Gongura Nuvvula Chutney: స్పైసీగా గోంగూర నువ్వుల పచ్చడి ఇలా చేయండి, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది-gongura nuvvula chutney in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Nuvvula Chutney: స్పైసీగా గోంగూర నువ్వుల పచ్చడి ఇలా చేయండి, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది

Gongura Nuvvula Chutney: స్పైసీగా గోంగూర నువ్వుల పచ్చడి ఇలా చేయండి, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది

Haritha Chappa HT Telugu
Jan 09, 2024 05:30 PM IST

Gongura Nuvvula Chutney: స్పైసీ పచ్చళ్ళు అంటే మీకు ఇష్టమా? అయితే ఈ గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ మీ కోసమే.

గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ
గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ (Vismai food/Youtube)

Gongura Nuvvula Chutney: ఒక్కసారి చేసుకుంటే రెండు నుంచి మూడు వారాల పాటు నిల్వ ఉంటుంది గోంగూర నువ్వుల పచ్చడి. ఇది వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది. గోంగూరలోని పుల్లని రుచికి, నువ్వుల రుచి తోడై టేస్టీగా అనిపిస్తుంది. ఈ స్పైసీగా గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

గోంగూర - నాలుగు కట్టలు

నువ్వులు - అరకప్పు

పచ్చి మిరపకాయలు - 15

వెల్లుల్లి - పది రెబ్బలు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - మూడు స్పూన్లు

మినప్పప్పు- ఒక స్పూను

శెనగ పప్పు - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

కరివేపాకు - గుప్పెడు

పసుపు పొడి - అర స్పూను

ఎండుమిర్చి - రెండు

గోంగూర నువ్వుల పచ్చడి రెసిపీ

1. గోంగూర ఆకులను ఏరి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను నూనె వేయాలి.

4. ఆ నూనెలో నిలువుగా కోసిన పచ్చిమిర్చిని వేయించాలి. అందులోనే శనగపప్పు, వెల్లుల్లిపాయలను వేసి వేయించాలి.

5. ఆ మిశ్రమంలోనే ముందుగా ఏరుకున్న గోంగూర ఆకులను కూడా వేసి మెత్తగా ఉడికేలా చేయాలి.

6. ఆ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో ఈ గోంగూర మిశ్రమాన్ని వేయాలి.

7. ముందుగా వేయించిన నువ్వులను కూడా మిక్సీలో వేసుకోవాలి.

8. ఆ మిక్సీలోని కరివేపాకులు, ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

9. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

10. దీనికి తాళింపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

11. అందులో మినప్పప్పు, శెనగపప్పు, ఆవాలు ,జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా కలపాలి.

12. ఆ మిశ్రమాన్ని చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే రుచికరమైన గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయినట్టే.

13. దీన్ని గాలి చొరబడని ఒక సీసాలో వేస్తే రెండు మూడు వారాల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ ని తింటే ఆ రుచే వేరు.

Whats_app_banner