Flax Seeds Laddu: అవిసె గింజలతో చేసే ఈ లడ్డూ ప్రతిరోజూ తింటే ఆయుష్షు పెరగడం ఖాయం
Flax Seeds Laddu: అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఎంతోమందికి వాటిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో తెలియడం లేదు. అవిసె గింజలతో ఇలా లడ్డు చేసుకొని రోజుకో లడ్డును తినండి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
Flax Seeds Laddu: అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా నిల్వ చేసుకుంటాయి. అందుకే వీటిని కచ్చితంగా తినమని వైద్యులు సూచిస్తారు. అవిసె గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎముకలను దృఢపరచడంతో పాటు, గుండెకు రక్షణ కల్పిస్తుంది. జుట్టు కూడా ఎదిగేలా చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. అందుకే అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోమని చెబుతారు. అయితే ఎంతో మందికి అవిసె గింజలతో ఏం చేసుకోవాలో తెలియక వాటిని తినకుండా ఉండిపోతున్నారు. అలాంటి వారి కోసమే ఈ రెసిపీ అవిసె గింజలతో టేస్టీగా లడ్డూ చేసుకుని చూడండి. ఇవి పిల్లలకు పెద్దలకు ఎంతో మేలు చేస్తుంది. అవిసె గింజల లడ్డూ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
అవిసె గింజల లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు
అవిసె గింజలు - ఒక కప్పు
వేరుశెనగ పలుకులు - అరకప్పు
యాలకులు పొడి - అర స్పూను
బెల్లం తురుము - ఒక కప్పు
డ్రై ఫ్రూట్స్ - గుప్పెడు
నెయ్యి - మూడు స్పూన్లు
నువ్వులు - ఒక స్పూను
కొబ్బరిపొడి - అరకప్పు
గోధుమపిండి - అరకప్పు
అవిసె గింజల లడ్డూ రెసిపీ
1. స్టవ్ పై కళాయి పెట్టి అవిసె గింజలను ముందుగా వేయించుకోవాలి. మంట మద్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
2. అదే కళాయిలో వేరుశెనగ పలుకులను వేసి వేయించుకోవాలి. వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత కొబ్బరి పొడిని వేసి వేయించాలి. అందులోనే నువ్వులను కూడా వేసి వేయించాలి. వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
4. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి గోధుమ పిండిని వేయించుకోవాలి. వేయించిన గోధుమపిండిని కూడా తీసి ఒక పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మిక్సీ జార్ లో అవిసె గింజలతో పాటు వేయించిన పల్లీలు, కొబ్బరి పొడి, గోధుమపిండి వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి.
6. తర్వాత బెల్లం తురుమును వేసి మిక్సీ పట్టాలి.
7. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ అందులో కలుపుకోవాలి.
8. అలాగే వేయించిన నువ్వులను కూడా వేసి కలుపుకోవాలి.
9. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి.
10. కావాలనుకుంటే ఈ మిశ్రమంలో మరికొస్తే నెయ్యిని కలుపుకోవచ్చు. అంతే అవిసె గింజల లడ్డు తయారైపోతుంది. ఇవి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అవిసె గింజలతో చేసిన ఆహారం తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది. కొలెస్ట్రాల్ చేరకపోతే గుండె సమస్యలు రావు. క్యాన్సర్ వంటి వ్యాధులను అడ్డుకునే శక్తి అవిసె గింజలకు ఉంది. అలాగే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు అవిసె గింజలతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజు తినాలి. అవిసె గింజలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గేందుకు ఇవి సహకరిస్తాయి.
ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక లడ్డు తింటే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు తగ్గే ప్రయాణంలో అవిసె గింజలను మీ మెనూలో చేర్చుకోండి. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా కాపాడుతుంది. అవిసె గింజలతో చేసిన లడ్డును పిల్లలకు ప్రతి సాయంత్రం తినిపిస్తే వారి ఆరోగ్యం మెరుగవుతుంది. వారి మెదడుకు శక్తి అందిస్తుంది.
టాపిక్