చర్మం ఆరోగ్యానికి మేలు చేసే 5 రకాల పండ్లు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 22, 2024

Hindustan Times
Telugu

మన చర్మం ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే శరీరంలో కొలెజెన్ ప్రొటీన్ చాలా ముఖ్యం. కొన్ని రకాల పండ్లు తినడం వల్ల ఆ ప్రొటీన్ ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. కొలెజెన్ పెరిగేందుకు సహకరించే 5 ముఖ్యమైన పండ్లు ఇవే.. 

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు లాంటి బెర్రీస్‍లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చర్మం తేమగా ఉండేందుకు, కొలెజెన్ ఉత్పత్తి పెరిగేందుకు ఇవి సహకరిస్తాయి. 

Photo: Pexels

ద్రాక్ష పండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే కొలెజన్ ప్రొటీన్ ఉత్పత్తిని విటమిన్ సీ మెరుగుపరుస్తుంది. 

Photo: Pexels

బొప్పాయి పండులో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చర్మపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Photo: Pexels

నారింజ పండ్లలోనూ విటమిన్ సీతో పాటు చాలా పోషకాలు ఉంటాయి. ఇది తిన్నా కొలెజన్ ప్రొడక్షన్ పెరిగి, చర్మానికి మంచి జరుగుతుంది. 

Photo: Pexels

జామపండ్లలోనూ విటమిన్ సీ, జింక్ ఎక్కువగా ఉంటాయి. కొలెజన్ ఉత్పత్తికి, చర్మపు ఆరోగ్యానికి ఇవి ఉపయోగపడతాయి. 

Photo: Pexels

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay