Squid Game season 2 first look: నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఫస్ట్ లుక్ ఇదే-netflix most watched show squid game season 2 first look released ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Squid Game Season 2 First Look: నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఫస్ట్ లుక్ ఇదే

Squid Game season 2 first look: నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఫస్ట్ లుక్ ఇదే

Hari Prasad S HT Telugu
Feb 02, 2024 07:58 AM IST

Squid Game season 2 first look: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ రెండో సీజన్ వచ్చేస్తోంది. గురువారం (ఫిబ్రవరి 1) రాత్రి ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఫస్ట్ లుక్ లో లీ జంగ్-జే
స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఫస్ట్ లుక్ లో లీ జంగ్-జే

Squid Game season 2 first look: పాపులర్ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ రెండో సీజన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. తమ యూట్యూబ్ ఛానెల్లో ఈ ఫస్ట్ లుక్ వీడియోను స్క్విడ్ గేమ్ టీమ్ రిలీజ్ చేసింది.

నిజానికి గురువారం (ఫిబ్రవరి 1) ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లోకి రానున్న షోలు, సినిమాలతో కూడిన మూడు నిమిషాల వీడియోను ఈ యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది. అందులో చివర్లో స్క్విడ్ గేమ్ రెండో సీజన్ క్లిప్ కూడా ఉండటం విశేషం.

స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఫస్ట్ లుక్

స్క్విడ్ గేమ్ రెండో సీజన్ ఫస్ట్ లుక్ వీడియో ఇంట్రెస్టింగా ఉంది. ఈ మూడు నిమిషాల వీడియో చివర్లో ఉన్న కొన్ని సెకన్ల వీడియో అభిమానులను ఆకర్షించింది. ఈ సిరీస్ లో సియాంగ్ గి-హున్ గా నటించిన లీ జుంగ్-జే ఈ వీడియోలో కనిపించాడు. ఓ డార్క్ బ్లూ సూట్ వేసుకొని ఎయిర్ ‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న గి-హున్.. నీ అంతు చూస్తా అంటూ ఫోన్లో అవతలి వ్యక్తికి వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు.

స్క్విడ్ గేమ్ తొలి సీజన్ లో ప్రధాన పాత్ర అయిన గి-హున్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి లీ జంగ్-జే ఆ పాత్రలో తిరిగి వస్తున్నాడు. "నువ్వు తీసుకున్న నిర్ణయానికి బాధపడతావు" అని ఫోన్లో అవతలి వ్యక్తి అంటాడు. దానికి గి-హున్ స్పందిస్తూ.. నీ అంతు చూస్తా అని బెదిరిస్తాడు. అంతటితో ఈ షార్ట్ వీడియో ముగుస్తుంది.

ఈ వీడియో ద్వారా స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఈ ఏడాదే రాబోతోందని ఖాయమైంది. ఊహించినదాని కంటే ముందే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించనుంది. తొలి సీజన్ లాగే రెండో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగనున్నట్లు ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.

స్క్విడ్ గేమ్.. ఎక్కువ మంది చూసిన సిరీస్

స్క్విడ్ గేమ్.. ఓ కొరియన్ హారర్ షో. కొరియాలో కొందరు బాగా డబ్బున్న వాళ్లు అక్కడి నిరుపేదలకు అదే డబ్బును ఎరగా వేసి వాళ్లతో ఎంతో ప్రమాదకరమైన ఆటలు ఆడిస్తుంటారు. ఆ ఆటలో ఓడిపోయిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటారు. అది చూసి ఎంతో వినోదం పొందుతూ ఉంటారు. అన్ని గేమ్స్ ను ముగించి విజేతగా నిలిచిన వారికి కోట్లకొద్దీ డబ్బు వస్తుందన్న ఆశ పెట్టడంతో తమ ప్రాణాలను పణంగా పెట్టి వందల మంది ఈ గేమ్స్ లో పాల్గొనడానికి వస్తారు.

తొలి సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని మిగల్చడంతో ఇప్పటి వరకూ నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ గా స్క్విడ్ గేమ్ నిలిచింది. ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. తొలి సీజన్ ను ఆ స్థాయిలో చూశారంటేనే రెండో సీజన్ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ రెండో సీజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ వీడియోతో 2024లోనే రెండో సీజన్ రాబోతోందని తేలిపోయింది. అది ఎప్పుడు అన్నది నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 2021 సెప్టెంబర్ లో తొలి సీజన్ రాగా.. మూడేళ్ల తర్వాత రెండో సీజన్ రానుంది. హవాంగ్ డాంగ్-హ్యుక్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.

Whats_app_banner