Vizag Suicides: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య, సాఫ్ట్‌వేర్ అమ్మాయి.. క్యాటరింగ్ అబ్బాయి సహజీవనం..-couple commits suicide in visakhapatnam software girl catering boy cohabitate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Suicides: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య, సాఫ్ట్‌వేర్ అమ్మాయి.. క్యాటరింగ్ అబ్బాయి సహజీవనం..

Vizag Suicides: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య, సాఫ్ట్‌వేర్ అమ్మాయి.. క్యాటరింగ్ అబ్బాయి సహజీవనం..

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 03, 2024 12:03 PM IST

Vizag Suicides: విశాఖలో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. షీలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌ఎల్‌ వినాయక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న యువతీయువకులు పై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నంలో ప్రేమ జంట ఆత్మహత్య
విశాఖపట్నంలో ప్రేమ జంట ఆత్మహత్య

Vizag Suicides: విశాఖపట్నం షీలానగర్ లో ప్రేమజంట ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. షీలానగర్‌ పిఎస్‌ వెంకటేశ్వర కాలనీలో S.L. వినాయక్ ఎన్‌క్లేవ్ అపార్ట్మెంట్‌లో తెల్లవారుజామున అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మృతులను అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుస్మితగా పోలీసులు గుర్తించారు. మృతుడు దుర్గారావు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో క్యాటరింగ్ నడుపుతుండగా, మృతురాలు సాయి సుష్మిత ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆరు నెలలుగా అపార్ట్మెంట్లో ఉంటున్న పిల్లి దుర్గారావు వద్దకి మృతురాలు అప్పుడప్పుడు అపార్ట్మెంట్కు వచ్చి మృతురాలు సాయి సుస్మిత వచ్చి వెళుతుండేదని చెబుతున్నారు.

సోమవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు గుర్తించారు. ఇంట్లో గాజు గ్లాస్, టీవీ రిమోట్‌ పగిలిపోవడం పోలీసులు గుర్తించారు. మృతురాలు సాయి సుస్మిత కుటుంబ సభ్యులకి పోలీసులు సమాచారం అందించారు, మృతుడు ఫోన్ లాక్ అవ్వడంతో దానిని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే ఆత్మహత్యకు కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఇద్దరు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా క్షణికావేశంలో జరిగాయా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Whats_app_banner