Extra Ordinary Man OTT: ఓటీటీలోకి నితిన్, శ్రీలీల మూవీ - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Extra Ordinary Man OTT: నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ కమర్షియల్ కామెడీ మూవీ డిజిటల్‌రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
Extra Ordinary Man OTT: నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సంక్రాంతికి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు అచ్చొచ్చిన కామెడీ కమర్షియల్ జోనర్‌లో నితిన్ చేసిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి వీక్ నుంచే నితిన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు.ఇందులో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో నటించాడు. కామెడీ వర్కవుట్ అయినా కథలో బలం లేకపోవడంతో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫెయిల్యూర్‌ను మూటగట్టుకుంది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించాడు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు హరీస్ జైరాజ్ సంగీతాన్ని అందించాడు. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కథ ఇదే...
అభి (నితిన్) ఓ జూనియర్ ఆర్టిస్ట్. హీరోగా మారాలని కలలుకంటాడు. కానీ కుటుంబబాధ్యతల కారణంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో హీరోగా అవకాశం రావడంతో జాబ్ వదిలేస్తాడు.
ప్రేమించిన అమ్మాయికి దూరమవుతాడు. చివరి నిమిషంలో హీరో ఛాన్స్ కూడా చేజారిపోతుంది. కానీ ఆ సినిమా కథలో ఉన్నట్లుగా అభి...ఎస్ఐ సాయినాథ్(నితిన్)గా మారి రియల్ విలన్‌తో ఫైట్‌కు సిద్ధమవుతాడు. కథలో రాసిన సంఘటనలు అభి జీవితంలో ఎలా జరిగాయి?
అతడు దొంగ ఎస్ఐ అనే సంగతి బయటపడిందా? లేదా? అన్నదే ఈసినిమా కథ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన రెండో మూవీ ఇది. ఈ సినిమా కూడా డైరెక్టర్‌గా అతడికి నిరాశనే మిగిల్చింది