Bad Beauty Product: అమ్మాయిలూ ఈ బ్యూటీ ఉత్పత్తులు వాడారంటే చర్మ సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్టే
Bad Beauty Product: అందాన్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అధికంగా కాస్మోటిక్స్ వాడుతూ ఉంటారు. వాటిలో వాడకూడని కొన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి వాడడం వల్ల భవిష్యత్తులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ప్రతి స్త్రీ అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అందంగా కనిపించేందుకు అనేక రకాల బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మీకు కొన్ని గంటల వరకు మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. కానీ కొన్ని రకాల బ్యూటీ ఉత్పత్తులు తరచూ వాడడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య, చర్మ సమస్యలకు కారణం అవుతుంది. ఎలా కాస్మోటిక్స్ వాడడం వల్ల సమస్యలు వస్తాయో తెలుసుకోండి.
స్కిన్ వైటనింగ్ క్రీములు
మన దేశంలో తెల్లదనంపై ఇష్టత ఎక్కువ. తెల్లగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. నలుపుగా ఉన్నవారికి తెల్లగా అయ్యేందుకు చిట్కాలు చెబుతూ ఉంటారు. తెల్లదనంపై ఉన్న ఇష్టాన్ని గమనించిన కాస్మోటిక్ కంపెనీలు స్కిన్ వైటనింగ్ క్రీములను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ క్రీములు ప్రమాదకరమైన బ్లీచింగ్ ఏజెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రాసుకున్న వెంటనే మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. వీటిని దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల మీ ముఖం అధ్వాన్నంగా మారుతుంది. ఆ క్రీములు మీ మూత్రపిండాలు, మెదడును కూడా ప్రభావితం చేస్తాయి.
ఈ కాలంలో మహిళల ప్రైవేట్ పార్ట్‌ను వాష్ చేసేందుకు ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలవుతాయి. మహిళలు తమ ఇంటిమేట్ ప్రాంతాన్ని దుర్వాసన వేయకుండా, శుభ్రంగా, తాజాగా ఉంచడానికి ఇంటిమేట్ వాష్ ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి అలాంటి ఉత్పత్తులు అవసరం లేదు, యోని తనను స్వయంగా శుభ్రపరిచుకునే అవయవం. కాబట్టి మీరు ఇంటిమేట్ వాష్ క్రీములు, సబ్బులు ఉపయోగించినప్పుడు, అవి యోని పిహెచ్ స్థాయికి భంగం కలిగిస్తుంది. ఇది ప్రైవేటు ప్రాంతంలో దురద, చికాకును పెంచుతుంది.
హెయిర్ కలర్
మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా తరచూ హెయిర్ కలర్ మార్చుకునే వారి సంఖ్య ఎక్కువ. అంటే హెయిర్ డైని ఎక్కువగా ఉపయోగిస్తుంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి, హెయిర్ డై చాలా ప్రమాదకరమైన రసాయనం నుండి తయారవుతుంది. అవి మీ జుట్టు మరింత రాలడానికి కారణం కావడమే కాకుండా మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలను కూడా కలిగిస్తాయి. మీ జుట్టుకు రంగు వేయడానికి గోరింటాకు, ఉసిరి వంటి సహజ పదార్ధాలను ఉపయోగించండి.
డ్రై షాంపూ
డ్రై షాంపూ కూడా మహిళలు అధికంగా వినియోగిస్తున్నారు. జుట్టుకు పట్టిన జిడ్డును పరిష్కరించడానికి డ్రై షాంపూ సులభమైన మార్గం. అయితే, డ్రై షాంపూను ఎక్కువగా ఉపయోగించడం మీ జుట్టుకు చాలా ప్రమాదకరం. వాస్తవానికి, ఎక్కువ డ్రై షాంపూను ఉపయోగించడం వల్ల నెత్తి మీద ఉండే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది నెత్తి మీద రక్త ప్రసరణను ఆపివేస్తుంది. జుట్టు వేగంగా రాలడం ప్రారంభిస్తుంది.
హెయిర్ రిమూవల్ క్రీమ్
శరీరంపై ఉన్న అవాంఛిత జుట్టును తొలగించడానికి సులభమైన మార్గం హెయిర్ రిమూవల్ క్రీమ్ ఉపయోగిస్తారు. మార్కెట్లో లభించే చాలా హెయిర్ రిమూవల్ క్రీములు చాలా ప్రమాదకరమైన రసాయనాలతో తయారవుతాయి. ఇవి మీ శరీరానికి మంచిది కాదు. చర్మం నల్లబడటం, చికాకు, దురద వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఇందులో ఉండే రసాయనాలు చర్మం ద్వారా లోపలికి వెళ్ళడం ద్వారా మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మంచి బ్రాండ్ ను ఎంచుకోవడం మంచిది, లేకపోతే వ్యాక్సింగ్, షేవింగ్ వంటి ఎంపికలు చాలా మంచివి.
టాపిక్