OnePlus 13R : ‘ఏఐ’ ఇప్పుడు మీ చేతుల్లో! సూపర్​ కూల్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ 13ఆర్​ వచ్చేస్తోంది..-oneplus 13r confirmed to launch with snapdragon 8 gen 3 soc see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus 13r : ‘ఏఐ’ ఇప్పుడు మీ చేతుల్లో! సూపర్​ కూల్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ 13ఆర్​ వచ్చేస్తోంది..

OnePlus 13R : ‘ఏఐ’ ఇప్పుడు మీ చేతుల్లో! సూపర్​ కూల్​ ఫీచర్స్​తో వన్​ప్లస్​ 13ఆర్​ వచ్చేస్తోంది..

Sharath Chitturi HT Telugu
Dec 23, 2024 11:22 AM IST

Oneplus 13r launch date in India : వన్​ప్లస్​ 13ఆర్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఇందులో అనేక ఏఐ ఫీచర్స్​ ఉంటాయని తెలుస్తోంది. వాటితో పాటు ఈ వన్​ప్లస్​ 13ఆర్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వన్​ప్లస్​ 13ఆర్​లో సూపర్​ కూల్​ ఫీచర్స్​..
వన్​ప్లస్​ 13ఆర్​లో సూపర్​ కూల్​ ఫీచర్స్​.. (Amazon)

వన్​ప్లస్​ నుంచి మరో కొత్త స్మార్ట్​ఫోన్ సిరీస్​​ లాంచ్​కి రెడీ అవుతోంది. దాని పేరు వన్​ప్లస్​ 13​. ఇందులో 2 గ్యాడ్జెట్స్​ ఉంటాయి. అవి వన్​ప్లస్​ 13, వనప్లస్​ 13ఆర్​. ఇవి 2025 జనవరి 7న విడుదలవుతాయని సంస్థ ధ్రువీకరించింది. అంతేకాదు, ఇవి ఇప్పటికే అమెజాన్ వెబ్సైట్​లో లిస్ట్​ అయ్యాయి. ఇండియాలో లాంచ్​కి ముందు డిజైన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించిన కొన్ని సమాచారం అందుబాటులోకి వచ్చింది. వన్​ప్లస్​ 13ఆర్.. స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్​తో పనిచేస్తుందని అమెజాన్ ధృవీకరించింది. ఇది గత సంవత్సరం వన్​ప్లస్​ 12ఆర్​తో పోలిస్తే గణనీయమైన పర్ఫార్మెన్స్​ బూస్ట్​ని అందిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

వన్​ప్లస్ 13ఆర్ స్పెసిఫికేషన్లు..

వన్​ప్లస్ 13ఆర్, వన్​ప్లస్ 13 కోసం మైక్రోసైట్​ను అమెజాన్ రూపొందించింది. నెలల తరబడి వేచి చూసిన తరువాత.. వన్​ప్లస్​ 13ఆర్ డిజైన్​ని సంస్థ ఇప్పుడు అమెజాన్ ద్వారా ఆవిష్కరించింది. ఇది ఫ్రెష్​గా కనిపిస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, కొన్ని ఏఐ సామర్థ్యాలతో పనిచేస్తుందని లిస్టింగ్ ధృవీకరించింది.

ఏఐ నోట్స్, ఏఐ ఇమేజింగ్ పవర్, ఇంటెలిజెంట్ సెర్చ్​తో పాటు ఇతర ఏఐ ఆధారిత ఫీచర్లను వన్​ప్లస్ 13ఆర్ అందించనుంది. అదనంగా, ఈ స్మార్ట్​ఫోన్​ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో మెరుగైన బ్యాటరీ లైఫ్​ని కూడా అందిస్తుంది.

వన్​ప్లస్​ 13ఆర్​తో పాటు ఫ్లాగ్​షిప్​ వన్​ప్లస్​ 13 లభ్యతను అమెజాన్ ధృవీకరించింది. కొత్త తరం వన్​ప్లస్​ మోడల్ ఏమి అందిస్తుందో టీజ్ చేస్తూ కొన్ని ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచారు.

వన్​ప్లస్​ 13ఆర్: ఇతర వివరాలు..

వన్​ప్లస్​ 13ఆర్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అవి.. ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ షేడ్. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో ట్రిపుల్ కెమెరా సెటప్​ ఉంటుందని సంస్థ ధ్రువీకరించింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది. చివరిగా.. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం వన్​ప్లస్​ 13ఆర్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ని అందించవచ్చు.

వన్​ప్లస్​ ఏస్5 గా డిసెంబర్ 26న చైనా లాంచ్ అయిన తరువాత ఈ వన్​ప్లస్​ 13ఆర్ గురించి మనం మరింత తెలుసుకోవచ్చు. అందువల్ల, వన్​ప్లస్​ ఏం ప్లాన్ చేసిందో తెలుసుకునేందుకు అధికారిక ఇండియా లాంచ్ వరకు వేచి ఉండాలి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో ఫాలో అవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం