APPSC Exams: ఏపీపీఎస్సీ అప్డేట్, ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ, పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్, డీఈఓ ఉద్యోగ పరీక్ష తేదీల ఖరారు-appsc finalizes exam dates for key positions ntr health university pollution control board and deo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Exams: ఏపీపీఎస్సీ అప్డేట్, ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ, పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్, డీఈఓ ఉద్యోగ పరీక్ష తేదీల ఖరారు

APPSC Exams: ఏపీపీఎస్సీ అప్డేట్, ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ, పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డ్, డీఈఓ ఉద్యోగ పరీక్ష తేదీల ఖరారు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 03, 2024 06:52 AM IST

APPSC Exams: ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్టేడ్ ఇచ్చింది. గతంలో విడుదలైన నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను ఖరారు చేసింది. 2025 మార్చి నెలలో ఈ నియామకాలకు సంబంధించిన పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల ఖరారు
ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల ఖరారు

APPSC Exams: ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షా తేదీలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లలో ఎన్టీఆర్ వైద్య విశ్వవి ద్యాలయంలోని అసిస్టెంట్ లైబ్రేరియన్ పరీక్షను 24, 25వ తేదీల్లో, కాలుష్య నియంత్రణ బోర్డులోని అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, ఆనలిస్ట్ గ్రేడ్-2 పరీక్షలను 25, 26న, విద్యాశాఖలోని డిప్యూటీ ఎడ్యుకేష నల్ ఆఫీసర్ పరీక్షను 26, 27న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది.

ఏపీపీఎస్సీ రాత పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే వెలువరించిన పలు నోటిఫికేషన్లకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించే తేదీలను కమిషనర్‌ ఖరారు చేసింది. వీటిలో ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్శిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్‌, ఏపీ పొల్యుషన్ కంట్రోల్‌ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్, గ్రేడ్‌ 2 అనలిస్ట్, విద్యాశాఖలో డిఈఓ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు ఉన్నాయి.

2024లో వెలువడిన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ అసిస్టెంట్‌ లైబ్రరేరియన్‌ పోస్టు కోసం జనరల్ ఆప్టిట్యూడ్‌, మెంటల్ ఎబిలిటీ పేపర్‌ 1 పరీక్షను మార్చి 25వ తేదీ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్‌ 2 పరీక్షను మార్చి 24వ తేదీ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.

2023లో వెలువడిన పొల్యుషన్ కంట్రోల్‌ బోర్డు అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్ ఉద్యోగానికి పేపర్‌ పరీక్షను ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌ 2 సబ్జెక్టు పేపర్‌ను మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.

2024లో వెలువడిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అనలిస్ట్‌ గ్రేడ్ 2 పోస్ట్‌కు పేపర్‌ 1 25వ తేదీ ఉదయం పేపర్‌ 2 పరీక్షను మార్చి 26వ తేదీ ఉదయం 9.20 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు.

2023లో వెలువడిన డిఈఓ ఉద్యోగాలకు పేపర్‌ 1 జనరల్ ఆప్టిట్యూడ్‌, మెంటల్ ఎబిలిటీ పేపర్‌ 1 పరీక్షను మార్చి 26వ తేదీ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తారు.

పేపర్ 2 ఎడ్యుకేషన్ 1 పరీక్షను మార్చి 27వ తేదీ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్ 3 పరీక్షను మధ్యాహ్నం రెండున్న నుంచి ఐదు వరకు నిర్వహిస్తారు.

అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్, అనలిస్ట్‌ గ్రేడ్ 2 ఉద్యోగాలకు జనరల్ స్టడీస్‌, మెంటల్ ఎబిలిటీ పరీక్షలను మార్చి 25వ తేదీ ఉదయం నిర్వహిస్తారు. ఈ సబ్జెక్టులో వచ్చిన మార్కులను సంబంధిత పోస్టులకు అర్హతగా పరిగణిస్తారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు.

Whats_app_banner