Discounts on Nissan cars : మాగ్నైట్, కిక్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్న నిస్సాన్..
10 February 2023, 11:34 IST
- Discounts on Nissan cars : మాగ్నైట్, కిక్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మాగ్నైట్, కిక్స్‌పై భారీ డిస్కౌంట్లు..
Discounts on Nissan cars : అటు పండుగ సీజన్ కాదు.. ఇటు డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజులూ కాదు.. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించి, సేల్స్‌ని పెంచుకునేందుకు దేశంలోని ఆటోమొబైల్ సంస్థలు డిస్కౌంట్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి నిస్సాన్ కూడా చేరింది. సంస్థకు చెందిన, మంచి డిమాండ్ ఉన్న మాగ్నైట్, కిక్స్ వంటి మోడల్స్‌పై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ వివరాలను ఓసారి చూద్దాం..
నిస్సాన్ మాగ్నైట్..
Discounts on Nissan Magnite : నిస్సాన్ మాగ్నైట్ ఎంవై22 (మేన్యుఫ్యాక్చరింగ్ ఇయర్)కు సంబంధించి.. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 20వేల తగ్గింపు లభిస్తోంది. ప్రీ మెయిన్టేనెన్స్ ప్యాకేజ్‌పై రూ. 12,100 తగ్గుతోంది. ఇక క్యాష్/ యాక్ససరీస్ రూపంలో మరో రూ. 12వేలు దిగొస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 15వేల తగ్గింపు లభిస్తోంది. లాయల్టీ బోనస్, ఆన్లైన్ బుకింగ్ బోనస్‌లు వరుసగా రూ. 10వేలు, రూ. 2వేలుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మోడల్‌పై రూ. 82,100 వరకు తగ్గింపు వస్తోంది.
Nissan Magnite on road price : ఇక నిస్సాన్ మాగ్నైట్ ఎంవై23 మోడల్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 20వేల తగ్గింపు లభిస్తోంది. ప్రీ మెయిన్టేనెన్స్ ప్యాకేజ్‌పై రూ. 6,950 తగ్గుతోంది. ఇక క్యాష్/ యాక్ససరీస్ రూపంలో మరో రూ. 12వేలు తగ్గింపు వర్తిస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10వేల తగ్గింపు లభిస్తోంది. లాయల్టీ బోనస్, ఆన్లైన్ బుకింగ్ బోనస్‌లు వరుసగా రూ. 10వేలు, రూ. 2వేలుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మోడల్‌పై రూ. 71,950 వరకు తగ్గింపు వస్తోంది.
Nissan new 7 seater MPV : నిస్సాన్ నుంచి త్వరలో కొత్త ఎంపీవీ రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.94లక్షల మధ్యలో ఉంది.
నిస్సాన్ కిక్స్..
Nissan Kicks on road price Hyderabad : నిస్సాన్ కిక్స్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ కింద్ రూ.30వేలు తగ్గుతోంది. క్యాష్ డిస్కౌంట్‌తో రూ. 19వేలు అదనంగా తగ్గుతుంది. ఇక కార్పొరేట్ డిస్కౌంట్ పేరుతో రూ. 10వేలను తగ్గిస్తోంది నిస్సాన్. ఆన్లైన్ బుకింగ్ బోనస్ (రూ. 2000)ను కూడా ఇస్తోంది. మొత్తం మీద నిస్సాన్ కిక్స్‌పై రూ. 61వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
మార్కెట్లో నిస్సాన్ కిక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 9.50లక్షలు- రూ. 14.90లక్షల మధ్యలో ఉంది.
* డిస్కౌంట్లు అనేవి మోడల్, నగరం, షోరూమ్‌కు తగ్గట్టు మారుతూ ఉంటాయి
* పూర్తి వివరాల కోసం మీ సమీప నిస్సాన్ డీలర్షిప్ షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.