Kurchi Thatha Arrest: గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి తాత అరెస్ట్, మహేశ్ బాబు కారణం! శృంగార నటి ఫిర్యాదు
Guntur Kaaram Kurchi Thatha Arrest: గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి పాటతో బాగా పాపలుర్ అయిన కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు శృంగార నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ గొడవ అంతా మహేశ్ బాబు వల్ల వచ్చినట్లు తెలుస్తోంది.
Kurchi Thatha Aka Kala Pasha Arrest: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హిట్ 2 బ్యూటి మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేయగా.. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపిస్తోంది. గుంటూరు కారం సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన మహేశ్ బాబు మేనియాతో కలెక్షన్స్ కొల్లగొడుతోంది.
ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు అందులో పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ధమ్ మసాలా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా ఓ మై బేబికి నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక కుర్చీ మడతపెట్టి పాట అయితే కాంట్రవర్సీకి దారి తీసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తూ ట్రెండ్ చేసిన పలుచోట్ల మాత్రం విమర్శలు తలెత్తాయి. మొత్తానికి పాట మాత్రం సూపర్ హిట్ అయింది. కుర్చీ మడతపెట్టి అనే పదం తీసుకోడానికి ప్రధానం కారం కుర్చీ తాత అలియాస్ కాలా పాషా.
ఒకానొక సమయంలో కాలా పాషా చెప్పిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ చాలా పాపులర్ అయింది. దాంతో ఆ డైలాగ్‌ను గుంటూరు కారం మూవీలో తమన్ వాడేశాడు. అంతేకాకుండా అలా వాడినందుకు కాలా పాషాను ఇంటికి పిలిపించుకుని రూ. 5 వేల వరకు ఆర్థిక సహాయం కూడా చేశాడు తమన్. అలాంటి కుర్చీ తాతను బుధవారం (జనవరి 24) పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వైజాగ్ సత్య (సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటాడు) సహాయంతో తమన్‌ను కలిశాడు కుర్చీ తాత. వైజాగ్ సత్య వల్లే తనకు అంత గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత తర్వాత రివర్స్ అయినట్లుగా తెలుస్తోంది.
వైజాగ్ సత్య తన పేరు ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని, అతను కనిపిస్తే నరికేస్తా, చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు షేర్ చేశాడు కుర్చీ తాత. దాంతో కుర్చీ తాతపై వైజాగ్ సత్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. అయితే వాళ్లిద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయనేది చెప్పుకొచ్చాడు వైజాగ్ సత్య. తమన్ దగ్గరికి తీసుకువెళ్లినట్లే మహేశ్ బాబు దగ్గరకు కూడా తీసుకుని వెళ్లాలని పట్టుబట్టాడట కుర్చీ తాత. అది సాధ్యం కాదని, కుదరదని వైజాగ్ సత్య చెప్పడంతో తనను కుర్చీ తాత టార్గెట్ చేస్తున్నాడని తెలిపాడు.
జనవరి 12న కుర్చీ తాత తనను బూతులు తిడుతూ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలా చేయడంతో కుర్చీ తాతపై పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు వైజాగ్ సత్య. అదే రోజు స్టేషన్‌కు వచ్చిన కుర్చీ తాత సదరు యూట్యూబ్ ఛానెల్ వాళ్లు తిట్టమంటే తిట్టానని చెప్పాడట. ఆ తర్వాత మళ్లీ తనను తిడుతూ వీడియోలు పెట్టడంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పుకొచ్చాడు వైజాగ్ సత్య. రెండు రోజులు వెతికిన తర్వాత చివరికి బుధవారం కుర్చీ తాతను అరెస్ట్ చేశారని వైజాగ్ సత్య తెలిపాడు.
ఇప్పుడు కూడా యూట్యూబ్ వాళ్లు మందు పోయించి తిట్టమన్నారు కాబట్టే తిడుతున్నట్లు చెప్తున్నాడని, అతని బూతులు భరించలేకే అరెస్ట్ చేయించినట్లు పేర్కొన్నాడు వైజాగ్ సత్య. అయితే వైజాగ్ సత్యతోపాటు తెలుగులో శృంగార నటిగా పాపులర్ అయిన స్వాతి నాయుడు కూడా ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కానీ, ఆమె ఫిర్యాదు ఇవ్వడానికి గల కారణాలు తెలియరాలేదు. వైజాగ్ సత్య, స్వాతి నాయుడు ఇద్దరిని కలిపి కుర్చీ తాత తిట్టినట్లుగా సమాచారం. ఇక ఇదంతా చూస్తుంటే మహేశ్ బాబను కలిసేలా చేయనందుకే తిట్లు, ఫిర్యాదులు అయినట్లు తెలుస్తోంది.