తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv 3xo Vs Tata Nexon : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

Mahindra XUV 3XO vs Tata Nexon : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

03 May 2024, 8:50 IST

google News
    • Mahindra XUV 3XO : మహింద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ టాటా నెక్సాన్​.. ఏది బెస్ట్​? ఏది కొంటే బెటర్​? ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్ టాటా​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్ టాటా​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్ టాటా​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

Mahindra XUV 3XO on raod price : మహీంద్రా ఎక్స్​యూవీ3ఎక్స్​ఓతో.. భారత దేశ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పటికే ఉన్న విపరీతమైన పోటీ.. మరింత పెరిగింది. ఈ కొత్త ఎస్​యూవీ.. ఇప్పటికే మార్కెట్​లో బెస్ట్​ సెల్లర్​గా ఉన్న టాటా నెక్సాన్​కి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ టాటా నెక్సాన్: ధర..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్​యూవీ ధర రూ .7.49 లక్షలు - రూ .15.49 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. మరోవైపు.. టాటా నెక్సాన్ ధర రూ. 8.15 లక్షల నుంచి రూ .15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

అంటే.. నెక్సాన్​తో పోలిస్తే మహీంద్రా కొత్త ఎస్​యూవీ తక్కువ బేస్ ధరతో వస్తుంది. కానీ కొత్త ఎస్​యూవీ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం.. టాటా మోడల్ కంటే ఖరీదైనది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ టాటా నెక్సాన్: డైమెన్షన్స్​..

Mahindra XUV 3XO on road price Hyderabad : మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా వచ్చిన మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్​యూవీ పొడవు 3,990 ఎంఎం, వెడల్పు 1,821 ఎంఎం, ఎత్తు 1,647 ఎంఎం. ఈ ఎస్​యూవీ 2,600 ఎంఎం వీల్ బేస్​తో వస్తుంది. ఇక టాటా నెక్సాన్ పొడవు 3,995 ఎంఎం, వెడల్పు 1,805 ఎంఎం, ఎత్తు 1,620 ఎంఎం, వీల్​బేస్​ 2,498 ఎంఎంతో వస్తుంది.

అంటే.. మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ.. నెక్సాన్ కంటే కొంచెం పొడవు తక్కువగా ఉంటుంది. అయితే టాటా ఎస్​యూవీ కంటే వెడల్పుగా ఉంటుంది. అలాగే, ఇది పొడవైన వీల్​బేస్​ని కలిగి ఉంది. అంటే టాటా నెక్సాన్​తో పోలిస్తే మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ క్యాబిన్ స్పేస్​ ఎక్కువగా ఉంటుందని అర్థం.

ఇదీ చూడండి:- Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వేరియంట్లు- వాటి ధరలు..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ వర్సెస్ టాటా నెక్సాన్: స్పెసిఫికేషన్లు

Tata Nexon on road price Hyderabad : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది రెండు వేర్వేరు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్​తో వస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీసీఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ 110 బీహెచ్​పీ పవర్, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజిన్ 128 బీహెచ్​పీ పవర్- 230 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్​లతో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ వేరియంట్ 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ సీఆర్డీఈ యూనిట్ నుంచి ఎనర్జీ పొందుతుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, ఆరు-స్పీడ్ ఏఎంటీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 115బీహెచ్​పీ పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓలానే.. టాటా నెక్సాన్ కూడా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. నెక్సాన్​లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 118.2బీహెచ్​పీ పవర్, 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 113బీహెచ్​పీ పవర్, 260ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా నెక్సాన్​లో ఐదు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఆరు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఆరు-స్పీడ్ ఏఎంటీ, ఏడు-స్పీడ్ డీసీటీ ట్రాన్స్​మిషన్ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ ప్రస్తుతం సీఎన్​జీ ఆప్షన్​లో అందుబాటులో లేదు. త్వరలోనే ఇది లాంచ్​ అవ్వొచ్చు!

తదుపరి వ్యాసం