Guntur Kaaram: ‘గుంటూరు టు హైదరాబాద్’ ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన నిర్మాత నాగవంశీ.. ఏం చెప్పారంటే..
Guntur Kaaram Movie - Naga Vasmsi: గుంటూరు కారం సినిమాపై వచ్చిన విమర్శల గురించి నిర్మాత నాగవంశీ మరోసారి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ మూవీలో హీరో మహేశ్ బాబు.. గుంటూరు నుంచి హైదరాబాద్‍కు తరచూ ప్రయాణించే విషయంలో వచ్చిన ట్రోల్స్‌పై ఆయన స్ట్రాంగ్‍గా స్పందించారు.
Guntur Kaaram Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. జనవరి 12వ తేదీన రిలీజైన ఆ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్లు బాగానే రాబట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో రాగా.. ఆ రేంజ్‍లో లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని కొన్ని విషయాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ మూవీలో హీరో మహేశ్ బాబు.. గుంటూరు నుంచి హైదరాబాద్ మధ్య తరచూ ప్రయాణాలు చేయడంపై ట్రోల్స్ వచ్చాయి.
గుంటూరు కారం గురించి వచ్చిన విమర్శలపై నిర్మాత నాగవంశీ చాలా రోజులుగా సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా గట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‍కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాలోని లాజిక్‍ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా గుంటూరు కారంలోని గుంటూరు టు హైదరాబాద్ జర్నీకి సంబంధించిన టోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు.
జర్నీ మొత్తం చూపించాలా?
సినిమాలో హీరో గుంటూరు నుంచి హైదరాబాద్‍కు మాటిమాటికి వెళుతున్నాడని సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారని నాగవంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని లాజికల్‍గా చెప్పేందుకు సినిమాలో మూడున్నర గంటల మొత్తం ప్రయాణం చూపించాలా.. లేకపోతే మధ్యమధ్యలో టీ తాగడం చూపించాలా అని బార్‌బెల్ పిచ్ మీటింగ్ అనే యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.
“అన్నిసార్లు హీరో మాటిమాటికి గుంటూరు నుంచి హైదరాబాద్.. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళుతున్నాడు అంటున్నారు.. ఇప్పుడు ఏంటి.. గుంటూరు నుంచి హైదరాబాద్‍కు మూడు గంటల జర్నీ చేస్తే అందంతా సినిమాలు చూపించాలంటారా.. లేక మధ్యలో టీ షాప్ దగ్గర తాగడం చూపించాలా?” అని నాగవంశీ గట్టిగా బదులిచ్చారు.
రకరకాలుగా మాట్లాడారు
గుంటూరు కారం అని టైటిల్ ఉండడం వల్ల మాస్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని కొందరు అన్నారని నాగవంశీ చెప్పారు. ఫ్యామిలీ ఎమోషన్స్ పూర్తిస్థాయిలో లేదని కొందరు అన్నారని తెలిపారు. ఓటీటీలోకి వచ్చాక గుంటూరు కారం సినిమా బాగుందని.. అప్పుడు ఎందుకు అంత నెగెటివిటీ వచ్చిందని తనను చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పారు. వారికి విమర్శకుల నెంబర్లు ఇవ్వలేని కదా అని పంచ్ వేశారు.
సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాల్లో మాస్ పాటల్లో మహేశ్ బాబు ఇరగదీశారని.. అందుకే వాటిని మించి ఉండాలన్న ఉద్దేశంతో గుంటూరు కారంలో కుర్చీని మడతపెట్టి సాంగ్ పెట్టామని నాగవంశీ వివరించారు. మహేశ్ మాస్ డ్యాన్స్ అభిమానులను బాగా అలరించిందని అన్నారు. అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు సినిమాలు తీస్తామని, పెద్ద సినిమాల్లో ప్రతీ చోట లాజిక్‍లను వెతకడం సరికాదని ఆయన అన్నారు.
గుంటురూ కారం సినిమాలో మహేశ్ బాబు హీరోగా నటించగా.. హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి చేశారు. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, సునీల్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. హాసినీ హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.
టాపిక్