Guntur Kaaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఆ సర్‌ప్రైజ్-mahesh babu guntur kaaram movie ott streaming on netflix additional scenes added to guntur kaaram ott version ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Ott: ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఆ సర్‌ప్రైజ్

Guntur Kaaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఆ సర్‌ప్రైజ్

Sanjiv Kumar HT Telugu
Feb 10, 2024 05:59 AM IST

Mahesh Babu Guntur Kaaram OTT Streaming: సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం మూవీలో మహేశ్ బాబు అభిమానులు సర్‌ప్రైజ్ ఉందని మీడియా సంస్థల్లో న్యూస్ హైలెట్ అవుతోంది.

ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఆ సర్‌ప్రైజ్
ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఆ సర్‌ప్రైజ్

Guntur Kaaram OTT Release: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత కాంబినేషన్‌లో మూడోసారి వచ్చిన గుంటూరు కారంపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ అంచనాలకు తగినట్లుగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తునజనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైంది.

అయితే, ఎన్నో అంచనాలతో విడుదలైన గుంటూరు కారం సినిమాకు మొదటి షో నుంచి మిక్స్‌డ్ టాక్, రివ్యూలు వచ్చాయి. సినిమా ఏం బాలేదని, త్రివిక్రమ్ మ్యాజిక్ లేదని చెప్పిన ఆడియెన్స్ మహేశ్ బాబు పర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయిందని అన్నారు. ముఖ్యంగా డ్యాన్స్ ఇరగదీశాడని, డ్యాన్స్‌లో మహేశ్ బాబు విశ్వరూపం చూపించాడని ప్రంశంసలు కురిపించారు. అనంతరం ఈవెనింగ్ సమయం వచ్చేసరికి గుంటూరు కారం మూవీకి పాజిటివ్ టాక్ రావడం ప్రారంభమైంది.

గుంటూరు కారం మూవీ మాస్ ప్రేక్షకులకు కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయిందని టాక్ నడిచింది. దీనిపై నిర్మాత నాగవంశీ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చారు. "ఇది పూర్తి ఫ్యామిలీ ఒరియెంటెడ్ మూవీ అని జనాల్లోకి తీసుకెళ్లలేకపోయాం. అంతా మాస్ మూవీ అనుకున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. మేము ముందు టెన్షన్ పడినా మహేశ్ బాబు మాత్రం చాలా కూల్‌గా ఉండి హిట్ టాక్ వస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే హిట్ టాక్ వచ్చింది" అని నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే, గుంటూరు కారం సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా మహేశ్ మేనియాతో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ, ఓవరాల్‌గా 90 శాతం కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. దాంతో నెలరోజుల్లోనే గుంటూరు కారం మూవీనీ ఓటీటీలోకి తీసుకొచ్చారు. గుంటూరు కారం ఓటీటీ విడుదల తేదిపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. కానీ, ఎట్టకేలకు శుక్రవారం (ఫిబ్రవరి 9) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది గుంటూరు కారం మూవీ.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి గుంటూరు కారం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఓటీటీ వెర్షన్‌లో మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఉందని టాక్ నడుస్తోంది. గుంటూరు కారం ఓటీటీ వెర్షన్‌లో ఓ కబడ్డీ ఫైట్‌తోపాటు మదర్ సెంటిమెంట్ పాటను యాడ్ చేశారని సమాచారం. ఈ రెండు సినిమాకు హైలెట్‌గా ఉండనున్నాయని, ఇదే మహేశ్ బాబు అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ అని జోరుగా చర్చ నడుస్తోంది.

కాబట్టి, గుంటూరు కారం సినిమాను థియేటర్‌లో మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో ఎక్స్‌ట్రా సీన్లతో చూసేయొచ్చు. ఇదిలా ఉంటే గుంటూరు కారం చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హిట్ 2 బ్యూటి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. పూర్ణ స్పెషల్‌ సాంగ్‌లో అట్రాక్ట్ చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు.

Whats_app_banner