వ్యక్తిగత పరిశుభ్రతకు స్నానం ఎంతో అవసరం. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వేడి నీటి స్నానాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే శీతాకాలంలో చన్నీటితో స్నానం చేస్తే కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Dec 23, 2024
Hindustan Times Telugu
చల్లటి నీటితో స్నానం కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరం నుంచి వ్యర్థాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
pexels
చల్లని నీటితో స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్ కోసం అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరుగుతోంది. చల్లని షవర్ వల్ల రక్తనాళాలు బలంగా తయారవుతాయని, రక్తపోటు తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మీరు మరింత ఫిట్‌గా ఉండగలరు.
pexels
చలికాలంలో వేడి నీటి స్నానం చర్మాన్ని పొడిబారుస్తుంది. చర్మం దురద, దద్దుర్లకు దారితీస్తుంది. చుండ్రు సమస్యలు ఎక్కువ అవుతాయి. చల్లటి షవర్ క్యూటికల్స్, చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి చర్మం సహాజ నూనెలు కోల్పోకుండా చేస్తుంది. స్కాల్ప్‌లోని రంధ్రాలను కూడా మూసివేస్తుంది.
pexels
చల్లని నీరు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే తెల్ల రక్త కణాల శాతం ఎక్కువగా ఉంటుంది. జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. చన్నీటి స్నానం చేసే సమయంలో తెల్ల రక్త కణాలను విడుదల చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేస్తుంది.
pexels
కండరాల రికవరీకి సహాయపడుతుంది. కండరాల నొప్పిని అధిగమించడానికి చన్నీటి స్నానం సహాయపడుతుంది.
pexels
డిప్రెషన్‌ను ఎదుర్కోవడంలో చన్నీటి స్నానం సహాయపడుతుంది. చల్లటి నీరు సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చల్లని నీటితో స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత మీరు చాలా రిలాక్స్‌గా ఉంటారు.
pexels
మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయడం మంచి ఆలోచన కాదు. చల్లటి నీరు జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతులో చికాకు, జ్వరం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చన్నీటి స్నానం చేసే ముందు మీ ఆరోగ్య పరిస్థితి అంచనా వేసి, వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.