Marco Malayalam Movie: ‘యానిమల్‍, కిల్ కంటే భీకర వైలెన్స్’: నయా మలయాళ మూవీకి పాజిటివ్ టాక్.. జోరుగా కలెక్షన్లు-violent than animal and kill malayalam movie marco getting positive response and good box office collections ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Marco Malayalam Movie: ‘యానిమల్‍, కిల్ కంటే భీకర వైలెన్స్’: నయా మలయాళ మూవీకి పాజిటివ్ టాక్.. జోరుగా కలెక్షన్లు

Marco Malayalam Movie: ‘యానిమల్‍, కిల్ కంటే భీకర వైలెన్స్’: నయా మలయాళ మూవీకి పాజిటివ్ టాక్.. జోరుగా కలెక్షన్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 23, 2024 04:41 PM IST

Marco Malayalam Movie: మార్కో సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. మోస్ట్ వైలెంట్ మూవీ అంటూ నెటిజన్లు అంటున్నారు. ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా జోరుగా వస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Malayalam Movie: ‘యానిమల్‍, కిల్ కంటే భీకర వైలెన్స్’: నయా మలయాళ మూవీకి పాజిటివ్ టాక్.. జోరుగా కలెక్షన్లు
Malayalam Movie: ‘యానిమల్‍, కిల్ కంటే భీకర వైలెన్స్’: నయా మలయాళ మూవీకి పాజిటివ్ టాక్.. జోరుగా కలెక్షన్లు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంలో వైలెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ మోస్ట్ ఇండియన్ వైలెంట్ మూవీ అంటూ పేరు తెచ్చుకుంది. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ ఏడాది వచ్చిన బాలీవుడ్ మూవీ ‘కిల్’ కూడా వైలెన్స్ తీవ్రంగా ఉంది. దీంతో యానిమల్ కంటే ఇదే వైలెంట్ మూవీ అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కిల్ చిత్రంలో లక్ష్య హీరోగా చేయగా.. నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడు మలయాళంలో ఓ మూవీ సెన్సేషనల్‍గా మారింది. యానిమల్, కిల్‍ను మించిన వైలెంట్ మూవీ అని నెటిజన్లు అంటున్నారు. ఆ వివరాలివే..

yearly horoscope entry point

సినిమా ఇదే

మలయాళం మూవీ మార్కో గత వారం డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్ర పోషించగా.. హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించారు. సిద్ధిఖీ, జగదీశ్, కబీర్ దుహన్ సింగ్, అభిమన్యు షమ్మి, అన్సన్ పౌల్ కీలకపాత్రల్లో నటించారు.

హింసాత్మకంగా, క్రూరంగా..

మార్కో సినిమాలో హింసాత్మకమైన, క్రూరమైన సీన్లు ఎక్కువగా ఉన్నాయని ఈ చిత్రం చూసిన నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మనుషులను, జంతువులను చంపే సీన్లు కొన్ని క్రూరంగా అనిపిస్తాయని అంటున్నారు. మహిళలు, పిల్లలను చంపే సీన్లు కూడా భయానకంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. వైలెన్స్‌ విషయంలో యానిమల్, కిల్ చిత్రాన్ని మార్కో దాటేసిందని అభిప్రాయపడుతున్నారు.

వైలెంట్ సినిమాలు ఇష్టపడే వారికి మార్కో విపరీతంగా నచ్చుతుందని నెటిజన్లు అంటున్నారు. ఇదే ఇండియా మోస్ట్ వైలెంట్ చిత్రం అంటూ రాసుకొస్తున్నారు. మనసు సున్నితంగా ఉన్న వారు, హింస ఇష్టం లేని వారు ఈ చిత్రాన్ని చూడలేరని అంటున్నారు.

హింసపరంగా ఎక్కువగా ఉన్నా కథ, కథనాల విషయంలో యానిమల్ కంటే మార్కో కాస్త తక్కువేనని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీలో హనీఫ్ అదేనీ టేకింగ్, ఉన్ని ముకుందన్ యాక్టింగ్ అదిరిపోయినా.. మరీ యానిమల్ రేంజ్‍లో కథనం లేదని అభిప్రాయపడుతున్నారు. కానీ మూవీ ఎక్కువ శాతం ఎంగేజింగ్‍గానే ఉందని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఇంటెన్సిటీతో ఉందని చెబుతున్నారు. ఈ చిత్రానికి రివ్యూలు మిశ్రమంగానే వచ్చాయి. సోదరుడి హత్యపై ప్రతీకారం తీర్చుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

మార్కో కలెక్షన్లు

మార్కో సినిమాకు మూడు రోజుల్లో సుమారు రూ.35కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మౌత్ టాక్‍తో ఈ సినిమాకు కలెక్షన్లు జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నారు. సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది.

మార్కో చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చిన ఈ చిత్రానికి చంద్ర సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీలోనూ విడుదలైంది. ఇతర భాషల్లోనూ డబ్ చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మూవీ తెలుగులోనూ వస్తుందేమో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం