Eating Eggs in Winter | చలికాలంలో రోజూ గుడ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే!-must eat 2 eggs per day that keeps winter blues at bay ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating Eggs In Winter | చలికాలంలో రోజూ గుడ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే!

Eating Eggs in Winter | చలికాలంలో రోజూ గుడ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే!

HT Telugu Desk HT Telugu
Jan 09, 2023 12:17 PM IST

Eating Eggs in Winter: గుడ్లు చాలా మందికి ఇష్టమైన ఆహారం, గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి, తింటే ఎంతో ఆరోగ్యం కూడా. అయితే ఈ చలికాలంలో గుడ్లు తినడం మంచిదని చాలా మంది భావిస్తారు.

Eating Eggs in Winter:
Eating Eggs in Winter: (Pixabay)

ప్రతి కాలానికి ఏవో కొన్ని సైడ్ ఎఫెక్టులు ఉన్నట్లుగానే, ఈ చలికాలంలోనూ అలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ, శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది, ఎముకలలో నొప్పి మొదలవుతుంది, జుట్టు రాలడం, గోళ్లల్లో సమస్యలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆహారంలో చేసుకొనే చిన్నచిన్న మార్పులు అనేక దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

చలికాలంలో గుడ్లు తినడం చాలా ప్రయోజనకరమని మీరు తరచుగా వినే ఉంటారు. చల్లటి వాతావరణంలో గుడ్లు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. గుడ్లలో మీ ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అయితే మరీ ఎక్కువ కాకుండా, ఈ సీజన్ లో రోజూ 2 గుడ్లు తినడం ద్వారా ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Benefits of Eating Eggs in Winter- చలికాలంలో గుడ్లు తింటే ప్రయోజనాలు

చలికాలంలో ఎందుకోసం గుడ్లు తినాలి, రోజూ రెండు గుడ్లు తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.

జలుబు, దగ్గు నివారణకు

శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందువల్ల ప్రజలు సులభంగా దగ్గు, జలుబులను కలిగించే ఫ్లూ బారిన పడతారు. ఇలాంటప్పుడు గుడ్డులోని ప్రొటీన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు, శరీర బలాన్ని పెంచుతుంది. ఇది కాకుండా, ఇందులో విటమిన్లు B6 , B12 ఉన్నాయి, ఈ పోషకాలు ఫ్లూని నివారించడంలో సహాయపడతాయి.

ఎముకల ఆరోగ్యానికి గుడ్లు

గుడ్డు తినడం ద్వారా శరీరంకు కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. గుడ్లలో విటమిన్ డి, జింక్ ఆస్టియోజెనిక్ బయోయాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి లుటిన్, జియాక్సంతిన్ వంటి మూలకాలను పెంచి, ఎముకలను లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రకంగా చలికాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను నివారించవచ్చు.

విటమిన్ డి లోపం తలెత్తకుండా

శీతాకాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తవచ్చు. మనకు రోజుకి 10 mcg డి విటమిన్ అవసరం. ఒక గుడ్డులో 8.2 mcg విటమిన్ డి ఉంటుంది, అంటే సిఫార్సు చేసిన డైటరీ విటమిన్ డిలో 82%. కాబట్టి రోజూ రెండు గుడ్లు తినడం ద్వారా, మీకు కావాల్సిన మోతాదులో విటమిన్ డిను పొందవచ్చు. ఎండలో తిరగని వారికి ప్రతిరోజూ గుడ్లు తినేందుకు ఇది మంచి కారణం.

విటమిన్ B12 లోపం కోసం గుడ్లు

ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే విటమిన్ B12 మోతాదులో, సుమారు 50 శాతం రెండు గుడ్లు తింటే లభిస్తుంది. ఉడికించిన ఒక కోడి గుడ్డులో 0.6 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. విటమిన్ బి12 లోపం రాకుండా ఉండాలంటే రెండు గుడ్లను పచ్చసొనతో పాటుగా మొత్తం తినాల్సిందే. ఎందుకంటే విటమిన్ B12 చాలా వరకు పచ్చసొన నుండి లభిస్తుంది.

చలికాలంలో జుట్టు రాలడం నివారించుటకు

శీతాకాలంలో జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది, గుడ్లు తినడం ద్వారా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. కోడిగుడ్లలో విటమిన్ B12, B5, బయోటిన్, రిబోఫ్లావిన్, థయమిన్ లాంటి B కాంప్లెక్స్ D, E విటమిన్లతో పాటు సెలీనియం, ఐరన్, ఫోలేట్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎంజైమ్‌లు ఉత్పత్తిని పెంచి జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం