కెల్ప్ అని పిలిచే సముద్రపు నాచు రెండు కోట్ల సంవత్సరాల క్రితమే ఉద్భవించింది. ప్రస్తుతం మనుషులు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం, ఫాస్ట్‌ఫుడ్స్‌తో శరీరంలో చేరే లోహాల ముప్పును నిరోధించడంలో కెల్ప్ తోడ్పడుతుంది.
By Bolleddu Sarath Chandra Dec 23, 2024
Hindustan Times Telugu
కెల్ప్‌లో కార్బో హైడ్రేట్స్, ప్రొటీన్, కొవ్వు పదార్ధాలు,ఫైబర్, ఖనిజ లవణాలైన కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ కె తగిన మోతాదులో ఉంటాయి.
ఇతర ఆహార పదార్ధాల కంటే కెల్ప్‌లో అయోడిన్ అత్యధిక శాతంలో లభిస్తుంది. కొన్ని రకాల కెల్ప్‌లలో 2984 మైక్రోగ్రామ్స్ వరకు అయోడిన్ ఉంటుంది.
అయోడిన్ శరీరానికి అత్యంత అవసరమైన మినరల్. అయోడిన్ థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తికి ముఖ్యమైన పదార్ధం, శరీరంలోని సకల కణాల జీవ క్రియ థైరాయిడ్ హార్మోనులపై ఆధారపడి ఉంటుంది.
కెల్ప్‌లో ఉండే అయోడిన్ క్యాన్సర్ వ్యాధి నివారణకు, ఎదిగే పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
థైరాయిడ్ గ్రంథి తక్కువ స్థితిలో పనిచేయడం వల్ల కలిగే హైపోథైరాయిడిజమ్ అనే వ్యాధికి దాని వల్ల సంభవించే నిస్త్రాణకు,మానసిక దుర్భలత్వానికి కెల్ప్ ఔషధంగా ఉపయోగపడుతుంది.
కెల్ప్‌లో ఉండే ఫ్యకోక్టాన్ తిన్ ప్రొటీన్ కండరాలలో ఉన్న కొవ్వును కిరిగించి శరీరం బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
కెల్ప్‌తో పాటు దానిమ్మ గింజల నూనె తీసుకుంటే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
కెల్ప్‌లో ఉండే ఆల్గినేట్స్‌గా పిలిచే పరమాణువులు శరీరంలో అధికంగా ఉండే కొవ్వును విసర్ఝకాల రూపంలో బయటకు పంపుతాయి.
డయాబెటిస్‌తో బాధపడే వారు, ప్రీ డయాబెటిస్ లక్షణాలతో బాధపడేవారు తమ ఆహారంలో కెల్ప్‌ను చేర్చుకోవడం ద్వారా గ్లూకోజ్‌ను అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధనలు రుజువు చేశాయి.
కెల్ప్‌లో ఉండే ఫుకాయిడన్ ప్రత్యేకంగా రక్తం చిక్కబడకుండా చేయడంతో పాటు గుండె వ్యాధులు, పక్షవాతం రాకుండా కాపాడుతుంది.
బ్లడ్ థిన్నర్స్ వాడే వారు వాటి స్తానంలో కెల్ప్‌ను వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రయోజనాలను పొందవచ్చు.
కెల్ప్‌లో ఉండే ఫుకాయిడన్ రక్తప్రసణను మెరుగు పరుస్తుంది. రక్త ప్రసరణ లేకపోవడం వల్ల అవయవాలు క్రమంగా చచ్చుబడి పోతాయి.
ఫుకాయిడన్ రక్త ప్రసరణను క్రమబద్దీకరించి శరీరాన్ని పక్షవాతం బారిన పడకుండా కాపాడుతుంది.
క్యాన్సర్‌ను నిరోధించడంలో కూడా కెల్ప్ కీలకంగా పనిచేస్తుంది. కెల్ప్‌లోని పోషక పదార్ధాలు అన్ని రకాల క్యాన్సర్లపై పనిచేస్తాయి. కెల్ప్‌లో ఉండే ఫ్యుకో క్జాంతిన్ కేన్సర్ వాడే కీమోథెరపీ డ్రగ్స్ సక్రమంగా పనిచేయడానికి థోడ్పడతాయి.
మనుషులకు ఉన్నట్లుగా అన్ని జీవులకు గుండె అవసరం లేదని మీకు తెలుసా..