Andhra Pradesh News Live December 3, 2024: Amaravati Plots Registration : అమరావతికి రైతులకు అలర్ట్, రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు కొత్తగా 9 కేంద్రాలు
03 December 2024, 19:57 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Amaravati Plots Registration : సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. రాజధాని పరిధిలోని 9 ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రారంభించినట్లు సీఆర్డీఏ ప్రకటించింది.
AP Irrigation Election : ఏపీ సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా డిసెంబర్ 5న జరగాల్సిన సాగునీట ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సమాచారం అందించింది.
SVBC Chairman Post : టీటీడీ పెండింగ్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎస్వీబీసీ ఛైర్మన్ సహా పలు టీటీడీ పోస్టులకు సినీ ప్రముఖులు మురళీ మోహన్, అశ్వనీదత్, రాజేంద్రప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Stella Ship Seized : రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ కాకినాడ పోర్టులో పట్టుబడిన స్టెల్లా షిప్ ను సీజ్ చేసినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణకు ఐదుగురి సభ్యులతో కమిటీ వేశామన్నారు. షిప్ లో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు.
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమీకృత పర్యటక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
AP Liquor Shops Close : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా 48 గంటల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 5న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు దగ్గరగా ఉన్న వైన్ షాపులను డిసెంబర్ 3 సాయత్రం 4 గం. నుంచి 5వ తేదీ సాయంత్రం 4 వరకు మూసివేయనున్నారు.
- AP SSC Exams : ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి విడుదల చేసింది. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
- Vizag Suicides: విశాఖలో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. షీలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎల్ వినాయక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న యువతీయువకులు పై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Alla Nani : ఏలూరు జిల్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇవాళ సైకిల్ పార్టీలో చేరనున్నారు. ఆయన రాకను స్థానిక టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నాని తమకు క్షమాపణలు చెప్పాకే.. పార్టీలో చేరాలని డిమాండ్ చేశారు. అయినా నాని రాకకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- AP Rajyasabha Elections: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు అగ్గిరాజేస్తున్నాయి. రాజ్యసభ రేసు నుంచి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తప్పుకున్నారు. పోటీకి నాగబాబు విముఖత చూపినట్టు తెలుస్తోంది. పదవీ కాలం తక్కువగా ఉండటంతో పాటు వ్యక్తిగత కారణాలతో పోటీ చేయడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది.
- Anantapur : అనంతపురంలో విషాదం నెలకొంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తల్లిబిడ్డ మరణించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Ongole Pocso Court: పాఠశాల విద్యార్ధినిని అపహరించిన వ్యాయామ ఉపాధ్యాయుడికి ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017 మైనర్ బాలిక పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు.
- APPSC Exams: ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్టేడ్ ఇచ్చింది. గతంలో విడుదలైన నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను ఖరారు చేసింది. 2025 మార్చి నెలలో ఈ నియామకాలకు సంబంధించిన పరీక్షలు జరుగనున్నాయి.
- AP Sachivalayalu: సమర్థవంతంగా పౌర సేవలు అందించడంలో విఫలమవుతున్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పేరుకు 15వేల సచివాలయాలు ఉన్నా వాటితో ప్రజలకు అందుతున్న పౌర సేవలు అంతంత మాత్రంగానే ఉండటంతో వాటిని పునర్ వ్యవస్థీకరించేందుకు రెడీ అవుతోంది.
- Amaravati Works: రాజధాని అమరావతిలో కీలక పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ అధారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 11,467 కోట్ల మేర పనులకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది.