Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు
Ivy gourd and Diabetes:దొండకాయలు తినడం వల్ల తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. డైటరీ ఫైబర్‌తో నిండిన దొండకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
Ivy gourd and Diabetes: దొండకాయను భారతీయ వంటకాల్లో అధికంగా వాడుతారు. గుజరాత్, గోవా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లోనూ దీన్ని వండుతారు. దీన్ని టెండ్లీ, కోవాక్కై, దొండకాయ, టిండోరా, తొండే కాయ్, టోరుని ఇలా ప్రాంతీయంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. క్రీస్తుపూర్వం 5000-6000 సంవత్సరాల నాటి నుంచి దొండకాయ తింటున్నట్టు పురాతన గ్రంథాలలో ప్రస్తావించారు. దీనని అనేక వ్యాధులు, అంటువ్యాధుల చికిత్సకు ఉపయోగింవారు. పురాతన ఆయుర్వేద వైద్యులు ఈ కూరగాయను పంచకర్మ చికిత్సతో సహా వివిధ చికిత్సలలో ఉపయోగించేవారు. పేగు పురుగులు, చర్మ వ్యాధులు, మధుమేహం చికిత్సకు కూడా దీనిని వాడే వారని చెబుతారు.
దొండకాయతో ఉపయోగాలు
దొండకాయలో బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె జబ్బులను నివారించడానికి ఇది బాగా సహాయపడుతుంది. తక్కువ కేలరీలున్న కూరగాయ ఇది. ఇది అధిక నీటి కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు, విటమిన్లను కలిగి ఉంటుంది. ఇనుము, కాల్షియం, విటమిన్లు బి1, విటమిన్ బి2, డైటరీ ఫైబర్ అధికంగా ఇందులో ఎక్కువ. దీన్ని తినడం వల్ల మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
డయాబెటిస్ అడ్డుకునే శక్తి…
మీరు డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా లేదా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా, దొండకాయలు తింటూ ఉండాలి. మెరుగైన జీవక్రియ, జీర్ణక్రియ, మూత్రపిండాల్లో రాళ్లు నివారించడం, అలెర్జీల నుండి రక్షణ, అలసట నుండి ఉపశమనం పొందడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి దొండకాయలు మాత్రమే కాదు వేర్లు, ఆకుల రసాన్ని డయాబెటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు.
1. పోషకాలు సమృద్ధిగా…
దొండకాయ పోషకాలు నిండిన కూరగాయ. వీటిలో విటమిన్లు ఎ, సి నిండుగా ఉంటాయి. మంచి కంటి చూపును అందించేందుకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి దొండకాయ అవసరం. అదనంగా, ఇది డైటరీ ఫైబర్‌ను అందిస్తుంది, ఇది జీర్ణ ఆరోగ్యానికి అవసరం.
2. బరువు తగ్గేందుకు
బరువు తగ్గాలనుకునేవారికి ఆహారంలో దొండకాయ సరైనది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలో నీటి కంటెంట్, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తింటే చాలా తక్కువ కేలరీలు శరీరంలో చేరుతాయి. దీని వల్ల బరువు తగ్గుతారు.
3. నియంత్రణలో మధుమేహం
మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద వైద్యంలో సాంప్రదాయకంగా దొండకాయను ఉపయోగిస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. భోజనంలో దొండకాయ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
4. గుండె ఆరోగ్యానికి
దొండకాయలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీనిలో బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తాయి. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
5. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది
దొండకాయలోని ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. అధిక నీటి కంటెంట్ జీర్ణవ్యవస్థను కాపాడుతుంది.
6. రోగనిరోధక శక్తికి…
దొండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ముఖ్యమైన పోషకం. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తి, వాటి పనితీరును పెంచుతుంది. ఇవి అంటువ్యాధులతో పోరాడటానికి అవసరం. దొండకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బలమైన రోగనిరోధక శక్తి అందుతుంది.
7. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు
దొండకాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి ఎంతో అవసరం. ఇందులో ఉండే వివిధ ఫైటోన్యూట్రియెంట్స్ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్ వంటి పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.