Discounts on Maruti cars : ఇగ్నిస్, సియాజ్పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్న మారుతీ సుజుకీ!
04 February 2023, 12:15 IST
- Discounts on Maruti Suzuki cars : మారుతీ సుజుకీ.. ఈ నెలలో రెండు మోడల్స్‌పై డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ వివరాలు మీకోసం..
మారుతీ ఇగ్నిస్, మారుతీ సియాజ్పై భారీ డిస్కౌంట్లు..!
Discounts on Maruti Suzuki cars : ఫిబ్రవరి నెలలో కేవలం రెండు మోడల్స్‌పైనే డిస్కౌంట్లు ఇస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ. అవి.. మారుతీ సుజుకీ ఇగ్నిస్, మారుతీ సుజుకీ సియాజ్. గ్రాండ్ విటారా, బలెనో, ఎక్స్ఎల్6 వంటి ప్రముఖ మోడల్స్‌పై ఎలాంటి ఆఫర్లు లేవు. ఈ క్రమంలో ఇగ్నిస్, సియాజ్ మోడల్స్‌పై ఉన్న డిస్కౌంట్లను ఓసారి చూద్దాం..
మారుతీ సుజుకీ ఇగ్నిస్..
మారుతీ సుజుకీ ఇగ్నిస్ ఎంటీలోని అన్ని వేరియంట్లపై రూ. 23వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15వేలు తగ్గుతుంది. ఇక కార్పొరేట్ డిస్కౌంట్ పేరుతో మరో రూ. 5వేల వరకు తగ్గింపు వస్తోంది. ఫలితంగా.. ఇగ్నిస్ ఎంటీ వేరియంట్స్‌పై రూ. 43వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.
Maruti Suzuki Ignis on road price : ఇక మారుతీ సుజుకీ ఇగ్నిస్ ఏజీఎస్పై క్యాష్ డిస్కౌంట్ కింద రూ. 10వేలు తగ్గుతోంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15వేల తగ్గింపు లభిస్తోంది. రూ. 5వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం మీద ఈ వెహికిల్‌పై రూ.30వేల డిస్కౌంట్ ఉంది.
Maruti Suzuki cars price hike : మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్కెట్లో మారుతీ సుజుకీ ధర రూ. 5.55లక్షలు- రూ. 7.87లక్షల (ఎక్స్‌షోరూం ప్రైజ్) మధ్యల ఉంది.
మారుతీ సుజుకీ సియాజ్..
Maruti Suzuki Ciaz on road price : మారుతీ సుజుకీ సియాజ్ ఎంవై22 (2022లో మేన్యుఫ్యాక్చరింగ్ చేసిన వెహికిల్స్)పై రూ. 15వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. అంటే మొత్తం మీద రూ. 45వేల వరకు తగ్గింపు ఉన్నట్టు.
ఇక సియాజ్ ఎంవై23 (సిగ్మా వేరియంట్ మినహాయించి)పై రూ. 10వేల క్యాష్బోనస్, రూ. 25వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేల వరకు కార్పొరేట్ బోనస్ వస్తోంది. ఫలితంగా మారుతీ సుజుకీ సియాజ్పై రూ. 40వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Maruti Suzuki Ciaz discounts : మారుతీ సుజుకీ ఎంవై23 సిగ్మాపై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. అయితే.. ఈ వెహికిల్‌పై రూ. 25వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5వేల వరకు కార్పొరేట్ బోనస్ లభిస్తోంది. మొత్తం మీద ఈ వెహికిల్‌పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది.
మారుతీ సుజుకీ సియాజ్ ధర రూ. 9.20లక్షలు- రూ. 12.19లక్షల (ఎక్స్‌షోరూం) మధ్యలో ఉంది.
*ఎంవై22 వెహికిల్‌ని కొనుక్కుంటే.. రీసేల్ వాల్యు తగ్గిపోతుంది.
* ఆ ఆఫర్లు ప్రాంతాలు, డీలర్షిప్ బట్టి మారుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం స్థానిక డీలర్షిప్ షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.