Dhanam Rules: ఈ 5 రోజులు ఎవ్వరికీ దానం చెయ్యద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి సంపదను కోల్పోవచ్చు, అప్పులు బాధలు కూడా-dhanam rules never donate on these five days do these for lakshmi devi blessings never do these mistakes after sunset ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhanam Rules: ఈ 5 రోజులు ఎవ్వరికీ దానం చెయ్యద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి సంపదను కోల్పోవచ్చు, అప్పులు బాధలు కూడా

Dhanam Rules: ఈ 5 రోజులు ఎవ్వరికీ దానం చెయ్యద్దు.. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి సంపదను కోల్పోవచ్చు, అప్పులు బాధలు కూడా

Peddinti Sravya HT Telugu
Dec 23, 2024 12:00 PM IST

Dhanam Rules: చాలా మంది దానం చేస్తే మంచి జరుగుతుందని, వారికి నచ్చినట్లు చేస్తూ ఉంటారు. కానీ దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఏమైనా దానం చేయాలన్న ఈ ఐదు రోజులు అస్సలు పనికిరాదు.

Dhanam Rules: ఏడాదిలో ఈ 5 రోజులు ఎవ్వరికీ దానం చెయ్యద్దు
Dhanam Rules: ఏడాదిలో ఈ 5 రోజులు ఎవ్వరికీ దానం చెయ్యద్దు (pinterest)

ఎవరికైనా ఏమైనా సహాయం చేస్తే పుణ్యం వస్తుంది. ఎవరికైనా సహాయం చేస్తే, భగవంతుడు అండగా ఉంటాడని అంటూ ఉంటారు. సనాతన ధర్మంలో ఏ పండుగ, ఏ ఉపవాసం కూడా దానం చేయకుండా పూర్తి కాదు. ఎవరికైనా సహాయం చేస్తే మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సహాయం చేసే వారి ఇంట విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సంపద కురిపిస్తారు. అయితే, ఏడాదిలో ఈ ఐదు రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ దానం చేయకూడదు.

చాలా మంది దానం చేస్తే మంచి జరుగుతుందని, వారికి నచ్చినట్లు చేస్తూ ఉంటారు. కానీ దానం చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఏమైనా దానం చేయాలన్న ఈ ఐదు రోజులు అస్సలు పనికిరాదు. ఈ ఐదు రోజులు దానం చేయడం వలన సమస్యలు వస్తాయి తప్పవు. ఆ దానం యొక్క ఫలితం అందదు.

మరి ఏడాదిలో ఎప్పుడెప్పుడు ఎవరికీ దానం చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం. ఇకపై మీరు వీటిని అనుసరించారంటే మీకు మంచి జరుగుతుంది. దానం చేసేటప్పుడు ఈ నియమాలను పాటించి సరిగ్గా దానం చేస్తే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది.

ఏయే రోజుల్లో ఎవరికీ ఏమీ దానం చేయకూడదు?

గురువారం

గురువారం నాడు ఎవరికి ఏమి ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ఎవరికీ దానం చేయకూడదట. అలా చేయడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆగ్రహం చెందుతారు. గురువారం నాడు ఎవరికీ డబ్బులు ఇవ్వడం కానీ ఏమైనా దానం చేయడం కానీ మంచిది కాదు. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక రకాల సమస్యలు కలుగుతాయి.

చీకటి పడిన తర్వాత వీటిని ఎవరికీ ఇవ్వకండి

చాలా మంది చీకటి పడిన తర్వాత కూడా ఎవరైనా ఏమైనా సహాయం అడిగితే చేస్తూ ఉంటారు. కానీ, నిజానికి చీకటి పడిన తర్వాత కొన్నిటిని అసలు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం తరవాత పెరుగు, పాలు, పసుపు, తులసి మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవచ్చు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీకటి పడిన తర్వాత వీటిని ఎవరికి ఇవ్వకండి.

చనిపోయిన తర్వాత దానం చేయడం

చనిపోయిన తర్వాత ఎవరికి కూడా ఏమీ ఇవ్వకూడదు. 13 రోజులు పాటు ఎవరికీ సహాయం చేయకూడదు. డబ్బులు ఇవ్వడం వంటి తప్పులు చేయకూడదు. ఇలా చేయడం వలన పితృ దోషం కలుగుతుంది. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 13వ రోజు వరకు ఏమి సహాయం చేయొద్దు.

దీపావళి నాడు

దీపావళి నాడు మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అందుకని ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటాము. ఇంటి నిండా దీపాలని పెడుతూ ఉంటాము. అయితే దీపావళి నాడు ఎవరికైనా ఏమైనా దానం చేసినా, డబ్బులు ఇచ్చినా లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అప్పుల బాధల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ధను త్రయోదశి నాడు

ధను త్రయోదశి నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఉప్పును ఎవరికి దానం చేయకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతాము. కాబట్టి ధను త్రయోదశి నాడు ఎవరికీ ఉప్పు ఇవ్వకండి.. మామూలు రోజుల్లో కూడా చీకటి పడ్డాక ఉప్పుని ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా వీటిని మీరు అనుసరించినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి అప్పుల బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner