Guru Transit: మిధున రాశిలోకి గురు సంచారం- కొత్త ఏడాది ఈ రాశుల వారికి బాగా కలిసొచ్చేలా ఉంది
Guru Transit: 2024 లో దేవగురువు బృహస్పతి తన రాశి చక్రాన్ని మార్చుకోనున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకూ వృషభ రాశిలో ఉండే గురు గ్రహం 2025లో మిథున రాశిలోకి మారతాడు. ఇది మూడు రాశుల వారికి చాలా బాగా కలిసి వస్తుంది.
దేవగురువు బృహస్పతి(గురు గ్రహం)కి జ్యోతిష్య శాస్త్రంలో ప్రాముఖ్యత ఎక్కువ. దానధర్మాలకు, సంపద, శ్రేయస్సు, విద్య, మేథస్సు వంటి వాటికి ప్రతీకగా బృహస్పతికి భావిస్తారు. ఈ గ్రహ సంచారంలో మార్పులు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయి. 2024వ సంవత్సరంలో వృషభ రాశిలో సంచరించిన బృహస్పతి ఈ సంవత్సరం చివరి వరకూ అదే రాశిలో ఉంటాడు. నూతన సంవత్సరం అయిన 2025లో రాశిచక్రాన్ని మార్చుకుంటాడు. వృషభం నుండి మిథున రాశికి ప్రయాణాన్ని ముగిస్తాడు. మిథున రాశిలోకి గురుడు చేరుకోవడం వల్ల కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఏడాది వీరికి బాగానే కలిసొస్తుంది.
ద్రుక్ పంచాంగం ప్రకారం, బుధుడు పరిపాలించే బృహస్పతి(గురు గ్రహం) మే 14, 2025న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం మేధస్సు, విద్య, పని, సంపద, వివాహం, దానధర్మాలు అంశాల్లో కొన్ని రాశులకు ప్రయోజనకరంగా మారనుంది. 2025లో బుధుడి రాశిచక్రంలో బృహస్పతి సంచారం 3 రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది
మిథున రాశి:
మిథున రాశిలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా భావిస్తారు. పనిప్రాంతంలో మీ స్నేహితులు, ఉన్నతాధికారుల నుండి మీకు చాలా మద్దతు లభిస్తుంది. అంతా మిమ్మల్ని పొగుడుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు. వ్యాపారాల్లో కొత్త ఎంపికలు, పెట్టుబడుల విషయాల్లో శుభపరిణామాలే కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలని కోరుకునే వారికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సరదా సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా కూడా స్థిరంగా ఉంటారు.
వృషభ రాశి:
కొత్త ఏడాది బృహస్పతి సంచారంలో మార్పు వృషభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. అయితే వాటిని మీ భాగస్వామి మద్దతుతో సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు ఎంత నిర్భయంగా ఉంటే అంత సంతోషంగా విజయం మీ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అప్పుల బాధలు తీరతాయి. ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి చింత లేదు.
మీన రాశి:
మీన రాశి వారికి గురుగ్రహ మిథున సంచారం శుభప్రదంగా భావిస్తారు. బృహస్పతి ప్రభావం మీకు శుభప్రదంగానే ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు కొనసాగుతాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇది సమయం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీరు ఆనందం, సంపద వంటి ప్రయోజనాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగంలో మంచి వార్తలు వింటారు. అప్పుల బాధలు తగ్గుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్