Amaravati Works: రూ.11,467 కోట్లతో అమరావతి పనులకు సీఆర్డీఏ అథారిటీ అమోదం, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల పనులకు రెడీ…-amaravati infrastructure projects get major funding 11 467 crore approved ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Works: రూ.11,467 కోట్లతో అమరావతి పనులకు సీఆర్డీఏ అథారిటీ అమోదం, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల పనులకు రెడీ…

Amaravati Works: రూ.11,467 కోట్లతో అమరావతి పనులకు సీఆర్డీఏ అథారిటీ అమోదం, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల పనులకు రెడీ…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 03, 2024 06:04 AM IST

Amaravati Works: రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులు చేప‌ట్టేందుకు సీఆర్డీఏ అధారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 11,467 కోట్ల మేర ప‌నుల‌కు అథారిటీ ఆమోదం తెలిపిన‌ట్లు మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సీఆర్డీఏ 41వ అథారిటీ స‌మావేశం జ‌రిగింది.

సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Amaravati Works: అమరావతి నిర్మాణ పనులు పరుగులు తీయనున్నాయి. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్రం గ్యారంటీ ఇవ్వడంతో నిధుల సమీకరణ అంశం కొలిక్కి వచ్చింది. తాజాగా ఐదేళ్ల క్రితం నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు తిరిగి టెండర్లను ఖరారు చేసేందుకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు.   మొత్తం 23 అంశాల‌కు అధారిటీ ఆమోదం తెలిపింది. 

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట తో అమరావతిని నిర్వీర్యం చేసిందని  మంత్రి నారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ‌రావ‌తి విష‌యంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామ‌ని తెలిపారు.

డిసెంబర్‌ నుంచి పనుల్లో పురోగతి…

సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ అథారిటీ స‌మావేశంలో 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు నిర్ణ‌యించామ‌న్నారు...సీడ్ కేపిట‌ల్ లో నిర్మించే 360 కిమీల ట్రంక్ రోడ్లలో 2498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం తెలిపింది..వరద నివారణ కు 1585 కోట్లతో పాల వాగు,కొండవీటి వాగు,గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి నిర్ణ‌యించాం. గెజిటెడ్,నాన్ గెజిటెడ్,క్లాస్ -4,అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3523 కోట్లతో చేపట్టేందుకు అధారిటీ ఆమోదం తెలిపింది.

రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్ లలో రోడ్లు,మౌళిక వసతుల కల్పనకు 3859 కోట్లకు అనుమతి ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు.వీటితో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కు అధారిటీ ఆమోదం తెలిపింద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌.ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామ‌న్నారు.

అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్ లోని 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హై కోర్టు భవనాలు డిజైన్లకు ఇప్ప‌టికే టెండర్లు పిలిచామ‌ని, ఈనెల 15 నాటికి డిజైన్ల టెండ‌ర్లు పూర్త‌వుతాయ‌న్నారు. డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు ఆయా భ‌వ‌నాల నిర్మాణాల‌కు కూడా టెండ‌ర్లు పిలుస్తామ‌న్నారు.సీఎం చంద్ర‌బాబు పిలుపుతో కేవ‌లం 58 రోజుల్లో రైతులు 34 వేల ఎక‌రాల భూమిని స్వ‌చ్చందంగా ఇచ్చార‌ని, రాబోయే మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామ‌న్నారు మంత్రి.

అథారిటీ ఆమోదించిన మొత్తం 23 అంశాలు...

1.సాంకేతిక క‌మిటీ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం కాంట్రాక్ట్ ఏజెన్సీల‌తో ఒప్పందాలు ర‌ద్దు చేసుకున్న‌ప్ప‌టి నుంచి 120 రోజుల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది.సాంకేతిక క‌మిటీ కి ప్ర‌భుత్వం ఆమోదం తెలుపుతూ న‌వంబ‌ర్ 27న జీవో ఎంఎస్ 123 విడుద‌ల‌ చేశారు. 

2.అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్ లో భాగంగా మ‌ధ్య‌లో నిలిచిపోయిన గెజిటెడ్ ఆఫీస‌ర్స్ టైప్ - 1,టైప్ - 2,క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్ మెంట్స్ పూర్తికి 594.54 కోట్ల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. 

మొత్తం 1440 అపార్ట్ మెంట్ ల పెండింగ్ ప‌నులు (ఆర్కిటెక్చ‌ర్,ప్లంబింగ్,శానిట‌రీ,ఫైర్,సెక్యూరిటీ వంటివి)పూర్తికి 594.54 కోట్ల తో పాల‌నాప‌ర‌మైన అనుమ‌తుల‌కు ఆమోదం ఇచ్చారు.రెండేళ్ల (DLP(DEFECT LIABILITY PERIOD)తో ప‌నులు చేప‌ట్టేలా ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణ‌యించారు. నిర్మాణంలో ఉన్న సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్తుల‌తో మొత్తం 14 ట‌వ‌ర్లు నిర్మాణం పూర్తి చేస్తారు.2017 అక్టోబ‌ర్ 11న ఆయా క్వార్ట‌ర్ల నిర్మాణానికి అనుమ‌తి ఇచ్చారు.మొత్తం 785 కోట్ల అంచ‌నాలు రూపొందించగా 408.63 కోట్ల ప‌నులు 2019 కంటే ముందే పూర్తి అయ్యాయి.

3.గెజిటెడ్ ఆఫీస‌ర్స్ టైప్ - 1, టైప్ - 2, క్లాస్ - 4 ఉద్యోగుల క్వార్ట‌ర్ల వ‌ద్ద మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ప‌నులను 226.26 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది.

తాగునీరు, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి, వ‌ర‌ద నీటి కాల్వ‌ల ప‌నులు, వీధి దీపాలు, అంత‌ర్గ‌త ర‌హ‌దారులు, బిల్డింగ్ సెక్యూరిటీ, ల్యాండ్ స్కేపింగ్ ప‌నుల‌ను చేప‌ట్టేందుకు 2018 డిసెంబ‌ర్ 18న 121.34 కోట్ల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. మార్చి 2019 లో ప‌నులు ప్రారంభం అయ్యాయి. జూన్ 2019 లో నిలిచిపోయాయి. తిరిగి కాంట్రాక్ట్ ఏజెన్సీకి రెండేళ్ల (DLP(DEFECT LIABILITY PERIOD)తో ప‌నులు చేప‌ట్టేలా ఇచ్చేందుకు నిర్ణ‌యించారు. 

4.నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్ల ఇళ్ల‌కు మిగిలిన ప‌నులను 607.50 కోట్ల‌తో చేప‌ట్ట‌డానికి అథారిటీ ఆమోదం లభించింది. ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీ నిధులు సమకూరుస్తారు. మొత్తం 1140 ఫ్లాట్లు 12 ట‌వ‌ర్ల‌లో సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్తుల‌తో నిర్మాణం చేపడతారు. 

5,నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్ల ఇళ్ల‌కు మిగిలిన ప‌నులు, మౌలిక వ‌స‌తుల‌ను 594.36 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది.  మొత్తం 9 ట‌వ‌ర్లు,సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్థులు తో మొత్తం 855 ఫ్లాట్లు నిర్మిస్తారు. ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీ నిధులు సమకూరుస్తారు.

6.ఆలిండియా స‌ర్వీస్ అధికారులు(ముఖ్య కార్య‌ద‌ర్శులు,కార్య‌ద‌ర్శులు)కు 115 బంగ్లాల పెండింగ్ ప‌నులను 516.6 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపారు.

2017 డిసెంబ‌ర్ 27వ తేదీన ఆలిండియా స‌ర్వీస్ అధికారులైన ముఖ్య కార్య‌ద‌ర్శులు,కార్య‌ద‌ర్శుల కోసం జీ ప్ల‌స్ వ‌న్ విధానంలో నిర్మించేందుకు 274.5 కోట్ల‌కు పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు ఇచ్చారు.మే 2018 లో ప‌నులు ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ జూన్ 2019 లో ప‌నులు నిలిచిపోయాయి. తిరిగి ఆ ప‌నుల‌ను పూర్తి చేసేందుకు 516.6 కోట్ల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది.మొత్తం 5,28,125 చ‌.అడుగుల విస్తీర్ణంతో ఈ 115 బంగ్లాలు నిర్మాణం చేపడతారు.రెండేళ్ల వ్యవధితో ప‌నులు చేప‌ట్టేలా ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణ‌యించారు. 

ల్యాండ్‌ పూలింగ్‌ జోన్ల లో మొత్తం 8496.30 ఎకరాల్లో మౌళిక వ‌స‌తులను 3859.66 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అధారిటీ ఆమోదం తెలిపింది.  రైతుల‌కు తిరిగిచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీం జోన్ల‌లో మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మైన నిధులు విడుద‌ల‌కు ఆమోదం తెలిపారు. రోడ్లు,వ‌ర‌ద నీరు కాల్వ‌లు,మంచినీటి స‌ర‌ఫ‌రా,డ్రైనేజి,ప‌వ‌ర్ డ‌క్ట్స్,రీయూజ్ వాట‌ర్ నెట్ వ‌ర్క్,వాకింగ్ ట్రాక్,సైకిల్ ట్రాక్ ల‌తో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌ిస్తారు. 2019జూన్ కు ముందు రూ. 3306.59 కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టాల‌ని నిర్ణయించగా స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం 3859.66 కోట్ల‌కు ఆమోదం తెలిపారు. 

అభివృద్ధి చేసే ప్రాంతాలు..

7. జోన్ - 1ఎ - నెక్క‌ల్లు - 1390.1 ఎక‌రాలు

8.జోన్ - 1బి - నెక్క‌ల్లు,శాఖ‌మూరు - 760.27 ఎక‌రాలు

9.జోన్ - 2బి - అనంత‌వ‌రం,నెక్క‌ల్లు,నేల‌పాడు,శాఖ‌మూరు,తుళ్లూరు గ్రామాల్లో కొన్ని భాగాలు - 1223.76 ఎకరాలు

10.జోన్ - 2బి - అనంత‌వ‌రం,నెక్క‌ల్లు,నేల‌పాడు,శాఖ‌మూరు,తుళ్లూరు గ్రామాల్లో కొన్నిభాగాలు - 862.80 కఎకరాలు

11.జోన్ - 5బి - అబ్బ‌రాజుపాలెం,బోరుపాలెం,దొండ‌పాడు,రాయ‌పూడి - 1788.42 ఎకరాలు

12.జోన్ - 5డి - అబ్బ‌రాజు పాలెం,తుళ్లూరు,రాయ‌పూడి - 1488.81ఎకరాలు

13.జోన్ - 6 - కొండ‌మ‌రాజుపాలెం,రాయ‌పూడి - 981.72 ఎకరాలు

15.అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ గ‌తంలో ఇచ్చిన కాంట్రాక్ట్ లు ప్యాకేజి 1 నుంచి ప్యాకేజి 22 వ‌ర‌కూ,సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన ప్యాకేజిలు ర‌ద్దుకు అధారిటీ ఆమోదం తెలిపింది. 

ట్రంక్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప‌నులు, వ‌ర‌ద నివార‌ణ ప‌నులు,గ్రీన‌రీ ప‌నులుకు గ‌తంలో ఇచ్చిన కాంట్రాక్ట్ లు ర‌ద్దు చేశారు. 

16.ప్ర‌పంచ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ నిధుల నుంచి అమ‌రావ‌తిలోని వ‌ర‌ద నివార‌ణ ప‌నులు చేపడతారు. మూడు ప్యాకేజిలుగా చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. 

అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెండ్ కార్పొరేష‌న్ బోర్డు 45వ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం వ‌ర‌ద నివార‌ణ ప‌న‌నులు మూడు ప్యాకేజిలుగా చేప‌ట్ట‌నున్నారు..ప్యాకేజి -1 ను 590.74 కోట్లు,ప్యాకేజి -2 ను 386.95 కోట్లు,ప్యాకేజి - 3ను 608.26 కోట్లు క‌లిపి మొత్తంగా 1585.95 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపారు. 

17.కేపిట‌ల్ సిటీలో ఎన్ - 9 రోడ్డు కు ప్యాకేజి 4 కింద మిగిలిపోయిన మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం 522.39 కోట్లకు పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు మంజూరుకు అథారిటీ ఆమోదం తెలిపింది. 

ఎన్ 9 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 522.39 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపారు. 

18.కేపిట‌ల్ సిటీలో ఎన్ - 18 రోడ్డుకు ప్యాకేజి - 5 కింద మిగిలిపోయిన మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందు 98.17 కోట్ల‌కు ఆమోదం తెలిపారు. 

ఎన్ - 18 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 98.17 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం లభించింది. 

19.కేపిట‌ల్ సిటీలో ఎన్ - 15 రోడ్డుకు ప్యాకేజి - 6 కింద మిగిలిపోయిన మౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 482.01 కోట్ల‌కు ఆమోదం.

ఎన్ - 15 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 482.01 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

20.కేపిట‌ల్ సిటీలో E6 రోడ్డుకు ప్యాకేజి - 7 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 452.96 కోట్ల‌కు ఆమోదం.

E6 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 452.96 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

21.కేపిట‌ల్ సిటీలో E8 రోడ్డుకు ప్యాకేజి - 8 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 522.92 కోట్ల‌కు ఆమోదం.

E8 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 522.92 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

22.కేపిట‌ల్ సిటీలో N11 రోడ్డుకు ప్యాకేజి - 9 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌళిక వ‌స‌తులు క‌ల్పించేందుకు 419.85 కోట్ల‌కు ఆమోదం.

N11 రోడ్డు వెంబ‌డి రోడ్లు,తాగునీరు,వ‌ర‌ద నీటి కాల్వ‌లు,యుటిలిటీ డ‌క్ట్స్,పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం 419.85 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు,ఆసియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

23.అమ‌రావ‌తిలో ట్రండ్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్,వ‌ర‌ద నీటి యాజ‌మాన్యం,గ్రీన‌రీ వ‌ర్క్స్ కు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ క‌న్స‌ల్టెంట్ నియామ‌కానికి అథారిటీ ఆమోదం.

ప్ర‌పంచ బ్యాంకు,ఏడీబీతో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు క‌న్స‌ల్టెంట్ నియామ‌కానికి నిర్ణ‌యం.

హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

అమ‌రావ‌తిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ చేప‌ట్టేందుకు స‌వ‌రించిన అంచనాల‌తో 984.10 కోట్ల‌కు ఆమోదం తెలిపారు. కొత్త‌గా టెండ‌ర్లు పిలిచేందుకు అనుమ‌తించారు. ప్రాజెక్ట్ ఆల‌స్యంతో న‌ష్ట‌పోయిన 270.71 కోట్లు ప్ర‌భుత్వం చెల్లించేందుకు అనుమ‌తించింది.

మొత్తం 12 ట‌వ‌ర్లు జీ ప్ల‌స్ 18 అంత‌స్తుల్లో 1200 ఫ్లాట్లు నిర్మిస్తారు.మొత్తంగా 20,89,260 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మాణం చేపడతారు. 

2018లో వంద శాతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా సీఆర్డీఏ చేప‌ట్టింది..190 ఫ్లాట్లు మిన‌హా మిగిలిన అన్ని ఫ్లాట్లు విక్రయించారు. 

గ‌తంలో 2018-19 అంచ‌నాల ప్ర‌కారం 720.5 కోట్ల‌కు ఆమోదం తెలిపారు.2024-25 ధ‌ర‌ల ప్ర‌కారం 930 కోట్లు..దీనికి అద‌నంగా పెరిగిన లిఫ్ట్ చార్జీలు,లేబ‌ర్, డిజైన్ చార్జీలు,మెటీరియ‌ల్ ధ‌ర పెర‌గ‌డంతో ప్ర‌కారం 984.10 కోట్ల‌కు చేరింది.మొత్తం అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ల్యాండ్ ధ‌ర 59.32 కోట్లు(ఎక‌రాకు 4.1 కోట్ల చొప్పున 14.46 ఎక‌రాలు కేటాయించారు),నిర్మాణ ధ‌ర 984.10 కోట్లు,ఇత‌ర ఛార్జీలు 37.76 కోట్లు క‌లిపి మొత్తం 1081.18 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. 

చ‌ద‌ర‌పు అడుగు 4049 రూపాయిల చొప్పున 1200 ఫ్లాట్ల‌కు 845.89 కోట్లు ఆదాయం వ‌స్తుంది. ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డంతో 235.29 కోట్లు, రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌డ్డీ చెల్లింపున‌కు 35.42 కోట్లు ఖ‌ర్చు క‌లిపితే మొత్తం 270.71 కోట్లు న‌ష్టం వ‌స్తుంది.దీనిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

Whats_app_banner