Nissan Magnite Red Edition । నిస్సాన్ మాగ్నైట్‌లో సరికొత్త రెడ్ ఎడిషన్ కార్!-nissan magnite red edition launched at inr 7 86 lakh ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Nissan Magnite Red Edition Launched At Inr 7.86 Lakh

Nissan Magnite Red Edition । నిస్సాన్ మాగ్నైట్‌లో సరికొత్త రెడ్ ఎడిషన్ కార్!

HT Telugu Desk HT Telugu
Jul 13, 2022 02:38 PM IST

నిస్సాన్ బ్రాండ్ నుంచి పాపులర్ మాగ్నైట్ కారులో సరికొత్తగా Magnite RED ఎడిషన్ కారు విడుదలైంది. ఇది Onyx Black అలాగే Storm White అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మిగతా వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

Nissan Magnite Red Edition
Nissan Magnite Red Edition

నిస్సాన్ మాగ్నైట్ కార్ భారత మార్కెట్లో తిరుగులేని విజయం సాధించింది. ఇప్పుడు ఇందులో మాగ్నైట్ రెడ్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా ప్రకటించింది. ఈ సరికొత్త వాహనం ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.86 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ మూడు ఆప్షన్లలో లభిస్తుంది. బేసిక్ మోడల్ XV MT ధర, రూ. 7,86,500/- లభిస్తుండగా, మిడ్ రేంజ్ మోడల్ XV టర్బో MT ధర, - రూ. 9,24,500/- అలాగే టాప్ ఎండ్ మోడల్ XV టర్బో CVT ధర రూ. 9,99,900/- కు లభిస్తుంది. ఇవన్నీ ఎక్స్- షోరూమ్ ధరలు.

మాగ్నైట్ రెడ్ ఎడిషన్ XV MT వేరియంట్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 71 BHP వద్ద 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టర్బో XV MT అలాగే CVT ట్రిమ్‌లలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారు ఉంటుంది. ఈ ఇంజన్ 99 BHP వద్ద 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Nissan Magnite Red Edition ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇది నిస్సాన్ మాగ్నైట్ XV ట్రిమ్ ఆధారంగానే రూపొందించినప్పటికీ, RED ఎడిషన్ లో డిజైన్ పరంగా, ఫీచర్లపరంగా స్వల్ప మార్పులు ఉంటాయి. ఇందులో భాగంగా ఎక్స్‌టీరియర్‌లో ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ క్లాడింగ్, వీల్ ఆర్చ్‌లు, సైడ్ బాడీ క్లాడింగ్, బాడీ గ్రాఫిక్స్, టెయిల్ డోర్ గార్నిష్, ఎల్‌ఈడీ స్కఫ్ ప్లేట్ మొదలైన సరికొత్త మార్పులు పొందడంతో పాటు రెడ్ ఎడిషన్ అని సూచించే ప్రత్యేకమైన బ్యాడ్జ్ ఉంటుంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. RED ఎడిషన్ వేరియంట్‌లో సింబాలిక్‌గా రెడ్-థీమ్ డ్యాష్‌బోర్డ్, డోర్ సైడ్ ఆర్మ్‌రెస్ట్, సెంటర్ కన్సోల్‌లపై ఎరుపు రంగు ఎలిమెంట్స్‌తో వచ్చాయి. అదనంగా వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, ఎయిర్ ఫిల్టర్‌లను ఇచ్చారు.

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే WiFi కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED DRLలు, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

WhatsApp channel

టాపిక్