Tollywood: టికెట్ రేట్లు, ప్రీమియర్స్.. దిల్‍రాజు మూవీనే ముందు.. ఏం తేలుస్తారో చూద్దాం: బాలకృష్ణ సినిమా నిర్మాత-waiting for dil raju daku maharaj producer naga vamsi on ticket prices hike and premieres issue in telangana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood: టికెట్ రేట్లు, ప్రీమియర్స్.. దిల్‍రాజు మూవీనే ముందు.. ఏం తేలుస్తారో చూద్దాం: బాలకృష్ణ సినిమా నిర్మాత

Tollywood: టికెట్ రేట్లు, ప్రీమియర్స్.. దిల్‍రాజు మూవీనే ముందు.. ఏం తేలుస్తారో చూద్దాం: బాలకృష్ణ సినిమా నిర్మాత

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 23, 2024 02:46 PM IST

Tollywood: ఇటీవల జరిగిన పరిణామాలతో సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకోనివ్వబోమనేలా తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. దీంతో సంక్రాంతి సినిమాలకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయంపై ఎదురైన ప్రశ్నకు నిర్మాత నాగవంశీ తాజాగా స్పందించారు.

Tollywood: టికెట్ రేట్లు, ప్రీమియర్స్.. దిల్‍రాజు మూవీనే ముందు.. ఏం తేలుస్తారో చూద్దాం: బాలకృష్ణ మూవీ నిర్మాత
Tollywood: టికెట్ రేట్లు, ప్రీమియర్స్.. దిల్‍రాజు మూవీనే ముందు.. ఏం తేలుస్తారో చూద్దాం: బాలకృష్ణ మూవీ నిర్మాత

ఫుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్‍పై విడుదలవడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్లతో విషయం మరింత సీరియస్ అయింది. అల్లు అర్జున్ ప్రెస్‍మీట్‍తో మరింత చర్చనీయాంశంగా మారింది. సినిమాలకు బెనెఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమనేలా సీఎం రేవంత్ అన్నారు. టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమనేలా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. సంక్రాంతికి రాబోతున్న సినిమాలకు ఇది చాలా ఇబ్బందిగా మారింది. ఈ విషయంపై నిర్మాత నాగవంశీకి ప్రశ్న ఎదురైంది. డాకు మరాహాజ్ కోసం నేడు (డిసెంబర్ 23) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన స్పందించారు.

4 గంటల నుంచే షోలు

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా.. బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ మూవీని నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుండగా.. నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బెనెఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం గురించి ఆయనకు ఈ సందర్భంగా ప్రశ్న ఎదురైంది. దీంతో సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని చెప్పారు. “సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు. గతంలో చాలాసార్లు మాట్లాడున్నాం. ఇక 4 గంటల నుంచే” అని నాగవంశీ అన్నారు. డాకు మహారాజ్ ప్రీమియర్స్ ప్లాన్ చేయడం లేదని, తెల్లవారుజామున 4 గంటలకే షోలు మొదలవుతాయని ఆయన సంకేతాలు ఇచ్చేశారు.

దిల్‍రాజు వచ్చాక.. ఆయన సినిమానే ముందు

టికెట్ల రేట్లను కూడా పెంచబోమని కూడా తెలంగాణ ప్రభుత్వం అంటోందని కూడా నాగవంశీకి ప్రశ్న ఎదురైంది. దిల్‍రాజు అమెరికాలో ఉన్నారని, ఆయన దిగిన తర్వాత మాట్లాడదామనేలా అన్నారు. “ఎఫ్‍డీసీ చైర్మన్ (దిల్‍రాజు) అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత.. ముందు ఆయన సినిమా (గేమ్ ఛేంజర్) ఉంది. ఆయన ఏం తేలుస్తారో చూద్దాం” అని నాగవంశీ అన్నారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‍డీసీ) చైర్మన్‍గా ఇటీవలే దిల్‍రాజును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వానికి, టాలీవుడ్‍కు వారధిగా ఉంటానని బాధ్యతలు తీసుకునే సమయంలో దిల్‍రాజు అన్నారు. డల్లాస్‍లో గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన దిల్‍రాజు నేడు లేదా రేపు హైదరాబాద్ తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. దీంతో ఆయన వచ్చాక ఈ విషయాలపై క్లారిటీ వస్తుందనేలా నాగవంశీ చెప్పారు.

సంక్రాంతికి దిల్‍రాజు రెండు సినిమాలు

ఈసారి సంక్రాంతికి దిల్‍రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రానున్నాయి. రామ్‍చరణ్ హీరోగా నటించిన హైబడ్జెట్ చిత్రం జనవరి 10నే విడుదల కానుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు బెనెఫిట్ షోలు ఉంటాయని దిల్‍రాజు గతంలో చెప్పారు. మరి పరిస్థితుల పరిస్థితుల్లో ఏమవుతుందో చూడాలి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం.. జనవరి 14న విడుదల కానుంది.

Whats_app_banner