Smiling Depression : స్మైలింగ్ డిప్రెషన్ అంటే ఏంటి? ఎలా వస్తుంది?
Smiling Depression : కొంతమంది పైకి నవ్వుతూ కనిపిస్తారు. కానీ లోపల ఉండే బాధ బయటకు కనిపించనివ్వరు. మనసులో ఎంత నొప్పి ఉన్నా.. తెలియనివ్వరు. అయితే ఇది స్మైలింగ్ డిప్రెషన్ కు కారణమా?
పైకి నవ్వుతున్న వాళ్లు సంతోషంగా ఉన్నారని చెప్పలేం. లోపల ఎవరికి ఏం బాధ ఉందో చెప్పడం కష్టం. పైకి నవ్వుతూ కనిపిస్తారు. సమాజం దృష్టిలో వారు హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. కానీ వాళ్లు స్మైలింగ్ డిప్రెషన్(Smiling Depression)లో ఉండొచ్చు.. చెప్పలేం. మనస్సులో కొండంత బాధ ఉందేమో. స్మెలింగ్ డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత. చాలా మంది ఒత్తిడిని ఒకే విధంగా అనుభవించరు. నిజానికి, కొంతమందికి వారికి తాము బాధపడుతున్నాం అనే విషయం కూడా తెలియదు. ఎప్పుడూ నవ్వుతూ.. అందరితో ఆనందంగా మాట్లాడుతుంటారు. కానీ లోపల నిరాశతో బాధపడుతుంటారు. ఇదే స్మైలింగ్ డిప్రెషన్ అని పిలుస్తారు.
మనం ఎక్కువగా ఇతరులతో మాట్లాడినా.. నిరాశ అనేది ఉంటుంది. విచారం, బద్ధకం, నిరాశను లోపలే దాచి పెట్టుకుంటారు. స్మైలింగ్ డిప్రెషన్ అనేది ఒక రకమైన డిప్రెషన్. దీనిలో ఒక వ్యక్తి బయటికి సంతోషంగా కనిపిస్తాడు. కానీ నిజానికి లోపల నొప్పిని అనుభవిస్తాడు. ఎవరైనా తమ డిప్రెషన్‌ని చిరునవ్వు వెనుక దాచుకుంటే, దాన్ని స్మైలింగ్ డిప్రెషన్ అంటారు.
నిపుణుల ప్రకారం, చిరునవ్వుతో కూడిన డిప్రెషన్ ప్రమాదకరమైనది కావచ్చు. ఇది తరచుగా గుర్తించబడదు. ఇది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. స్మైలింగ్ డిప్రెషన్(Smiling Depression)తో బాధపడుతున్న వ్యక్తులు ఆత్మహత్య(Suicide) ఆలోచనలు కూడా చేస్తారు. ఆత్మహత్య ప్రణాళికను రూపొందించడానికి, దానిని అనుసరించడానికి వారికి ఎక్కువ శక్తి, దృష్టి ఉండవచ్చు.
మీ కుటుంబ సభ్యులకు నవ్వుతున్న డిప్రెషన్ సంకేతాలను గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. కానీ దీర్ఘకాలిక విచారం అనేది లక్షణంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ డిప్రెషన్(Depression)ను విభిన్నంగా అనుభవిస్తారు. వివిధ లక్షణాలు ఉన్నాయి. నీరసం లేదా అలసట, నిద్రలేమి, బరువు మరియు ఆకలిలో మార్పు, నిస్సహాయత, ఆసక్తి లేకపోవడం లాంటివి ఉంటాయి.
అలాంటి డిప్రెషన్ మీకు ఎప్పుడు వస్తుందో గుర్తించాలి. కానీ ఎక్కువైతే.. జీవిత మార్పులను కలిగి ఉంటారు. విఫలమైన సంబంధం లేదా వివాహం, ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక సంక్షోభం లాంటివి దీనికి కారణం కావొచ్చు. ఈ రోజుల్లో, స్మైలింగ్ డిప్రెషన్ సోషల్ మీడియా(Social Media)కు బానిసలైన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. అధిక అంచనాలు కూడా దీనిని ప్రేరేపించగలవు. సహోద్యోగులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు లేదా స్నేహితుల నుండి మీ మీద పెట్టుకున్న అంచనాలు చేరుకోలేనప్పుడు కూడా ఇది రావొచ్చు. మానసిక చికిత్స తీసుకోవడమే దీనికి సరైన విధానం. ఏదీ అతిగా ఆలోచించకపోవడమే మంచిది.