Nissan 7 seater MPV : నిస్సాన్ నుంచి 7 సీటర్ ఎంపీవీ.. త్వరలోనే లాంచ్!
Nissan to launch new 7 seater MPV : నిస్సాన్ నుంచి త్వరలో ఒక 7 సీటర్ ఎంపీవీ రానుంది. ఇది రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది.
Nissan to launch new 7 seater MPV : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు రెనాల్ట్, నిస్సాన్‌లు తమ భాగస్వామ్య ఒప్పందంలో కీలక మార్పులు చేసుకున్న అనంతరం.. ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించాయి! ఈ క్రమంలోనే ఇండియాలో వరుసగా వాహనాలను లాంచ్ చేసేందుకు ఈ సంస్థలు భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు.. ఓ కొత్త 7 సీటర్ ఎంపీవీని ఇండియాలో త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది నిస్సాన్. ఈ ఎంపీవీ.. రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉంటుందని పేర్కొంది.
ట్రైబర్.. డస్టర్.. నిస్సాన్..!
ఎంపీవీతో పాటు పలు ఎస్‌యూవీలను కూడా ఇండియాలోకి తీసుకురానున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. మరోవైపు న్యూ జెన్ రెనాల్ట్ డస్టర్ లాంచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎస్‌యూవీని 5 సీటర్‌తో పాటు 7 సీటర్ వేరియంట్లలో లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెనాల్ట్ పేరు మీద ఉన్న డస్టర్‌కు.. సొంతం వర్షెన్‌లో నిస్సాన్ కూడా మరో పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Nissan Renault partnership : ఇండియా ఆటోమొబైల్‌లో ఏ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పైనా రెనాల్ట్, నిస్సాన్‌లు దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగానే బెస్ట్ సెల్లింగ్ మోడల్ రెనాల్ట్ క్విడ్‌కు ఈవీ టచ్ ఇచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రెనాల్ట్ క్విడ్ ఈవీని ఇప్పటికే లాంచ్ చేసింది ఆటో సంస్థ.
పోర్ట్‌ఫోలియోలోని మోడల్స్ ఇవే..
ప్రస్తుతానికైతే.. రెనాల్ట్ పోర్ట్‌ఫోలియోలో క్విడ్, ట్రైబర్, కైగర్ మోడల్స్ ఉన్నాయి. కైగర్‌కు ఇండియా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కావడం ఇందుకు కారణం. రెనాల్ట్ లైనప్‌లో క్విడ్ మోస్ట్ అఫార్డిబుల్ మోడల్‌గా కొనసాగుతోంది.
Renault Triber on road price in Hyderabad : ఇక నిస్సాన్ కిక్స్, మాగ్నైట్లు సైతం ఇండియా రోడ్ల మీద తిరుగుతున్నాయి. నిస్సాన్ మాగ్నైట్ రెనాల్ట్ ట్రైబర్‌ను కాస్త పోలి ఉంటుంది. ఈ రెండింట్లో వినియోగిస్తున్న ప్లాట్‌ఫామ్, ఇంజిన్, గేర్‌బాక్స్ ఒకటే. మరోవైపు ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీని ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించింది నిస్సాన్ సంస్థ.