Nara Devansh World Record : వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ తోపు.. ప్రపంచ రికార్డు సొంతం!-minister nara lokesh son devansh sets world record for fastest chess move ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Devansh World Record : వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ తోపు.. ప్రపంచ రికార్డు సొంతం!

Nara Devansh World Record : వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ తోపు.. ప్రపంచ రికార్డు సొంతం!

Basani Shiva Kumar HT Telugu
Dec 23, 2024 11:50 AM IST

Nara Devansh World Record : నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్.. వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్‌లో ప్రపంచ రికార్డును సాధించాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు.

నారా దేవాన్ష్
నారా దేవాన్ష్

వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్.. చెక్‌మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగాడు.

yearly horoscope entry point

మరో 2 రికార్డులు..

ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

కళ్లారా చూశాను..

పిన్నవయసులో తనయుడు దేవాన్ష్ సాధించిన ఈ విజయంపై తండ్రి లోకేష్ స్పందించారు. 'దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు. దేవాన్ష్‌కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను' అని ట్వీట్ చేశారు.

ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడు. దేవాన్ష్ కోచ్ కె.రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందించారు. 'దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన అతని మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.

తాత ప్రశంసలు..

'వెల్‌డన్ దేవాన్ష్.. 175 పజిల్స్ పూర్తి చేయడం ద్వారా వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించినందుకు అభినందనలు. కృషి, అంకితభావం, పట్టుదల ఈ విజయానికి కీలకం. ఈ సాధనకు సిద్ధం కావడానికి నువ్ చాలా నెలలు శ్రద్ధగా కృషి చేశావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది లిటిల్ గ్రాండ్ మాస్టర్' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Whats_app_banner