Dondakaya Menthikaram: దొండకాయ ఇలా మెంతికారం వేసి వండి చూడండి, అన్నంలోకి అదిరిపోతుంది-dondakaya menthikaram recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dondakaya Menthikaram: దొండకాయ ఇలా మెంతికారం వేసి వండి చూడండి, అన్నంలోకి అదిరిపోతుంది

Dondakaya Menthikaram: దొండకాయ ఇలా మెంతికారం వేసి వండి చూడండి, అన్నంలోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Apr 27, 2024 05:30 PM IST

Dondakaya Menthikaram: దొండకాయ ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. అయితే దొండకాయ కూరను మెంతికారం వేసి వండి చూడండి. కొత్తగా, రుచిగా ఉంటుంది. దీన్ని వండడం చాలా సులువు.

దొండకాయ మెంతికారం రెసిపీ
దొండకాయ మెంతికారం రెసిపీ

Dondakaya Menthikaram: దొండకాయ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. కానీ దీన్ని ఇష్టంగా తినే వారి సంఖ్య చాలా తక్కువ. దొండకాయ మెంతికారం కూర వండితే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని కూరలా వండుకోవచ్చు లేదా వేపుడులా చేసుకోవచ్చు. సాంబారు, పప్పు వండుకున్నప్పుడు దానికి జోడీగా ఈ దొండకాయ మెంతికారం వండి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద వాళ్లతో పాటు పిల్లలకూ ఇది బాగా నచ్చుతుంది. దీన్ని వండడం చాలా సులువు. ముందుగా మెంతికారాన్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ దొండకాయ మెంతి కార కూర వండుకోవాలి.

దొండకాయ మెంతికారం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

నువ్వులు - రెండు స్పూన్లు

శనగపప్పు - రెండు స్పూన్లు

మినప్పప్పు - రెండు స్పూన్లు

మెంతులు - ఒక స్పూన్

ధనియాలు - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూన్

ఎండుమిర్చి - ఆరు

పల్లీలు - మూడు స్పూన్లు

నువ్వులు - రెండు స్పూన్లు

దొండకాయలు - అరకిలో

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

నూనె - సరిపడినంత

దొండకాయ మెంతికారం రెసిపీ

1. ముందుగా మసాలా పొడిని తయారు చేసుకోవాలి.

2. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలు వేసి వేయించాలి.

3. అవి బాగా వేగాక శెనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి వేయించాలి.

4. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.

5. ఇవన్నీ వేగాక నువ్వులను చివరిలో వేసి 30 సెకన్ల పాటు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

6. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి. అంతే మెంతికారం రెడీ అయినట్టే.

7. ఇప్పుడు దొండకాయలను నిలువుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

8. మీకు నిలువుగా నచ్చకపోతే చక్రాల్లా కోసుకున్నా మంచిదే.

9. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

10. నూనె వేడెక్కాక దొండకాయలను వేసి బాగా వేయించాలి.

11. అందులోనే ఉప్పు, పసుపు వేసి ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించుకోవాలి.

12. దొండకాయ ముక్కలు బాగా వేగాక ముందుగా మిక్సీ పట్టిన మెంతికారం పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

13. మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి.

14. కరివేపాకులను కూడా చల్లుకోవాలి. ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేయాలి.

15. అంతే దొండకాయ మెంతికారం రెడీ అయినట్టే.

16. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

17. సాంబారు అనుకున్నప్పుడు జోడీగా ఈ దొండకాయ మెంతికారం ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటుంది.

ఈ రెసిపీలో మెంతులను ఒక స్పూను వేస్తాము, కాబట్టి రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణంగా మెంతులను కూరల్లో ఎక్కువగా వేయరు. అవి చేదు రుచిని ఇస్తాయని అనుకుంటారు. ఇలా మసాలా పొడిగా మార్చి వేసుకుంటే మెంతులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దొండకాయ మెంతికారం రెసిపీ లో అన్ని ఆరోగ్యానికి మేలు చేసే వినియోగించాము. కాబట్టి దీన్ని తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.

Whats_app_banner