుంటాడో, మను అసలు తండ్రికి ఈ విషయం తెలుసులేదోనని ఏంజెల్ కూడా అంటుంది.
అనుపమకు పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. ఇకనైనా మౌనం వీడమని సలహా ఇస్తుంది. ఒక్క అడుగు ధైర్యంగా వేస్తే ఈ అవమానాలు, తలవంపులు ఉండవు. నిన్ను వేలేత్తి చూపిన వాళ నోర్లు మూతపడతాయి.
ఏదో ఊహించుకొని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారు. నువ్వు నోరు తెరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుపమకు పెద్దమ్మ సలహా ఇస్తుంది. దత్తతకు రాకపోతే తాను చనిపోతానని మహేంద్ర బెదిరించడం గురించి మను ఆలోచిస్తుంటాడు. దత్తత కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తుంటాడు.