చలికాలంలో మెరిసే చర్మం కోసం యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 20, 2023
Hindustan Times Telugu
చర్మం ఆరోగ్యంలో యాంటీఆక్సిడెంట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తీసుకునే ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటే చర్మం మెరుగ్గా ఉంటుంది. అలా.. ఈ చలికాలంలో చర్మం మెరుపు పెరిగేందుకు ఉపయోగపడే ఐదు రకాల యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవే.
Photo: Pexels
బ్లూబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మపు కణాలను ఇవి సంరక్షించగలవు. చర్మపు ఇమ్యూనిటినీ ఇది పెంచుతుంది.
Photo: Pexels
చిలగడదుంపల్లో (స్వీట్ పొటాటో) బీటా-కరోటీన్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మపు కణాలు ఉత్పత్తి అయ్యేలా ఇవి చేయగలవు.
Photo: Pexels
బ్రకోలీ కూరగాయలో విటమిన్ ఏ, బీ,సీ ఉంటాయి. అందుకే మీ ఆహారంలో దీన్ని తీసుకున్నా చర్మం మెరుపు పెరుగేందుకు సహకరిస్తాయి. చర్మాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజీ నుంచి రక్షించుకునేందుకు సాయపడతాయి.
Photo: Pexels
అవకాడోల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అవకాడోలు చర్మాన్ని తేమగా ఉండటంతో పాటు సహజంగా మెరుపును అందిస్తాయి.
Photo: Pexels
నారింజ, ద్రాక్ష, నిమ్మ, చీనీ లాంటి సిట్రస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్ నిండిఉంటాయి. దీంతో ఇవి చర్మపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
Photo: Pexels
మహిళలు ఎముకల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సి వస్తుంది. ఎముకలు బలాన్ని కోల్పోతే నడవడం కష్టంగా మారవచ్చు.