Maruti Brezza vs Maruti Fronx : మారుతీ బ్రెజా వర్సెస్ మారుతీ ఫ్రాంక్స్.. ఏది కొంటే బెటర్?
20 January 2023, 10:47 IST
- Maruti suzuki Brezza vs Maruti suxuki Fronx : ఎస్యూవీ సెగ్మెంట్లో జోరు పెంచింది మారుతీ సుజుకీ. ఈ క్రమంలో మారుతీ సుజుకీ బ్రెజ్, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌ను పోల్చి.. ఈ రెండింట్లో ది బెస్ట్ ఏది? అనేది తెలుసుకుందాము.
మారుతీ బ్రెజ్- మారుతీ ఫ్రాంక్స్
Maruti suzuki Brezza vs Maruti suxuki Fronx : ఆటో ఎక్స్పో 2023లో మారుతీ సుజుకీ ప్రదర్శించిన వాహనాలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. 5 డోర్ జిమ్నీతో పాటు ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ వెహికిల్ కాన్సెప్ట్ ఆకర్షణగా నిలిచాయి. ఇక ఎస్యూవీ సెగ్మెంట్లో మార్కెట్ షేర్‌ను పెంచుకోవాలని చూస్తున్న మారుతీ సుజుకీ.. 'ఫ్రాంక్స్' అనే సబ్-కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్‌ను సైతం ప్రదర్శించింది. ఈ ఫ్రాంక్స్‌పై కారు ప్రియుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగింది. మరోవైపు మారుతీ సుజుకీ బ్రెజాకు మార్కెట్లో ఇప్పటికే మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో.. మారుతీ సుజుకీ బ్రెజాతో ఈ ఫ్రాంక్స్ ఎస్‌యూవీని పోల్చి.. ఈ రెండింట్లో ఏది కొంటే బెటర్? అని తెలుసుకుందాము.
మారుతీ బ్రెజ్ వర్సెస్ మారుతీ ఫ్రాంక్స్- డైమెన్షన్స్..
Maruti Fronx specifications : మారుతీ సుజుకీ బలెనో, మారుతీ బ్రెజాను కలగలిపితే ఈ ఫ్రాంక్స్ వస్తున్నట్టుగా దీని డిజైన్ చూస్తే అనిపిస్తుంది. బ్రెజాను ఎరోనా షోరూమ్‌లలో విక్రయిస్తుంటే.. ఫ్రాంక్స్‌ను నెక్సా ప్రీమియం సేల్స్ నెట్వర్క్ ద్వారా అమ్మేందుకు మారుతీ సుజుకీ ప్లాన్స్ చేస్తోంది.
మారుతీ బ్రెజా పొడవు 3,995ఎంఎం, వెడల్పు 1,790ఎంఎం, ఎత్తు 1,685ఎంఎం. ఇక ఈ వెహికిల్ వీల్‌బేస్ 2,500ఎంఎం ఉంటుంది. మరోవైపు మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ పొడవ 3,995ఎంఎం, వెడల్పు 1,765ఎంఎం, ఎత్తు 1,550 ఎంఎం. వీల్‌బేస్ వచ్చేసి 2,520ఎంఎం. డైమెన్షన్స్ పరంగా చూస్తే.. బ్రెజా కాస్త పెద్దగా కనిపిస్తుంది!
మారుతీ బ్రెజ్ వర్సెస్ మారుతీ ఫ్రాంక్స్- ఫీచర్స్..
Maruti Fronx features : ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్లోను బ్రెజ్, ఫ్రాంక్స్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. బ్రెజా క్యాబిన్లో బ్లాక్- బిజ్ డ్యూయెల్ టోన్ థీమ్ ఉంటే.. ఫ్రాక్స్‌లో బ్లాక్- బర్గండ్రీ కలర్ థీమ్ ఉంటుంది. స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. క్యాబిన్ లేఅవుట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. బ్రెజాల్ షార్ప్, ఎడ్జీ లుకింగ్ డాష్‌బోర్డ్ ఉండగా.. ఫ్రాంక్స్‌లో కర్వీ డాష్‌బోర్డ్ కనిపిస్తుంది.
ఈ రెండు ఎస్‌యూవీల్లోనూ 9ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ ఉంటుంది. వయర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అర్కామిస్ ఆడియో సిస్టెమ్, వయర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్స్ ఒకే విధంగా ఉన్నాయి. హెడ్స్ అప్డిస్ప్లే కూడా ఉండటం విశేషం. బ్రెజ్లో సన్‌రూఫ్, యాంబియెంట్ లైటింగ్ ఉండగా.. ఫ్రాంక్స్‌లో ఈ ఫీచర్స్ లేవు.
Maruti Brezza features : ఇక సేఫ్టీ విషయానికొస్తే.. మారుతీ బ్రెజా, మారుతీ ఫ్రాంక్స్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. కానీ బ్రెజాలో టాప్ ఎండ్ మోడల్‌కు మాత్రమే 6 ఎయిర్బాగ్స్ లభిస్తున్నాయి. ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబులిటీ ప్రొగ్రాం, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా వంటివి రెండింటికీ ఉన్నాయి.
మారుతీ బ్రెజ్ వర్సెస్ మారుతీ ఫ్రాంక్స్- ఇంజిన్..
మారుతీ బ్రెజ్ వర్సెస్ మారుతీ ఫ్రాంక్స్- ధర..
Maruti Brezza on road price in Hyderabad : హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ బ్రెజా ఎక్స్‌షోరూం ధర రూ. 8.19లక్షలు- రూ. 14.18లక్షల మధ్యలో ఉంటుంది.
Maruti Fronx price : మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ధరకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా.. మారుతీ బ్రెజా ధరకు సమీపంలోనే రూ. 8లక్షల వద్ద ఈ కారు ప్రారంభ ధర ఉంటుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.