Discounts on Maruti cars : ఇగ్నిస్​, సియాజ్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్న మారుతీ సుజుకీ!-huge discounts on these maruti cars check full details of offers on ignis ciaz here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Huge Discounts On These Maruti Cars Check Full Details Of Offers On Ignis, Ciaz Here

Discounts on Maruti cars : ఇగ్నిస్​, సియాజ్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్న మారుతీ సుజుకీ!

Sharath Chitturi HT Telugu
Feb 04, 2023 12:15 PM IST

Discounts on Maruti Suzuki cars : మారుతీ సుజుకీ.. ఈ నెలలో రెండు మోడల్స్​పై డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ వివరాలు మీకోసం..

మారుతీ ఇగ్నిస్​, మారుతీ సియాజ్​పై భారీ డిస్కౌంట్​లు..!
మారుతీ ఇగ్నిస్​, మారుతీ సియాజ్​పై భారీ డిస్కౌంట్​లు..!

Discounts on Maruti Suzuki cars : ఫిబ్రవరి నెలలో కేవలం రెండు మోడల్స్​పైనే డిస్కౌంట్​లు ఇస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. అవి.. మారుతీ సుజుకీ ఇగ్నిస్​, మారుతీ సుజుకీ సియాజ్​. గ్రాండ్​ విటారా, బలెనో, ఎక్స్​ఎల్​6 వంటి ప్రముఖ మోడల్స్​పై ఎలాంటి ఆఫర్లు లేవు. ఈ క్రమంలో ఇగ్నిస్​, సియాజ్​ మోడల్స్​పై ఉన్న డిస్కౌంట్లను ఓసారి చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

మారుతీ సుజుకీ ఇగ్నిస్​..

మారుతీ సుజుకీ ఇగ్నిస్​ ఎంటీలోని అన్ని వేరియంట్లపై రూ. 23వేల క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేలు తగ్గుతుంది. ఇక కార్పొరేట్​ డిస్కౌంట్​ పేరుతో మరో రూ. 5వేల వరకు తగ్గింపు వస్తోంది. ఫలితంగా.. ఇగ్నిస్​ ఎంటీ వేరియంట్స్​పై రూ. 43వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.

Maruti Suzuki Ignis on road price : ఇక మారుతీ సుజుకీ ఇగ్నిస్​ ఏజీఎస్​పై క్యాష్​ డిస్కౌంట్​ కింద రూ. 10వేలు తగ్గుతోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేల తగ్గింపు లభిస్తోంది. రూ. 5వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ పొందవచ్చు. మొత్తం మీద ఈ వెహికిల్​పై రూ.30వేల డిస్కౌంట్​ ఉంది.

Maruti Suzuki cars price hike : మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మార్కెట్​లో మారుతీ సుజుకీ ధర రూ. 5.55లక్షలు- రూ. 7.87లక్షల (ఎక్స్​షోరూం ప్రైజ్​) మధ్యల ఉంది.

మారుతీ సుజుకీ సియాజ్​..

Maruti Suzuki Ciaz on road price : మారుతీ సుజుకీ సియాజ్​ ఎంవై22 (2022లో మేన్యుఫ్యాక్చరింగ్​ చేసిన వెహికిల్స్​)పై రూ. 15వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 25వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 5వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ లభిస్తోంది. అంటే మొత్తం మీద రూ. 45వేల వరకు తగ్గింపు ఉన్నట్టు.

ఇక సియాజ్​ ఎంవై23 (సిగ్మా వేరియంట్​ మినహాయించి)పై రూ. 10వేల క్యాష్​బోనస్​, రూ. 25వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 5వేల వరకు కార్పొరేట్​ బోనస్​ వస్తోంది. ఫలితంగా మారుతీ సుజుకీ సియాజ్​పై రూ. 40వేల వరకు డిస్కౌంట్​ లభిస్తోంది.

Maruti Suzuki Ciaz discounts : మారుతీ సుజుకీ ఎంవై23 సిగ్మాపై ఎలాంటి క్యాష్​ డిస్కౌంట్​ లేదు. అయితే.. ఈ వెహికిల్​పై రూ. 25వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 5వేల వరకు కార్పొరేట్​ బోనస్​ లభిస్తోంది. మొత్తం మీద ఈ వెహికిల్​పై రూ. 30వేల వరకు తగ్గింపు ఉంది.

మారుతీ సుజుకీ సియాజ్​ ధర రూ. 9.20లక్షలు- రూ. 12.19లక్షల (ఎక్స్​షోరూం) మధ్యలో ఉంది.

*ఎంవై22 వెహికిల్​ని కొనుక్కుంటే.. రీసేల్​ వాల్యు తగ్గిపోతుంది.

* ఆ ఆఫర్లు ప్రాంతాలు, డీలర్​షిప్​ బట్టి మారుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం స్థానిక డీలర్​షిప్​ షోరూమ్​ను సంప్రదించాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్