తెలుగు న్యూస్ / ఫోటో /
Vitamin B12 | బాగా నిద్రపోయి లేచిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తే.. అది ఇదే!
- ఒంట్లో ఏదో తెలియని అసౌకర్యం. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసటగా అనిపించడం. పాదాలలో తిమ్మిరితో కూడిన నొప్పి. ఏదో మైకం కమ్మినట్లుగా తలతిప్పినట్లు ఉంటే ఇలాంటి లక్షణాలన్నీ విటమిన్ B12 లోపాన్ని సూచిస్తాయి. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..
- ఒంట్లో ఏదో తెలియని అసౌకర్యం. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసటగా అనిపించడం. పాదాలలో తిమ్మిరితో కూడిన నొప్పి. ఏదో మైకం కమ్మినట్లుగా తలతిప్పినట్లు ఉంటే ఇలాంటి లక్షణాలన్నీ విటమిన్ B12 లోపాన్ని సూచిస్తాయి. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే..
(1 / 6)
సాధారణంగా మాంసం తినని శాఖాహారుల్లో విటమిన్ B12 లోపం ఏర్పడుతుంది. అలాగే ఒత్తిడి స్థాయిలు పెరిగినపుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఎలాంటి కారణం లేకుండానే చిరాకుగా అనిపిస్తే మీకు విటమిన్ B12 లోపం ఏర్పడినట్లు అర్థం. దీనిని అధిగమించేందుకు ప్రత్యేకంగా సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. B12 లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి సంకేతాలు ఉంటాయి, పరిష్కార మార్గాలను పోషకాహార నిపుణులు స్మృతి కొచర్ పంచుకున్నారు.(Shutterstock)
(2 / 6)
మీరు చాలా గంటలు నిద్రపోయిన తర్వాత కూడా ఇంకా మబ్బుగా, అలసటగా అనిపిస్తుంది. ఏ పనిచేయాలన్నా కూడా బలం కూడగట్టుకోలేకపోతే దీనికి కారణం శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు పడిపోవటం.(Shutterstock)
(3 / 6)
పనిచేయాలంటే ఆసక్తి కలగకపోవడం, చేస్తున్న పనిని ఏకాగ్రతతో చేయలేకపోతే లేదా చిరాకు కలుగుతుంటే ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.(Unsplash)
(5 / 6)
విటమిన్ B12 లోపం తలెత్తినపుడు ఎలాంటి నిర్ధిష్టమైన కారణం లేకుండా అరి చేతులు, పాదాలు చల్లగా అవుతాయి. పడుకొని లేచిన తర్వాత కూడా దిమ్మతిరిగినట్లు, మైకం కమ్మినట్లు, వణుకుపుట్టినట్లు అనిపిస్తుంది.(Shutterstock)
(6 / 6)
మీ నాలుక రూపాన్ని బట్టి కూడా మీ శరీరంలోని పోషకాహార లోపాల గురించి తెలుసుకోవచ్చు. మీ నాలుక ఎరుపు రంగులో వాచినట్లుగా ఉంటే ఉంటే అది కూడా విటమిన్ B12 లోపాన్ని సూచిస్తుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరైన రిపోర్ట్ తెలుస్తుంది. దాని ప్రకారం వైద్యులు విటమిన్లు, బలం కోసం ఇతర పోషకాల సప్లిమెంట్లను ప్రిస్క్రైబ్ చేస్తారు.(Unsplash)
ఇతర గ్యాలరీలు