Homemade Shampoo: చలికాలంలో జుట్టు చిట్లిపోతోందా? ఇలా ఇంట్లోనే షాంపూ తయారుచేసి వాడండి-hair split ends in winter make this shampoo at home and use it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Homemade Shampoo: చలికాలంలో జుట్టు చిట్లిపోతోందా? ఇలా ఇంట్లోనే షాంపూ తయారుచేసి వాడండి

Homemade Shampoo: చలికాలంలో జుట్టు చిట్లిపోతోందా? ఇలా ఇంట్లోనే షాంపూ తయారుచేసి వాడండి

Haritha Chappa HT Telugu
Nov 12, 2024 07:00 PM IST

Homemade Shampoo: చలికాలంలో వెంట్రుకలు చిట్లిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయా? మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తులు వాడడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లోనే షాంప్యూ తయారు చేసి వాడితే ఎంతో మంచిది.

హోమ్ మేడ్ షాంప్యూ తయారీ
హోమ్ మేడ్ షాంప్యూ తయారీ

మృదువైన, పొడవాటి, మెరిసే జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ మార్కెట్లో దొరికే రసాయనాలు నిండిన షాంపూలు వాడడం వల్ల జుట్టు ఊడిపోయే సమస్య పెరిగిపోతుంది. ఇలాంటి జుట్టు సంరక్షణ ఉత్పత్తుల వాడకం పెరగడం వల్ల జుట్టు వేగంగా క్షీణిస్తోంది. ఇలాంటి ఉత్పత్తులు వాడకపోయినా వాతావరణంలోని కాలుష్యం, దుమ్ము, మట్టి, తీవ్ర ఎండల వల్ల కూడా జుట్టు పాడైపోతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి హోం మేడ్ షాంపూను ఉపయోగించవచ్చు. ఈ షాంపూ తయారీలో అన్ని నేచురల్ పదార్థాలను ఉపయోగిస్తారు. ఇంట్లో షాంపూ ఎలా తయారుచేయాలో ఇక్కడ ఇచ్చాము. ఇలా చేసుకుని షాంపూను వాడడం వల్ల మీకు జుట్టు ఊడడం, జుట్టు చివరలు చిట్లిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా చలికాలంలో జుట్టు చిట్లిపోయే సమస్య ఎక్కువైపోతుంది.

షాంపూ తయారీ 

హోమ్ మేడ్ షాంపూ తయారు చేయడానికి ఇంట్లో ఉండే బియ్యం, మెంతులు, కలబంద, అవిసె గింజలు, కుంకుడు కాయలు, గోండ్ కటిరాను సిద్ధం చేసుకోవాలి. గోండ్ కటిరాను బాదం బంక అని కూడా అంటారు. ఇవి ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి. 

పైన చెప్పిన ఉత్పత్తులన్నీ షాంపూ తయారీకి రెండు మూడు సార్లు నీటిలో బాగా కడగాలి. తర్వాత వీటిని 7 నుంచి 8 గంటలు నానబెట్టాలి. తర్వాత వీటన్నింటినీ నీటిలో 10-15 నిమిషాలు మరిగించాలి. ఉడికిన తరువాత, కుంకుడు విత్తనాలను తీసి పారేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చిక్కటి పేస్టులా ఇది వస్తుంది. ఈ పేస్ట్ ను ఒక కంటైనర్ లో నింపి నీళ్లు వేసి వాటితో జుట్టును కడగడానికి ఉపయోగించండి. ఈ షాంపూను వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.

షాంపూ వల్ల ఉపయోగాలు

బియ్యం -  బియ్యం లేదా బియ్యం నీరు జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు చిట్లిపోవడం, రాలడాన్ని నివారిస్తుంది. అందుకే ఈ షాంపూలో మనం బియ్యాన్ని వినియోగించాము.  

మెంతి గింజలు - మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం ఉంటాయి. ఇది జుట్టుకు లోపలి నుండి పోషణను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్ ను అనుమతించవు.

అవిసె గింజలు - అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును స్ట్రాంగ్ గా, హెల్తీగా మారుస్తాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

కుంకుడు కాయలు - కుంకుడు కాయలు జుట్టుకు ఎంతో మేలు చేస్తారు. ఇది జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. దీని వాడకం వల్ల జుట్టు పెరుగుదల కూడా పెరుగుతుంది.

గమ్ కటిరా: గమ్ కటిరా లేదా గోంఢ్ కటిరా హెయిర్ ఫోలికల్స్ ను బలోపేతం చేస్తుంది. అదే సమయంలో, ఇది ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. హెయిర్ కండిషనింగ్ కు ఇది బాగా పనిచేస్తుంది.

కలబంద: కలబంద జుట్టు పెరుగుదలను పెంచి ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు తక్షణ తేమను అందిస్తుంది.

Whats_app_banner