Smiling Depression: మీ బాధను ఫేక్ నవ్వు వెనుక దాచుకుంటున్నారా? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్టే లెక్క
Smiling Depression: ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి విచారంగా, నిరాశగా ఉండటానికి బదులు డిప్రెషన్ లో కూడా ప్రతి క్షణం నవ్వుతూనే ఉంటాడు. సైకాలజీ ఈ పరిస్థితిని స్మైలింగ్ డిప్రెషన్ అని పిలుస్తుంది. ఇందులో ఎక్కువ సేపు ఉండటం ఆరోగ్యానికి హానికరం.
Smiling Depression: కొంతమంది మనసులో బాధ నిండి ఉంటుంది. కానీ ఆ బాధను బయటికి కనిపించనివ్వరు. పైగా ఒక నవ్వుతో ఆ బాధను కప్పి పెట్టేస్తారు. అలాంటి వారు ఆనందంగా ఉన్నారో, బాధలో ఉన్నారో కూడా కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. మనస్తత్వశాస్త్రం ఈ పరిస్థితిని స్మైలింగ్ డిప్రెషన్ అని పిలుస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి విచారంగా, నిరాశగా ఉండటానికి బదులు డిప్రెషన్ లో కూడా నవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి స్థితిలో ఎక్కువ సేపు ఉండటం ఆరోగ్యానికి హానికరం. ఈ 'స్మైలింగ్ డిప్రెషన్' అంటే ఏమిటి? దాని లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.
స్మైలింగ్ డిప్రెషన్ అనేది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్య. ఈ సమస్యతో సతమతమయ్యే వ్యక్తి తన డిప్రెషన్ లక్షణాలను ఫేక్ నవ్వుతో దాచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ రకమైన పరిస్థితిని నడక, అధికంగా పని చేస్తారు. అలాంటి వారు ఎప్పుడూ బిగ్గరగా నవ్వరు, బదులుగా వారి ముఖంలో ఎల్లప్పుడూ నకిలీ చిరునవ్వు ఉంటుంది.
ఈ డిప్రెషన్ ప్రమాదకరమా?
స్మైలింగ్ డిప్రెషన్ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్ర రూపం దాలుస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యక్తి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్మైలింగ్ డిప్రెషన్ తో బాధపడేవారు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా బాధను దాచుకుని నవ్వడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే మానసిక వైద్యులను కలవడం అత్యవసరం.
స్మైలింగ్ డిప్రెషన్ లక్షణాలు
స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడేవారి ముఖంలో ఎప్పుడూ ఫేక్ స్మైల్ ఉంటుంది. అటువంటి వ్యక్తులు తరచుగా జీవితంలో విచారంలో, నిరాశలో కనిపిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడే వారు నిరాశగా కనిపిస్తారు. ఎవరైనా పక్కన ఉంటే మాత్రం ఎప్పుడూ నవ్వడానికి ప్రయత్నిస్తారు.
స్మైలింగ్ డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తి తన ఏ పనిపైనా దృష్టి పెట్టలేడు. తన కోసం ఏ నిర్ణయాన్ని తీసుకోలేడు. తీవ్రంగా అలసిపోవడం, నిద్ర సరిగా పట్టక పోవడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తాయి. ఆ వ్యక్తికి ఆకలి తగ్గిపోతుంది. బరువు కూడా హఠాత్తుగా తగ్గడం లేదా పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన వారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది.
స్మైలింగ్ డిప్రెషన్ ను ఎలా నివారించాలి
ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. స్మైలింగ్ డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
1. స్మైలింగ్ డిప్రెషన్ నివారించడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ ట్రీట్ మెంట్ (సిబిటి) ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చికిత్స వల్ల ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తన తగ్గుతుంది.
2. డిప్రెషన్ సమయంలో మానసిక వైద్యులు ఒత్తిడిని తగ్గించే మందులు ఇవ్వవచ్చు.
3. డిప్రెషన్ నివారించడానికి, ఒక వ్యక్తి రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర తీసుకోవాలి.
4. స్మైలింగ్ డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తి తన సమస్యలను దాచుకోకుండా మంచి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. అది వారికి గుండె భారాన్ని తగ్గిస్తుంది.
టాపిక్